Top Stories

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత రెండు నెలలుగా ఎలా ఆందోళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... ఇటు రాజకీయంగా, మోడీ చేస్తున్న అన్యాయం దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో, చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపు వచ్చింది.... అన్ని విపక్షాలను, ఈ విషయంలో చంద్రబాబు ఏకం చేసి, ఢిల్లీని ఇబ్బంది పెడుతున్నారు... అదే సందర్భంలో, బీజేపీ, ఇక్కడ కొంత మందిని అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ, కేసులు పెడతాం అంటూ భయపెడుతున్నా, చంద్రబాబు మాత్రం, ఈ కుట్రలని ఎదుర్కుని ఢిల్లీ పై యుద్ధం చేస్తున్నారు.. ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన సినీనటుడు, మాజీ కాంగ్రెస్ ఎంపీ, ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి మాత్రం, అసలు ఇక్కడ జరుగుతుంది ఏమి పట్టనట్టు, తన పని తాను చేసుకుపోతున్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; అవిశ్వాసం పెట్టిన వేళ, నెల రోజులు రాజ్యసభకు సెలవలు కావలి అంటూ, చిరంజీవి రాజ్యసభ చైర్మన్ ను కోరారు. ఆ మరుసటి రోజే, సినిమా ఫంక్షన్ లో ప్రత్యేక్షం అయ్యారు... గత కొన్ని రోజులుగా, తన తమ్ముడి కోసం, ఆయనకు రాజకీయంగా లబ్ది చేకూరటం కోసం సినీ ఇండస్ట్రీని ఏకం చేసి, మీడియాను బ్యాన్ చేసే పనిలో ఉన్నారు... రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైములో, ఒక్క రోజు కూడా ప్రత్యెక హోదా కోసం, ఒక్కటంటే ఒక్క పని కూడా చెయ్యని చిరంజీవి, తన సొంత పనులు మాత్రం చేసుకుంటూ, తనని ఇంత వాడిని చేసిన రాష్ట్రం కష్టాల్లో ఉంటే మాత్రం, ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.. ఇప్పుడు అమెరికా పర్యటనకు బయలుదేరాడు.. ఈ శనివారంనాడు, ఏప్రిల్ 28 వ తేదీన డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను మాజీ కేంద్రమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవిగారు, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలుసుకుని, డల్లాస్ ప్రవాసాంధ్రులు ఒకింత ఆశ్చర్యపోయారు.. మరో పక్క, ఇదే వేదికలో, నిధుల సేకరణ కార్యక్రమం కూడా జరగనుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా, నిధుల కేటాయింపు, విభజన చట్టం హామీల అంశాల్లో కేంద్రప్రభుత్వం చేతిలో వంచనకు గురైనా, చిరంజీవిగారు మరియు ఇతర సినిమాతారలెవరూ ఆంధ్రుల నిరసనకు మద్దతు తెలిపుతూ కనీస సంఘీభావ ప్రకటన కూడా చేయలేదనే కోపంతో, డల్లాస్ ప్రవాసాంధ్రులు, ఈ కార్యక్రమంలో నిరసన తెలిపి, చిరంజీవికి తన కర్తవ్యం గుర్తు చెయ్యనున్నారు... ఒక ప్రవాసాంధ్రుడు మాట్లాడుతూ "వేలమైళ్ళ దూరంలో ఉండి కూడా మేము, జన్మభూమి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాము. మన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయంపట్ల బాధ పడుతున్నాము. ఇలాంటి సమయంలో టికెట్లకు భారీ ధరలు పెట్టి, తమకు బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి మా కష్టార్జితాన్ని కొల్లగొట్టడానికి చిరంజీవిగారు, ఇతర సినిమాతారలు ఈ ఉత్సవాలను జరపడం ఎంతవరకు సబబు ? ఇది ఖచ్చితంగా ప్రత్యేకహోదా కోసం తపన పడుతున్న రాష్ట్రప్రజలను, ప్రవాసాంధ్రుల ఆత్మగౌరవాన్ని అవహేళన చేయడమే కదా ?" అంటూ తమ ఆవేదన తెలిపారు. చిరంజీవి, ఇతర సినిమా వాళ్ళు డల్లాస్ లో జరిపే మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను బహిష్కరిస్తున్నామని, ఇప్పటికే టికెట్లు కొన్నవాళ్ళు, అదే ప్రాంగణంలో, వేదిక వద్ద నల్లరిబ్బన్లు ధరించి, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి, మా బాధ చిరంజీవికి అర్ధం అయ్యే విధంగా నిరసనలు తెలుపుతామని ప్రవాసాంధ్రులు పిలుపు ఇచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. మన జన్మభూమిని అవమానించే విధంగా మన ఆంధ్రులే కృతఘ్నతతో వ్యవహరిస్తే ఊరుకోబోమని, మా నిరసన చూసైనా, చిరంజీవి గారు, ఇతర సినిమా తారలు మద్దతు పలుకుతారేమో చూస్తామని అంటున్నారు. Add new comment

ఆయన ఒక కూలి... అలాంటి పెద్దయిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా ? నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తానూ కష్టపడి దాచుకున్న సొమ్మును విరాళంగా అందించటానికి వచ్చారు.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు... చంద్రబాబు పిలుపు మేరకు, ప్రజా రాజధాని నిర్మాణానికి సమాజంలోని అన్ని వర్గాల నుండి విరాళాలు అందుతున్నాయి... కూలీపని చేసుకునేవారు సైతం ప్రజా రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద గల గ్రీవెన్సు హాలులో జరిగింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; కృష్ణా జిల్లా పెనుకంచిప్రోలు మండలం కుల్లికోళ్ల గ్రామానికి చెందిన నారిశెట్టి పుల్లయ్య(68) s/o ఆంజనేయులు రాజధాని నిర్మాణానికి రూ.22,210లు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేశారు. కూలీపని చేసుకునే నారిశెట్టి పుల్లయ్య రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చిన స్ఫూర్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తనకున్నంతలో ఎదుటివారికి సహాయపడాలి అనే తెలుగువారి సేవా గుణానికి ఇదొక నిదర్శనమని ముఖ్యమంత్రి శ్రీ నారి శెట్టి పుల్లయ్యను కొనియాడారు... అమరావతికి, తానూ భాగస్వామి అవ్వటానికి వచ్చినందుకు సంతోషం అన్నారు... కేంద్రం చేస్తున్న అన్యాయానికి, ప్రజల్లో ఎంత కసి ఉందో, ఈ ఘటనే నిదర్శనమని చంద్రబాబు అన్నారు.. మరో పక్క, ఇలాంటి వారిని చుసైనా, పవన్, జగన్, మనసు మార్చుకోవాలని, నిత్యం అమరావతి పై చేసే కుట్రలు ఆపాలి.. జగన్, విజయవాడ పాదయత్రకు వచ్చి, భ్రమరావతి అంటూ యెగతాళి చేసాడు.. మంగళగిరిలో పాదయాత్ర చేసినా, కూత వేటు దూరంలో ఉన్న అమరావతికి రావటానికి మాత్రం ఇష్టపడలేదు... ఇక జగన్ మీడియా, పార్టీ, అమరావతి పై చిమ్మే విషం గురించి చెప్పే పని లేదు... ఇక పవన్ విషయానికి వస్తే, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తాకాలు వదులుతాడు.. అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు అంటాడు... వీరందరూ కలిసి, అదే స్టేజి పై, అమరావతి రైతుల త్యాగాలను కూడా అవహేళన చేస్తారు... కానీసం ఇలాంటి వారిని చూసైనా, బుద్ధి తెచ్చుకుని, రాజధానికి అడ్డు రాకుండా, సహకరిస్తారని ఆశిద్దాం.. Add new comment

తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా, మీడియా పై ట్వీట్లు చేస్తూ, కొన్ని మీడియా చానల్స్ ని బ్యాన్ చెయ్యాలని చెప్పిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో, కొన్ని మీడియా చానల్స్ పై మరీ పర్సనల్ గా వెళ్ళిపోయాడు పవన్... శ్రీ రెడ్డి, పవన్ తల్లిని తిడుతూ చెప్పిన వీడియో, ఏ మీడియా ఛానల్ కూడా డైరెక్ట్ గా వెయ్యలేదు... ఆ పదాన్ని బీప్ చేసి వేసాయి... కాని పవన్ మాత్రం, ఒక ఛానల్ వీడియో పోస్ట్ చేసి, ఆ పదం బీప్ లేకుండా ఉన్న వీడియో ఒక పోస్ట్ చేసారు... అయితే, ఈ విషయం పై ఆ ఛానల్ వెరిఫై చేసుకోగా, వారి వీడియోస్ లో, ఆ పదం బీప్ చేసిన తరువాతే ప్రసారం చేసినట్టు తేలింది... దీంతో పవన్, ఆ వీడియోని ట్యాంపరింగ్ / ఆడియో మార్ఫింగ్ చేసి తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; మూడు రోజుల క్రితమే ఈ విషయం పై, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... ఇదే విషయం పై, జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ఏకం అయ్యాయి... కుట్రతోనే, పవన్ ఇలా చేస్తున్నారని నిర్ధారణకు వచ్చాయి... జర్నలిస్ట్ సంఘాలు అందరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు... కేసు నమోదు చెయ్యాలని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు... ఈ విషయం పై పోలీసులు ప్రాధమిక విచారణ చేసారు... ప్రాధమిక విచారణలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ వచ్చారు... దీంతో, పవన్‌పై ఐపీసీ 469, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు... ఇప్పుడు పోలీసులు మరింత లోతుగా విచారణ చెయ్యనున్నారు... ఈ విచారణలో పవన్, ఇలా ఎందుకు చేసారు, దీని వెనుక కుట్ర ఎమన్నా ఉందా ? పవన్ ఒక్కడే ఈ కుట్రలో ఉన్నాడా ? అనేది పోలీసుల విచారణలో తెలుస్తుంది... అయితే, ఈ సెక్షన్ల్ కింద పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ అయితే మాత్రం, గరిష్టంగా ఏడేళ్లు, కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్షతో పాటు జరిమానా దీనికి అదనం... మరి పోలీసులు ఈ విచారణ ఎటు వైపు తీసుకువెళ్తారు ? లేక పవన్, మీడియా కంప్రోమైజ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది... మరో పక్క ఈ కేసు తెలంగాణాలో రిజిస్టర్ అయ్యింది కాబట్టి సరిపోయింది కాని, ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయ్యి ఉంటే, ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఎంత గోల చేసే వాడో... Add new comment

వైసిపీ, బీజేపీ బంధం ఓపెన్ అయిపోతుంది... ఇక విజయసాయి రెడ్డి, ఏ మీడియా వాడు చూస్తాడా అని దొంగ చాటుగా వెళ్లి మోడీని కలవాల్సిన పని ఉండదు... జగన్ మోహన్ రెడ్డి, కేసుల గురించి భయపడాల్సిన పని లేదు... ఇక ముసుగులో గుద్దులాటలు లేవు... అంతా ఓపెనే... ఈ రోజు కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే విజయవాడలో పర్యటించారు... ఈ సందర్భంలో ఆయన జగన్ పై చేసిన వ్యాఖ్యలు అదిరేలా ఉంటే, జగన్ కేసుల పై చేసిన వ్యాఖ్యలు బెదిరేలా ఉన్నాయి... మొత్తానికి, అనుకున్న ప్లాన్ ప్రకారం, స్టెప్ బై స్టెప్, వైసిపీ - బీజేపీ త్వరలోనే కలిసిపోతున్నాయి... విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అవ్వటం, జగన్ కేసులు ఒక్కోటి వీగిపోవటం, మనం చూడ బోతున్నాం... ఈ రోజు విజయావాడలో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఓ వైపు ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అంటూనే.. మరోవైపు వైసీపీ రాకపై సానుకూలంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. జగన్‌పై ఉన్న కేసుల్లో ఏవీ ఇంకా నిరూపితం కాలేదని రాందాస్‌ అథవాలే చెప్పుకొచ్చారు. అవి కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన కేసులని, అవి ఇంకా నిరూపితం కాలేదని అన్నారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి. మరో పక్క ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం బాధించిందంటూనే 2019లో చంద్రబాబు తిరిగి ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అన్నారు. అలా జరగని పక్షంలో జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామని అన్నారు. వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతోనే కేంద్రం ఏపీని పట్టించుకోవట్లేదన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలకు రాందాస్‌ అథవాలే కామెంట్లు బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే, ఇదంతా అందరూ ఊహించిన పరిణామమే... కాకపోతే, ఇంత తొందరగా ఓపెన్ అప్ అవుతరానని అనుకోలేదు... మరో పక్క, పవన్ ఉండనే ఉన్నాడు... ఈ నేపధ్యంలో, ఆపరేషన్ గరుడ, అనుకున్న ప్రకారమే నడుస్తుంది... ఇప్పటి వరకు పార్ట్ వన్ లో, అన్నీ గ్రౌండ్ లెవెల్ లో సెట్ చేసి పెట్టారు.... ఇప్పటికే కర్ణాటకలో, గాలి పై ఉన్న కేసులన్నీ ఎలా వీగిపోయాయో చర్చించుకుంటూ ఉన్న సమయంలో, ఇప్పుడు జగన్ కూడా ఎన్డీఏలో చేరి, తన కేసులు కూడా మాఫీ చేసుకుంటాడు అని, అవసరం అయితే ఎన్నికలు అయిన తరువాత తన పార్టీ, బీజేపీలో విలీనం చేస్తాడు అని ఎప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. Add new comment

