krishna pushkaralu 1 07052016

పూర్వం బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి భూలోక వాసులను పాపవిముక్తులను జేయుటకు సులభోపాయమును తెలుపమని ప్రార్ధించారు. విష్ణువు బ్రహ్మర్ధులను తోడుకుని పరమేశ్వరుని వద్దకు వెళ్లి విషయము వివరించి సరైన తరుణోపాయమును సూచించమని కోరడం జరిగింది. అంత పరమేశ్వరుడు వారికి తరుణోపాయమును విశిద్ధ్హికపరచి పడమటి కనమలలో గల సహ్యాద్రి పర్వతమందు బ్రహ్మగిరి, వేదగిరి అను రెండు శిఖరములు గలవు. బ్రహ్మగిరి యందు నేవు శ్రీ మహా విష్ణువు ఆశ్వత (రావి) వృక్షము గాను, నేను వేదగిరి యందు పెద్ద ఉసిరిక వృక్షము గాను వెలయదుమని తెలిపారు. మా అంసలో కృష్ణ - వేణి నదులు ఆవిర్భవించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతములో కలియగలవని ఆ నదీమ తల్లిలో స్నానము ఆచరించిన జనులు సర్వ పాపవిముక్తులు అవుతారని పేర్కున్నారు. అలా బ్రహ్మాది దేవతలకు, ఈశ్వరుడు చెప్పి పంపించెను.

కాలానుగతముగా సహ్య పర్వతమందలి బ్రహ్మగిరి యందు శ్రీ మహా విష్ణువు ఆశ్వత వృక్షముగా ఆవిర్భవించి తన అంశతో "కృష్ణా నది"ని ఆవిర్భింప చేసెను. తదుపరి ఈశ్వరుడు వేదగిరి యందు ఆమలక వృక్షంగా వెలసి తన అంశతో "వేణి నది" గా ఆవిర్భింప చేసెను.

మహారాష్ట్రలోని పూణే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వరం ప్రాంతంలో జార్ గ్రామంలో కృష్ణా నది పుట్టిన ప్రాంతం. అటు మహాబలేశ్వర ప్రాంతాన ఉద్భవించిన "కృష్ణ - వేణి " నదులతో "ఖిల్లవడి" అనే ప్రదేశానికి పై భాగాన కలిసి కృష్ణవేణి నదులు విడిపోయి పులిగడ్డ నుంచి తూర్పుగా కృష్ణానది ప్రవహించి కృష్ణాజిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతములో కలిసినది. పులిగడ్డ నుండి వేణి నది దక్షిణంగా ప్రవహించి నాచుగుంట ప్రాంతాన మూడు పాయలై "త్రివేణి సాగర సంగమం" ను పేరు ప్రఖ్యాతలు గాంచి సముద్రంలో కలిసినది.

అందువల్ల ఈ రెండు నదుల మధ్య గల ప్రదేశమందు సంకల్పములో "కృష్ణవేణి యోర్యధ్యప్రదేశ్" అని చెప్పుకునే ఆచారము ననుడిలోనికి వచ్చినది.

కృష్ణ నది ఉప నదులు: కోయనా నది, పెన్నా నది, మాలప్రభ నది, భీమా నది, ఎర్ల నది, ఘాట్ ప్రభ నది, దిండి నది, వర్ణ నది, మూసి నది, పాలేరు నది, దూద్గంగ నది.

Advertisements

కృష్ణ వేణి నదుల జన్మవృత్తాంతము (కృష్ణా నదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?) Last Updated: 05 July 2016