collector yeruvaka 17092016 1

విషయం ఉన్నవాళ్ళు, వాళ్ళ  పనితోనే  సమాదానం  చెప్తారు... అర్ధం  కాలేదా  ? సచిన్ టెండూల్కర్  విమర్శకులకి , తన బ్యాట్ తోనే సమాదానం చెప్పేవాడు... విషయంలోకి  వస్తే, జూన్  20, 2016లో, నర్సాపురం మండలం చిట్టవరంలో, ప‌ద్మ‌శ్రీ మంగిన వెంక‌టేశ్వ‌ర‌రావు పొలంలో,  “ఏరువాక” కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు  ప్రారంభించారు. పొలంలో వరినాట్లు యంత్రం స్వయంగా నడిపి నాట్లు వేశారు.

ఇంకేముంది, ఎప్పటిలాగే విషప్రచారం  మొదలుపెట్టింది  “సాక్షి”... జనాలని  తప్పుదోవపట్టించి, అదోరకమైన  ఆనందం పొందింది.. దానికతోడు, కులపిచ్చ వెబ్ మీడియా...” నారుపోసి.. నీళ్లు మరిచి” అనే శీర్షికను  ఆగష్టు నెలలో ప్రచురించింది.. స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలో నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చిందని ఒక ఐటెం రాసింది...

కట్ చేస్తే, సాక్షి అడ్డంగా దొరికిపోయింది... సాక్షి  రాసే  ప్రతి అక్షరం విషపు రాతలే, అని మరోసారి  రుజువైంది...ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకలెక్టర్, నర్సాపురం MLA బండారు మాధవ నాయుడు స్వయంగా  ఆ పొలంలో వరిపంట కోత కోసి చూపించారు...చంద్రబాబు వరినాట్లు వేసిన పొలం, ఎంత పచ్చగా ఉందో చూపించారు...ఇప్పుడు మూడో పంటకు సిద్దమవుతుంది ఆ పొలం... 

ఏమి చేస్తాం, కొన్ని జీవితాలు అంతే , పచ్చగా ఉంటే చూడలేవు... అందుకే, సాక్షి గూబ గుయ్యిమనేలా సమాధానం చెప్పారు...

ఇంకా డౌట్ ఉంటే , ఈ ఫోటోలు చూడండి...

collector yeruvaka 17092016 2

collector yeruvaka 17092016 3

collector yeruvaka 17092016 4

Advertisements

ఏరువాక మీద సాక్షి విషప్రచారం...కోత కోసి సమాధానం చెప్పిన కలెక్టర్ Last Updated: 17 September 2016