నీ లాంటి వాడితో స్నేహం కంటే, నాకు నా పార్టీ, నా నాయకుడు ముఖ్యం... పిచ్చికుక్కలా మాట్లాడితే సహించేది లేదు... ఈ మాటలు అన్నది ఎవరో కాదు... గన్నవరం ఎమ్మల్యే వల్లభనేని వంశీ.... ఈ మాటలు అన్నది, గుడివాడ ఎమ్మల్యే కొడాలి నానిని... కొడాలి నాని, వంశీ మధ్య చాలా స్నేహం ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే... అయితే, ఈ మధ్య కొడాలి నాని, మరీ నోటికి ఏమి వస్తే అది మాట్లాడతూ, హద్దు లేకుండా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండటం, చంద్రబాబు వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఆడు ఈడు అంటూ, బూతులు తిడుతూ మాట్లాడటంతో, స్నేహితుడు అయిన వంశీ కూడా చివరకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది... గన్నవరం నియోజకవర్గంలో, జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర చేస్తున్న విషయం తెలిసిందే... ఈ సందర్భంలో కొడాలి నాని కూడా, జగన్ తో కలిసి నడుస్తూ, చంద్రబాబుని ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడుతున్నాడు.. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దీంతో వంశీ రియాక్ట్ అయ్యారు... ‘నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని కొడాలి నానిని ఉద్దేశించి వల్లభనేని వంశీ తీవ్రంగా హెచ్చరించారు. ఒకప్పుడు ఇద్దరం స్నేహితులమే కానీ, ఇప్పుడు కాదన్నారు. జగన్‌ పాదయాత్రలో కొడాలి నాని తనను స్నేహితుడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కొడాలి నాని పిచ్చికుక్కలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ, చంద్రబాబుతో తప్పితే నానితో స్నేహమే లేదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నానిని, వైసీపీలో బరితెగించి మాట్లాడేవారిని జగన్‌ కంట్రోల్‌ చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే జగన్ ఆరోపణలు పై కూడా వంశీ స్పందించారు... ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ బ్రహ్మయ్యలింగం చెరువుపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని వంశీ సవాలు విసిరారు. వై.ఎస్.జగన్ బ్రహ్మయ్యలింగం చెరువు వద్ద ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులపై పలు ఆరోపణలు చేశారని, అవగాహన లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, నియోజకవర్గంలో పట్టిసీమ నీరు, చెరువుల పూడికతీతల వలన వేల ఎకరాలలో రైతులు రెండేసి పంటలు పండించుకున్న విషయం తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన జగన్ ఆ చెరువులో ఇసుక ఎక్కడ ఉందో రుజువు చేయాలని సవాలు చేశారు. లిఫ్ట్ పనులకు మంజూరు చేసిన నిధులు మట్టి త్రవ్వడానికి ఉపయోగిస్తారా? మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా? అని జగన్ పై ద్వజమెత్తారు. మీరు ఎలాగూ జైలుపాలై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, సాక్షిపై వేసే పరువునష్టం దావాలలో మీ జీవితభాగస్వామిని సైతం జైలుపాలయ్యే స్తితి తీసుకురావద్దంటూ హితవు పలికారు. Add new comment

మీ దాక వస్తే కాని నొప్పి తెలియలేదా ? మీ రాజకీయం కోసం, సినిమా పరిశ్రమ మొత్తం ఏకం కావాలా ? సినీ ఇండస్ట్రీ పై ఇన్ని రోజులుగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో, అవేమీ పట్టించుకోని మీరు, మీ మీదకు వస్తే మాత్రం, వచ్చి హడావిడి చేస్తారా ? అదీ రాజకీయంగా వాడుకుంటారా ? ఇది ప్రతి ఒక్క సామాన్యుడు అభిప్రాయం... కాని, ఇదే అభిప్రాయం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కూడా వినిపిస్తున్నారు... పవన్ బ్యాచ్ చేస్తున్న హడావిడి పై మండిపడుతున్నారు... టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులలో ఒకడిగా ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురులో కీలక వ్యక్తిగా పేరు గాంచిన అల్లు అరవింద్ మాటలకు ఎదురు ఉండదు అనే అభిప్రాయానికి చెక్ పడింది. అరవింద్ కు కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో నాగార్జున మేనకోడలు సుప్రియ అరవింద్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసింది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా అతడి తల్లిని టార్గెట్ చేసే విధంగా కొన్ని ప్రముఖ ఛానల్స్ నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నాయి అంటూ దానికి వ్యతిరేకంగా పవన్ తన రాజకీయ కార్యకలాపాలను పక్కకు పెట్టి గత కొద్ది రోజులగా ఆ ఛానల్స్ ను చూడవద్దు అంటూ పవన్ చేస్తున్న హడావిడి తెలిసిందే. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పవన్ కు సపోర్ట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సమావేశంలో సుప్రియ అరవింద్ ల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. అరవింద్ న్యూస్ చానల్స్ ను బ్యాన్ చేద్దాం అని ప్రకటించగా, ఈ సందర్భంలో సుప్రియ అరవింద్ ను ఉద్దేసించి మాట్లాడుతూ కొంతకాలం క్రితం ఒక టివి యాంకర్ ఒక హీరోయిన్ విషయమై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తూ మాట్లాడిందట. అంతేకాదు అప్పట్లో తాను ఆ కామెంట్స్ ను ఖండించమని కోరుతూ పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు మెసేజ్ లు పెట్టినా స్పందించని సందర్భాలను గుర్తుకు చేసి, అప్పుడు ఆవిషయాలు అన్యాయంగా అనిపించలేదా అంటూ అరవింద్ ను అందరి ఎదురుగా సుప్రియ ప్రశ్నించిందని, ఆ పత్రిక వివరణాత్మకంగా వార్తను వ్రాసింది. దీనితో ఊహించని ఈ పరిణామానికి అరవింద్ షాక్ ఐనట్లు తెలుస్తోంది. ఆ తరువాత అరవింద్ టివి9, ఎబిఎన్ ఛానల్స్ కార్యక్రమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు ఎవరూ వెళ్ళకూడదు అన్న తీర్మానాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఇండస్ట్రీ పెద్దలతో పాటు సుప్రియ కూడ తీవ్రంగా వ్యతిరేకించినట్లు టాక్. మొత్తానికి, తమ రాజకీయ ప్రయోజానాల కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న పవన్, అల్లు బ్యాచ్ కి, సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరూ మద్దతు పలకటం లేదు... Add new comment

భవానీ ఐలాండ్ సరి కొత్త అందాలు అందుకోబోతుంది. ఐలాండ్ లో త్వరలో ఏర్పాటు కానున్న డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించింది. సుమారు రూ.16 కోట్ల వ్యయంతో డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ ను సిద్ధం చేస్తోంది. ద్వీపంలో ఇప్పటికే దీనికి సంబంధించిన కంట్రోల్ రూం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ లేజర్ షోను పర్యాటకులు తిలకించేందుకుగాను కంట్రోల్ రూం పక్కనే గ్యాలరీ ఏర్పాటు చేస్తోంది. లేజర్ షోకు సంబంధించిన సామగ్రి కూడా వచ్చేసింది. ప్రస్తుతం పన్నమి ఘాట్లో ఉన్న ఈ సామగ్రికి ఒక రూపం తీసుకువచ్చి భవానీ ద్వీపంలోకి తర లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డ్యాన్సింగ్ కల్ పాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు. ఇది అత్యంత ఖర్చు కూడుకున్న భారీ ప్రాజెక్టు అయినప్పటికీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా చేపటామన్నారు. కోల్కత్తాకు చెందిన ప్రీమియం వరల్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుని పనులు ప్రారంభించిందని వివరించారు. Add new comment

