krishna pushkaralu 5 09072016

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్లే లెక్క. ఒక సంవత్సరం కాలంపాటు బృహస్పతి ఆయా రాశులలో ఉండడం జరుగుతుంది. ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, సంవత్సరాంతంలోని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలవడం జరుగుతుంది. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది.

పుష్కర అనే శబ్దానికి నీరు, వరుణుని కుమారుడు వంటి అనేక ఆర్థాలు ఉన్నాయి. పుష్కరాల ముఖ్య ఉద్దేశ్యం నది పర్యావరణ సంరక్షణ , పరిశుభ్రతను తెలుసుకునేందుకే పుష్కరాలను ఆచరించాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పెద్దలు పేర్కొన్నారు. నదీ తీరంలో ఎక్కడ మెరక ఉందో , ఎక్కడ పల్లం ఉందో , ఎక్కడ నదితీర ప్రాంతం కోతకు గురైందో, చెట్లు కొట్టివేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు గాను పూర్వికులు ఈ ఇటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి నది పవిత్రతను కాపాడేందుకు ఆయా నదులలో పున్యస్నానాలు ఆచరించడం ద్వారా నీటి వనరుల ప్రాముఖ్యాన్ని చేప్పకనే చాటి చెప్పారు. హిందు సనాతన ధర్మంలో నదులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పుజాదులు ఆచరించడం ద్వారా భవిష్యత్తరాలకు జలాల ప్రాముఖ్యాన్ని తీసుకువెళ్ళడమే ధ్యేయంగా పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆయూ నదులలో బృహస్పతి ప్రవేశించే రాశుల వివరాలు:

గంగానదికి మేషరాశిలోను, నర్మదానదికి వృషభరాశి, సరస్వతీ నదికి మిధునరాశి, యమునానదికి కర్కాటరాశి, గోదావరి నదికి సింహరాశి, కృష్ణానదికి కన్యారాశి, కావేరి నదికి తులారాశి, భీమానదికి వృశ్చికరాశి, పుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకరరాశి, సింధునదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది.

గత ఎడాది జూలై 14 నుండి జూలై 25 వరకు గోదావరి పుష్కరాలు బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించిన సమయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎడాది కృష్ణా పుష్కరాలను బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే ఆగష్టు 12 నుంచి ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు ఆది పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే రోజు (ఆగష్టు 12 శుక్రవారం) హిందువులకు ఎంతో పవిత్రమైన వరలక్ష్మీవ్రతం పండుగ రావడం యాధృచ్చికం.

పుష్కరుని చరిత్ర:

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తప్పసు ఆచరించి ఈశ్వరుని ప్రసన్నంతో తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకాలని వరం కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తమ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఇలా తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు ఆధిపతి అయ్యే వరాన్ని పొందాడు.తద్వారా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంసృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు.

బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు.

అప్పడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించాడు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి ఆధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యపధమని పురాణాలు చెప్తున్నాయి.

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్లే లెక్క. ఒక సంవత్సరం కాలంపాటు బృహస్పతి ఆయా రాశులలో ఉండడం జరుగుతుంది. సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, సంవత్సరాంతంలోని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలవడం జరుగుతుంది. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది.

పుష్కర అనే శబ్దానికి నీరు, వరుణుని కుమారుడు వంటి అనేక ఆర్థాలు ఉన్నాయి. పుష్కరాల ముఖ్య ఉద్దేశ్యం నది పర్యావరణ సంరక్షణ , పరిశుభ్రతను తెలుసుకునేందుకే పుష్కరాలను ఆచరించాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పెద్దలు పేర్కొన్నారు. నదీ తీరంలో ఎక్కడ మెరక ఉందో , ఎక్కడ పల్లం ఉందో , ఎక్కడ నదితీర ప్రాంతం కోతకు గురైందో, చెట్లు కొట్టివేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు గాను పూర్వికులు ఈ ఇటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి నది పవిత్రతను కాపాడేందుకు ఆయా నదులలో పున్యస్నానాలు ఆచరించడం ద్వారా నీటి వనరుల ప్రాముఖ్యాన్ని చేప్పకనే చాటి చెప్పారు. హిందు సనాతన ధర్మంలో నదులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పుజాదులు ఆచరించడం ద్వారా భవిష్యత్తరాలకు జలాల ప్రాముఖ్యాన్ని తీసుకువెళ్ళడమే ధ్యేయంగా పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆయూ నదులలో బృహస్పతి ప్రవేశించే రాశుల వివరాలు:

గంగానదికి మేషరాశిలోను, నర్మదానదికి వృషభరాశి, సరస్వతీ నదికి మిధునరాశి, యమునానదికి కర్కాటరాశి, గోదావరి నదికి సింహరాశి, కృష్ణానదికి కన్యారాశి, కావేరి నదికి తులారాశి, భీమానదికి వృశ్చికరాశి, పుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకరరాశి, సింధునదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది.

గత ఎడాది జూలై 14 నుండి జూలై 25 వరకు గోదావరి పుష్కరాలు బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించిన సమయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎడాది కృష్ణా పుష్కరాలను బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే ఆగష్టు 12 నుంచి ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు ఆది పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే రోజు (ఆగష్టు 12 శుక్రవారం) హిందువులకు ఎంతో పవిత్రమైన వరలక్ష్మీవ్రతం పండుగ రావడం యాధృచ్చికం.

పుష్కరుని చరిత్ర:

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తప్పసు ఆచరించి ఈశ్వరుని ప్రసన్నంతో తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకాలని వరం కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తమ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఇలా తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు ఆధిపతి అయ్యే వరాన్ని పొందాడు.తద్వారా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంసృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించాడు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి ఆధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యపధమని పురాణాలు చెప్తున్నాయి.

Advertisements

పుష్కరం ఎందుకు చేసుకుంటాం, దాని చరిత్ర ఏంటి ? Last Updated: 09 July 2016