నవ్యాంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటాయంగా నిలుస్తున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిని పొందింది.. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల కంటే వృద్ధి రేటులో దూసుకుపోతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ అతి త్వరలో దక్షిణ, తూర్పు ఆసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా విమానాలు నడపటానికి బీజం పడుతోంది... మరోవైపు గన్నవరం విమానాశ్రయానికి ట్రాఫిక్ పెరుగుతోంది... పర్యాటకుల సంఖ్య పెరిగింది... ఆతిథ్య కేంద్రంగా మారిపోయింది.. ఓ కన్వెన్షన్ సెంటర్ మాదిరిగా విమానాశ్రయ లాంజ్లోనే ఉన్నతాధికారుల కాన్ఫరెన్స్ లు జరుపుకునేంతగా మారిపోయింది... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ నేపథ్యంలో ఇటీవల రూ.148 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించిన నూతన ఇంటీరియమ్ టెర్మినల్ బిల్లింగ్ దేశంలోని ఇతర ప్రాంతాల వారు, భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఇక్కడి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు వీలుగా అంతర్గతంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనల మేరకు పర్యాటక శాఖ , ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా టెర్మినల్ బిల్లింగ్ అంతర్గతంగా తీర్చిదిదుతున్నారు. అమరావతి ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా బుద్ధుని విగ్రహాన్ని ఉంచారు. పూర్తి స్థాయిలో బౌద్ధ ఛాయాచిత్రాలను తొలగించి కృష్ణాజిల్లా వైభవాన్ని తెలిపేవిధంగా కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నృత్యాలు, కలంకారీ కళలు వంటి సంస్కృతి ఉట్టిపడేలా వాటిని ప్రతిబింబించే కళాఖండాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రుల చరిత్ర... అందులో అమరావతి ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవం తెలిసేలా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. అత్యద్భుతమైన కళాఖండాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా, పండుగలు వచ్చినపుడు వాటికి థీమ్‌కు అనుగుణంగా అలంకరణ చేపడుతున్నారు. తాజాగా దీపావళిని పురస్క రించుకుని ఎయిర్‌పో ర్టును విద్యుదీ పాలంకరణతో దేదీప్యమానంగా అలంకరించారు. Add new comment

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసి ప్రగతి పధంలోకి నడిపంచేందుకు తీసుకోంటున్న చర్యలలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని అన్నారు. సింపుల్ గ్రూప్ ఆఫ్ ఇండియా అధినేత ప్రవాస భారతీయులు పాపారావు ఆధ్వర్యంలో పవిత్రసంగమం వద్ద ఎకో ఫ్రెండ్లీ టూరిజంలో పర్యాటకుల నదీ విహారయాత్ర నిమిత్తం పడవలపై రిసార్ట్, వాటర్ స్పోర్ట్స్, మెరైన్ ఎక్వేరియం,ఫ్లోటింగ రెస్టారెంట్స్లను ఎం.పి, టూరిజం డైరెక్టర్ శుక్లాతో కలిసి ప్రారంభించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిన పాపారావు జన్మభూమి అభివృద్ధికి కృషి చేయాలని సి.ఎం. చంద్రబాబు పిలుపు మేరకు తిరిగి ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పవిత్ర సంగమం వద్ద రిసార్ట్స్ వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. దీనివలన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దీనితో పాటు అత్యంత ఆధునికమైన ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోట్ల తయారీ పరిశ్రమని ఎ.కొండూరులో ఏర్పాటు చేయటం వలన ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని తెలిపారు. పిల్లలకు సముద్రంలోని జీవరాశుల పై అవగాహన కల్పించేందుకు మెరైన్ ఎక్వేరియం ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, రిసార్ట్స్ అధినేత పాపారావు, ఇతర పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు. Add new comment

విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా తాయారు అయ్యింది... అమరావతి రాజధానిగా చెయ్యటం, అంతకు ముందు తాత్కాలికంగా ప్రభుత్వం మొత్తం విజయవాడ నుంచే పరిపాలన చెయ్యటం, సిటీ పెరగటం, ఇలా అన్ని సమస్యలతో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువ అయింది.. ఒక పక్క విఐపి మూమెంట్ ఉండటం, మరో పక్క కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండటం, ట్రాఫిక్ నియంత్రించటంతో కూడా, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు.. ఇటు వైపు గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది.. మరో పక్క, గొల్లపూడి నుంచి, భవానీపురం మీదగా సిటీకి వచ్చే ట్రాఫిక్ కూడా అంతే... ఈ ట్రాఫిక్ దెబ్బతో ప్రజలు బయటకు వెళ్ళాలి అంటేనే హడలి పోతున్నారు...  google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ప్రధానంగా సిటీలోకి భారీ వాహనాలు రావటంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై అనేక ఫిర్యాదులు అందటం, అలాగే 1100 కు ఎక్కువ ఫిర్యాదులు దీని మీద రావటంతో, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్‌ రంగంలోకి దిగారు. ప్రధానంగా కనకదుర్గ వారధి దగ్గర నుంచి గన్నవరం విమానశ్రయం వరకు, లారీలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి రావడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది అని, ఇదే ప్రధాన కారణం అని గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి కోల్‌కత్తా, చెన్నై నుంచి కోల్‌కత్తా వెళ్లాలన్నా, రావాలన్నా ఇదే మార్గం గుండా వెళ్లాలి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. విజయవాడ నగరంలోకి అనుమతించకుండా 216వ జాతీయ రాహదారి మీదుగా మళ్లించాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా వద్ద ప్రారంభమయ్యే 216వ నెంబర్ జాతీయ రహదారిని రేపల్లె, పెనుమూడి, పామర్రు, కత్తిపూడి మీదుగా ఐదో నెంబర్ జాతీయ రహదారికి మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే విజయవాడ నగరంలోకి భారీ వాహనాలు, లారీలు రాకుండా 216వ జాతీయ రహదారి మీదుగా మళ్లించనున్నారు. నగరంలోకి లారీలను నిషేధించాలన్న ప్రభుత్వ ఆలోచనతో విజయవాడలో వాహనదారుల కష్టాలు చాలా వరకు తీరినట్లే. Add new comment

విజయవాడ ప్రజలకు మరో కొత్త అనుభూతి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, టూరిజం శాఖల నేతృత్వంలో రెండు బోట్లతో కూడిన బోటింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో, విజయవాడ బందర్ కాలువలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను నిన్న పలువురు ప్రజా ప్రతినిధులు పరరంభించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా, మేయర్, అధికారులు స్పీడ్ బోటులో ట్రయల్ రన్ గా బందరు కాలువలో, బందరు లాకుల వరకు ప్రయాణించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ భవిష్యత్ లో అమెరికన్ హాస్పటల్ నుంచి యనమలకుదురు లాకుల వరకు బోటింగ్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మూడు కాలువల్లో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు.. అమరావతి బోటింగ్ క్లబ్ యాజమాన్యం మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బందరు లాకుల వరకు, పిల్లలకు రూ.50, పెద్దలకు రూ. 100 చొప్చున వసూలు చేసే యోచనలో ఉన్నామని, ప్రజలు అలవాటు పడేవరకు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 చొప్చున వసూలు చేయమని మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారన్నారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. Add new comment

రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్ట్ అప్ యూనిట్లను ప్రోత్సహించటానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజి పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టిపిఐ) విజయవాడలో నిర్మిస్తున్న సైబర్ టవర్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. రూ.40 కోట్ల వ్యయంతో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ జి ప్లస్ 6 టవర్ నిర్మాణం ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం ఫినిపింగ్ పనులు జరుగుతు న్నాయి.. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే కృషా, గుంటూరు జిల్లా ఔత్సహిక యువతకు ఈ టవర్ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ సైబర్ టవర్ మొత్తం 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ టవర్ గ్రౌండ్ ఫ్లోర్ లో హోస్టింగ్, ఇఎస్పి సేవలు, మొదటి ఫ్లోర్ లో డేటా సెంటర్, రెండవ ఫ్లోర్ లో ఇంక్యుబేషన్ సెంటర్ మూడు, నాలుగు, ఐదు ఫోర్లలో పెద్ద ఐటి కంపెనీలు, ఆరవ ఫ్లోర్ ను ట్రైనింగ్ సెంటర్ గా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రెండవ టవర్ నిర్మించేందుకూ ఎస్టిపిఐ ప్రణాళికలు వేస్తోంది. త్వరలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సైబర్ టవర్ను ప్రారంభించబోతున్నారు. ఈ టవర్ అందుబాటులోకి వస్తే దాదాపుగా వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. Add new comment

తెలుగు సినిమా చరిత్ర లో మరో సంచలనం.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ అని ప్రకటించాడో లేదో, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు వర్మ ఆ పాట ఇదే: Add new comment

బాలకృష్ణ హీరోగా, దివంగత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌పై కన్ఫర్మేషన్‌ వచ్చేసింది. ఈ మూవీని రాం గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నాడు. ఇలా ప్రకటించాడో లేదో... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ‘ఎన్టీఆర్ శత్రువులెవరో, మిత్రులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుక అసలు కాంట్రవర్సీ ఏంటో చెబుతా’ అంటూ వర్మ ఓ పాటను విడుదల చేశారు.... ఈ పాట సాగుతుంది. "ఇదే తెలుగు కీర్తి, ఇదే తెలుగు ఖ్యాతి, పొంగించారు మీరే ఈ తెలుగోడి ఛాతీ... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... అన్యాయాన్ని తుంచి, అధర్మాన్ని వంచి, పాలించారు మీరే సదా ప్రేమ పంచి... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీరే జీవితం, మీరే శాశ్వతం, ఇక ఏనాటికైనా మీదే సంతకం... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీదే రాజసం, మీదే సాహసం, తెలుగోడికిచ్చారు పొంగే పౌరుషం. జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్..." అంటూ సాగే పాట ఇప్పుడు శరవేగంగా పాప్యులర్ అయిపోతోంది. పాటలోని లిరిక్స్ క్యాచీగా ఉండటం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, త్వరలోనే మిగిలిన వివరాలను తెలపనుంది చిత్ర యూనిట్‌. Add new comment

2016 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని దక్కించుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయస్థాయిలో మార్మోగిందని సంతోషం వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి. శంకరాభరణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసంగమం, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం వంటి మనసుకు హత్తుకునే అపురూప, చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు ఎన్నో తెలుగువారికి అందించారు అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజుల్లోనే ఒక తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత కె. విశ్వనాథ్‌దే అని అన్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; 1957లో సినిమారంగంలో ప్రవేశించి నేటికి కూడా వెండితెరతో అనుబంధాన్ని కొనసాగిస్తూ కె. విశ్వనాథ్ భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు అన్నారు. సినీ ప్రపంచంలో అడుగుపెట్టే భావితరాలకు కె. విశ్వనాథ్ స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలుస్తారు అని ముఖ్యమంత్రి అన్నారు. Add new comment

కోట్లాది అభిమానుల ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘అజహర్‌’, ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ల తర్వాత భారత క్రికెటర్‌ జీవితం ఆధారంగా రూపొందించిన మూడో చిత్రమిది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; అయితే టీజర్‌లో, 1.12 సెకండ్స్ దగ్గర, 2014లో, సచిన్ PVP మాల్ ఓపెనింగ్ కి, విజయవాడ వచ్చినప్పుడు, బందర్ రోడ్డు పై అభిమానుల కోలాహలం, వారికి సచిన్ అభివాదం చెయ్యటం, ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ వీడియోలో 1.12 సెకండ్స్ దగ్గర, మీరు చూడండి Add new comment

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా రెండో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారంనాడు ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; సాధారణంగా తెలుగు సినిమా ట్రైలర్‌ మహా అయితే నిమిషం, ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ, ‘బాహుబలి:ది కంక్లూజన్‌’ ట్రైలర్‌ను మాత్రం హాలీవుడ్‌ సినిమాల తరహాలో రెండు నిమిషాల 20 సెకెన్ల పాటు ఉండేలా కట్‌ చేశారు. Add new comment

తెలుగు సినిమా చరిత్రకు 85 వసంతాలు... తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’విడుదలై నేటికి 85 సంవత్సరాలు.. 1932 ఫిబ్రవరి 6న, భక్త ప్రహ్లాద విడుదల అయ్యింది. అందుకే, తెలుగు సినిమా పుట్టిన రోజుని, ఈ రోజుగా జరుపుకుంటారు. HM రెడ్డి గారు తొలిసారిగా "భక్త ప్రహ్లాద" సినిమాను నిర్మించారు. 5 - 2 - 1932 నాడు ఆ సినిమా విడుదల అయింది. మన ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. అప్పట్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న బొంబాయిలోనే, చిత్ర నిర్మాతల సొంత థియేటరైన కృష్ణా సినిమా థియేటర్‌లో ముందుగా ఈ చిత్రం విడుదలైంది. అక్కడ రెండు వారాలాడాక, తెలుగు నేల మీదకు వచ్చింది. విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది. ఆనాటి నుంచి నేటి వరకు సినిమా రంగం రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతూ ఇవాళ విశ్వవ్యాపితం అయింది. మొన్నమొన్నటి వరకు రాష్ట్ర సరిహద్దులు దాటని తెలుగు సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతూ అభిమానులను అలరిస్తుంది. ఎనభై అయిదేళ్ల సుదీర్ఘ కాలంలో వేలాదిమంది నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు తమ జీవితాలతో పాటు తెలుగు సినిమాకు కళాసేవ చేశారు. బెజవాడ మారుతి థియేటర్లో తోలి సినిమా: ఇండియాలోనే తొలి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ మారుతి థియేటర్లో ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రదర్శించడానికి బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా ప్రొజెక్టర్లను తెప్పించారు. తరువాత తొలి తెలుగు టాకీ సినిమా "భక్త ప్రహ్లద" ఇదే ధియేటర్లో ఆడింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; తెలుగు సినిమా విజయవంతంలో విజయవాడదే అగ్రస్తానం. ఇక్కడ సినిమా పరిశ్రమ వేళ్ళూనుకుంది. తెలుగు సినిమాకు 85 సంవత్సరాలు నిండితే, ఆంధ్రప్రదేశ్ లో, తోలి సినిమా హాలు మారుతి ధియేటర్ విజయవాడలో నిర్మించి, 95 ఏళ్ళు అయ్యింది. విజయవాడలో ప్రఖ్యాత సినిమాహాళ్లు అప్పట్లో చాలానే ఉండేవి. 1921లో మారుతీ ధియేటర్, 1928లో దుర్గా కళా మందిరం, 1929 లక్ష్మీ టాకీస్, 1939లో రామాటాకీస్, 1940లో సరస్వతీ టాకీస్, 1944లో లీలామహల్ (ఆంద్రాలో ప్రత్యేకంగా ఇంగ్లీషు సినిమాలను ప్రదర్శించడానికి ఈ సినిమా హాల్ నిర్మించారు), 1948లో జైహింద్ టాకీస్, 1949లో జవహర్ థియేటర్ (విజయా టాకీస్), 1950లో శేష్ మహల్, 1951లో రాజస్తాన్ థియేటర్( వినోదా టాకీస్), 1952లో ఈశ్వర మహల్, ఆ తరువాత షహన్షా మహల్ (ఇప్పటి నవరంగ్ థియేటర్), శ్రీనివాస మహల్ ఇలా పలు థియేటరులు వచ్చాయి. ఇప్పుడు వీటిలో రెండు, మూడు మినహా అన్ని థియేటర్లు కనుమరుగు అయిపోయాయి. 1954లో ఆంద్రా ఫిలిం ఛాంబర్ వచ్చింది. విశాఖపట్నంలో క్వాలిటీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించిన కె.మంగరాజు, ఆ తర్వాత పేరు మార్చి విజయవాడలో పూర్గా పిక్చర్స్ను ఏర్పాటు చేసి ప్రథమ సినిమా పంపిణీదారుడుగా ప్రసిద్ధి పొందారు. అప్పట్లోనే 11 పంపిణీ సంస్థలు విజయవాడలో ఉండేవి. సినిమాలకు కావాల్సిన ప్రచారం కోసం అవసరమైన లిధో ప్రెస్సులు, పబ్లిసిటీ సంస్థలు, వంటివి చాలా వెలిసాయి. అప్పట్లో సినిమా, అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి బాగా ఉండేది. Add new comment

ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న విజయవాడలో చారిత్రాత్మిక కలిగిన ఆలయంలో ఒకటి మొగల్రాజపురం ధనకొండ, దుర్గా భవాని ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు... ఇంద్రకీలాద్రి పై అమ్మ కొలువు తీరడానికి ముందు, ఇంకోచోట వెలసిందని భక్తుల నమ్మకం. "దక్షిణాన కదిలిందిరా మా అమ్మ దుర్గా ఉత్తరానికొచ్చింది రా " అనే గీతం ప్రకారం కూడా దుర్గా అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండ పైన వెలిసింది అంటారు.. ఈ విషయం ఇప్పటి తరంలో చాలా మందికి పెద్దగా తెలీదు. విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండ పై వెలసిందని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మ వారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటారు... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంత మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా మహిమగలదని భక్తుల నమ్మకం.... మొగల్రాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీకచ్రకపీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందంటారు. ఇది నిజమేనంటూ ఇప్పటికీ అంతరాలయంలో పాద ముద్రలు, నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మరావతి విగ్రహ రూపం కనపడదు... అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీ చక్ర రూపం ఉంటుంది... స్థానికుల కధనం ప్రకారం దశాబ్దాలక్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి, నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. ఆమ్మ కరుణతో కొంత ధనాన్నిని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు... ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని.. చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందిట. గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగాడట. వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువుగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది. ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆ పై నుంచి గుడి వరకు సిమెంట్‌ రోడ్డు ఉంది. భక్తులు పైనపొంగళ్లు చేసుకొవడానికి షెడ్‌, కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతార్భగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈక్షేత్రానికి వెళ్లాలంటే మొగల్రాజపురం బోయపాటి మాధవరావు రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్ల వచ్చు. Add new comment

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముఖ ద్వారంగా ఉన్న కృష్ణా నదిలో దుబాయ్ లోని హోటల్ క్రూయిజ్ తరహాలో ఒక అందమైన భారీ క్రూయిజ్ హోటల్ అధునాతన వసతులతో ఏర్పాటవుతుంది. సీతానగరం వైపున ఇసుక ర్యంపు దగ్గర ఈ భారీ క్రూయిజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అత్యంత భారీగా రెండు అంతస్తులగా ఈ బోటును నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దీని పొడవు దాదాపు 126 మీటర్లు ఉంటుంది, వెడల్పు 40 మీటర్ల ఉంటుంది. ఈ భారీ క్రూయిజ్ నిర్మాణానికి రూ.2 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇందులో దాదాపు 360 మంది యాత్రికులు ఒకే సారి ఉండటానికి అవకాశం ఉంది. దీని లోపల భాగంలో అధునాతన వసతులతో రెస్టారంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో యాత్రికులు కోరిన విధంగా భోజనాలు, కోరిన రుచులతో ఆస్వాదించవచ్చు. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. పెళ్లిళ్లకు, హనీమూస్ జరుపుకునే జంటలకు వివిధ రకాల పంక్షన్లకు ఈ క్రూయిజ్ అద్దెకు ఇస్తారు. భవాని ద్వీపం, ఇంద్రకీలాద్రి, నడుమ కృష్ణానది నీటి పై ఈ క్రూయిజీసు లంగరు వేసి ఉంచుతారు. భవాని ఐలాండ్, శాండ్ ఐలాండ్, ఫారెస్ట్ ఐలాండ్స్, వంటి ఎన్నో సహజ సుందరమైన దీవులను కలిగి ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాదారణ బోట్ల మాత్రమే తిరిగేవి. రాష్ట్రంలో టీడీపి ఆధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఆధునిక క్రూయిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటకానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎతున పెట్టబడులు వస్తున్నాయి. రాజధాని పరిధిలో ఎన్నో బడా టూరిజం ప్రాజెక్టులను తెచ్చేందుకు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ముందుకు వచ్చింది. తొలిదశలో భాగంగా సగానికి పైగా పనులు పూర్తి చేసింది. మిగిలిన పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, స్కై ఛాపర్స్ సంస్థలు కూడా కొన్ని ప్రాజెక్ట్లు మొదలుపెట్టాయి. Add new comment

ఇది నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో ఉన్న ఓ అద్భుత లోకం.... అక్కడ అడుగుపెడితే అదో కొత్త బంగారు లోకం... విజయావాడ అంటే కృష్ణా నది, ప్రకాశం బ్యారేజి, రెండు పార్కులు మాత్రమే తెలిసిన నగరవాసులకి, ఈ ప్రదేశానికి వెళ్తే, ఇన్నేళ్ళు ఇక్కడకు ఎందుకు వెళ్ళ లేదా అనిపిస్తుంది... పచ్చని చెట్ల మొక్కల మధ్య నుంచి సీతాకోకచిలుకలు వచ్చి స్వాగతం పలుకుతాయి... ఒక్కటీ రెండూ కాదండి వేలల్లో.. అడుగులు ముందుకు పడుతుంటే మనతో పాటే కదులుతాయి... మనతో మమేకం అయిపోతాయి, మనల్ని ముద్దాడుతాయి.. మొన్నటి వరకు ఎక్కడెక్కడికో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన విజయవాడ వాసులు ఇప్పుడు ఇటువైపు చూస్తున్నారు. సొంత ప్రాంతంలో సరి కొత్త అనుభూతులను పొందుతున్నారు. ప్రకృతి కొత్త అందాలతో మురిసిపోతోంది విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్న మూలపాడు. సీతాకోక సంపద కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను కమ్మేసుకుంది. ఒకపక్క సెలయేళ్ల నీటి గలగలలు... అటూ ఇటూ కొండలు... మధ్యలో ప్రకృతి పచ్చని కోక కట్టినటుగా కనిపించే అరణ్యం.. మరో పక్క చల్లని గాలులకు, ఇంద్రధనస్సును తలిపిస్తూ, రంగురంగుల సీతాకోక చిలుకలు నాట్యం... వాః అద్భతం కదూ... కాంక్రీట్ జంగల్ గా మారిన విజయవాడ వాసులకి, ఇక్కడ అందమైన సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; మూలపాడు, దొనబండ ప్రాంతాల్లో వేలు, లక్షల సంఖ్యలో రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కలు విప్పతాయి. దాదాపు 30 రకాల సీతాకోకచిలుకలు, జూన్, జూలై, ఆగష్టు నెలల్లో అడవి మొత్తాన్ని ఆక్రమించి కొత్త అందాలు తీసుకొస్తాయి. సీతాకోక చిలుకలను దూరం నుంచి మాత్రమే చూసి ఆనందించాలి. వాటిని పటుకోవడానికి ప్రయత్నించడం, పరుగులు తీసూ వాటి స్వేచ్చకు భంగం కలిగించకూడదని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అక్కడకు ఎలా వెళ్ళాలి ?విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పై (విజయవాడకు 20 కిలోమీటర్ల దూరం) మూలపాడు గ్రామం ఉంది. ఆక్కడి నుంచి కుడి వైపకు 3 కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ ఆటవీ ప్రాంతం మొదలవుతుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల దూరంలో సమాంతరమైన ఆటవీ ప్రాంతంలో అభయాంజనేయస్వామి ఆలయం, దొంగమర్ల బావి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే రంగు రంగుల సీతాకోకచిలుకలు సందడి చేస్తాయి. ప్రభుత్వం ఇలాంటి అందమైన పర్యాటక కేంద్రాన్ని మరింతగా ప్రాచుర్యం కలిగించి, మంచి పర్యటక కేంద్రంగా, సీతాకోకచిలుకల మనుగడకు ఇబ్బంది లేకుండా మరింత అభివృద్ధి చెయ్యాలి... Add new comment

సముద్రంలో రయ్మంటూ దూసుకుపోవాలనుందా? కెరటాల పై కేరింతలు కొడుతూ షికారు చేయాలనుందా? అయితే వైజాగ్ పదండి. త్వరలోనే ఆ కోరిక తీరుతుంది. దేశంలోనే తొలిసారిగా మన విశాఖ బీచ్ లో అలాంటి వారి సరదాలు తీర్చేందుకు హోవర్ క్రాఫ్ట్ వస్తోంది. ఇన్నాళూ, ఇంగ్లండ్ అమెరికా వంటి దేశాల్లోనే ఉన్న ఈ హోవర్ క్రాఫ్ట్ ఇప్పడు మనకూ రాబోతోంది. అక్షర ఎంటర్ప్రెజెస్ సంస్థ దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టబోతోంది. విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్ లలో వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.8 కోట్ల ఇందుకు నేవీ, కోస్ట్ గార్డ్ , విశాఖపోర్టు, జీవీఎంసీ, వుడా, కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు, ఎన్ఐఓ వంటి అన్ని అనుమతులను తెచ్చుకుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇందుకోసం బ్రిటన్ నుంచి ఒక్కొక్కటి రూ.1.80 కోట్ల వెచ్చించి రెండు హోవర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసింది. తొమ్మిది సీట్ల సామర్థ్యం ఉండే ఈ క్రాఫ్ట్ లో పైలట్ (డైవర్), ఒక సహాయకుడితో పాటు మరో ఏడుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఆర్కే బీచ్ సమీపంలో ఒక పాయింట్ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నుంచి పార్క్ హోటల్ వరకు, తొట్లకొండ పాయింట్ నుంచి ఆ పరిసరాల్లోనూ 20 నుంచి 25 నిమిషాల పాటు సముద్ర ఒడ్డు నుంచి 500 మీటర్ల దూరం వరకు వీటిని తిప్పనున్నారు. ఈ హోవర్ క్రాఫ్ట్ లో షికారు చేయడానికి ఒక్కొక్కరికి రూ.300 టికెటుగా నిర్ణయించాలని యోచిస్తున్నారు. భద్రత కోసం ఒడ్డున సేఫ్టే బోట్లను కూడా సిద్దంగా ఉంచుతారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ హోవర్ క్రాఫ్ట్ లు నడపడానికి అవసరమైన అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. Add new comment

ఏ నగరాన్నయినా రోడ్ల మీద తిరుగుతూ చూడటం కన్నా విహంగ వీక్షణంలో చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది... అలాంటి అనుభూతి స్వయంగా పొందకపోయినా, ఈ వీడియో చూడండి, బెజవాడ ఎంత అందంగా ఉందో... హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ, నగర అందాలు కెమెరాలో రికార్డు చేశారు...హెలికాప్టర్ నుంచి ఈ సీన్ చూస్తుంటే, ఆస్వాదించే మనసుండాలేగాని బెజవాడలో ప్రతి ప్రాంతం సోయగాల బృందావనమే... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఆకాశం నుంచి బెజవాడ ఎంత అందంగా ఉందో చూడండి... కృష్ణా తీరం, పచ్చని కొండలు, నగరంలో నుంచి ప్రవహించే కాలువలు, కృష్ణా నదిలో ద్వీపాలు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, లయలా కాలేజి, సిద్ధర్దా కాలేజీ, స్టేడియం, ఇలా విజయవాడ నగర విహంగ వీక్షణం అద్భుతం... Add new comment

విశాఖ నగరంలో రుషికొండ సాగర తీరంలో రూ.300 కోట్ల వ్యయంతో ఓషనేరియం ఏర్పాటు కాబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకానున్న ఈ ప్రాజెక్టుకు రుషికొండ వెనక భాగంలో సాగరతీరానికి ఆనుకుని 10 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. గత జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆనందా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ క్రమంలో సాంకేతిక సర్వే నిర్వహించడానికి మే మొదటి వారంలో జర్మనీ, చైనా దేశాలకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఓషనేరియం ఏర్పాటుకు నిర్దేశించిన ప్రాంతాన్ని సందర్శించనుంది. ఏమిటి ఈ ఓషనేరియంసింపుల్ గా చెప్పాలి అంటే, సముద్రంలో ఉండే ఆక్వేరియం లాంటిది... మనం మధ్యలో నుంచి నడుచుకుంటే వెళ్తుంటే, అద్దంలో సముద్రపు జీవరాశులుని చూస్తూ, ఎంజాయ్ చెయ్యవచ్చు... ఈ ప్రాజెక్ట్ పర్యటకంగా విశాఖకు ఎంతో మేలు చేయ్యనుంది. Add new comment

విద్యార్ధులు బస్ పాస్ పొందాలంటే, అదో ప్రహసనం. ఓ రోజంతా సమయం వృధా, సవాలక్ష ఆంక్షలు, నిబంధనలు, అన్నీ ముగించుకుని బస్తాండ్ కు వెల్తే గంటల కొద్ది క్యూ. ఆ రోజంతా స్కూల్/కాలేజీకి సెలవు. ఇలా లెక్కలేనన్ని ఇబ్దందులతో బస్ పాస్ పొందాల్సి ఉంటుంది. విద్యారుల అవస్థలను అర్థం చేసుకున్న ఆర్టీసీ సరికొత్త ఆన్లైన్ బస్ పాస్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బస్ పాస్ దరఖాస్తు చేసుకోవడం, దానిని పొందడం కూడా ఈజీనే. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; www.apsrtcpass.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే, పదో తరగతి వరకూ విద్యార్ధులకి, పడవ తరగతి పై బడిన విద్యార్ధులకి వేరు వేరు ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసిన తరువాత, కొత్త పాస్ కోసం రిజిస్టర్ చెయ్యలా ? లేదా పాస్ రెన్యువల్ చేసుకుంటారా అని అడుగుతుంది. విద్యార్థి పూర్తి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, సెల్ ఫోన్ నెంబర్, ఈ-మెల్ అడ్రస్, విద్యార్థి ఫోటో, జిల్లా, మండలం, గ్రామం, ఇంటి నంబరు, ఊరిపేరు తదితర వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరచాలి. పూర్తి వివరాలకు, ఈ వెబ్సైట్ కి వెళ్లి చూడండి www.apsrtcpass.in Add new comment

ఏడాదికి ఎకరాకు 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ప్రకృతి వ్యవసాయంలోనే ఉందని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలకు కాలం చెల్లిందని, ఆ పద్ధతుల వలన రైతులకు నష్టం కలుగుతుందని వినియోగదారులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం రైతుల భూములలో భూసారం తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోయి అప్పులు పెరిగి వ్యవసాయం మానేసి గ్రామాల నుండి పట్టణాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా యువతకు సేద్యం అంటే తెలియని పరిస్థితి వచ్చిందని, ఉన్న ఆస్తులను తెగనమ్ముకుని పట్టణాలకు వలస వెళుతున్నారని అన్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు లాభాల పంట పండించేందుకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని సుభాష్ పాలేకర్ అన్నారు. ద్రాక్ష, స్టాబెర్రీ, యాపిల్, దాల్చిన చెక్క, మిరియాలు వంటి పంటలను ఆంధ్రప్రదేశ్ భూముల్లో కూడా పండించవచ్చని ఆయన అన్నారు. ఎకరాకు 6 లక్షలు నుండి 12 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఒక్క ప్రకృతి వ్యవసాయానికే ఉందని అన్నారు. రైతులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందిస్తే ఎంతో లాభం గడించవచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పాలసీలు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉందంటూ ఈ విషయం ఇప్పటివరకు కాకినాడ, తిరుపతి పట్టణాలలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. మరికొంత మంది రైతులకు వచ్చే జనవరిలో హైదరాబాదులో శిక్షణ కార్యక్రమాలు కల్పించి అవగాహన కల్పిస్తామన్నారు. త మిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఎకరాకు 80 క్వింటాళ్లు పండించిన ఘనత అక్కడి రైతులదన్నారు. వారు రసాయనిక ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు వినియోగించలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశ జనాభా 123 కోట్లు ఉందని, భవిష్యత్తులో 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లు పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఎటువంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఆలోచించాలన్నారు. అయితే ఇప్పటికి దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అదిక ఉత్పత్తులు సాధించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని వ్యవసాయ విశ్వవిద్యాలయ అధిపతులు అంటున్నారని ఆయన అన్నారు. Add new comment

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర రంగం ఒక మూలస్థంభాన్ని కోల్పోయిందన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకువెళ్లిన దాసరి పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలిచారని చెప్పారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; నాతో చాలా ఆత్మీయంగా మాట్లాడేవారని, ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవించేవారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రెండు నెలల క్రితం, హాస్పిటల్ లో చికిత్స జరుగుతున్నప్పుడు వెళ్లి కలిసానని, గుర్తుచేసుకున్నారు. దర్శక రత్న దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. Add new comment

ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాత్రి 7 గంటలకు ఆయన గుండె పనిచేయడం మానేసిందని, దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని కిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన బులెటిన్‌ను బుధవారం విడుదల చేయగలమని అన్నారు. ముందుగా ఆయన కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేస్తామని, ఆ తర్వాత మాత్రమే బయటకు విడుదల చేయగలమని తెలిపారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. Add new comment

సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రేచల్‌ చటర్జీ నేతృత్వంలో సివిల్స్‌ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. సీనియర్‌ ఐఏఎస్గా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరొందిన ఆమె.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. టాపర్స్‌ అకాడమీలో ప్రముఖ విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌టీఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌లో విజయం సాధించడానికి పరీక్ష విధానానికి అనుగుణంగా అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందించి... వారి ప్రతిభను వెలుగులోకి తెస్తారు. ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ అందజేస్తోంది. ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణనిచ్చే కార్యక్రమ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.ఈ పథకం కింద ఉచిత కోచింగ్‌తో పాటు, నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 3850 మందిని ఎంపిక చేసి దేశవ్యాప్తంగా నిర్దేశించిన 15 కోచింగ్ సెంటర్లలో 9 నెలల పాటుశిక్షణ ఇస్తారు. సీట్ల సంఖ్యఎస్సీ – 700ఎస్టీ – 300బీసీ – 1000కాపు – 750మైనారీటీ – 300బ్రాహ్మణ – 50ఈబీసీ – 750మొత్తం – 3850 google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; వయోపరిమితి: ఆగస్టు 1, 2018 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.కాపు, బ్రాహ్మణ, మైనారిటీ అభ్యర్థుల వయస్సు 32, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీలకు 37, VH/HH/OH అభ్యర్థులకు 42 సంవత్సరాల లోపు ఉండాలి.విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. (కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయానికి డిగ్రీ పాస్ సర్టిఫికేట్ పొందాలి)ఆదాయ పరిమితి: కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 6 లక్షలు మించరాదు.గమనిక: రెండోసారి ఉచిత శిక్షణకు అవకాశం లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ద్వారాపవేశ పరీక్ష ఫీజు: ఉచితంపరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లా కేంద్రాలుసిలబస్: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ ప్రకారం ప్రవేశ పరీక్ష ఉంటుంది.స్టైఫండ్: ప్రతి నెల అభ్యర్థికి స్టైఫండ్ ఇస్తారు. నిర్దేశించిన కోచింగ్ సంస్థలుAlternative Learning Systems, DelhiSri Ram IAS, DelhiAnalog IAS, Hyderabad, Guntur, BangaloreBraintree, HyderabadDr.Lakshmaiah IAS Study Circle, HyderabadKrishna Pradeep 21st Century, Hyderabad & VisakhapatnamLA Excellence, HyderabadRC Reddy IAS Study Circle HyderabadToppers IAS Academy, HyderabadVarsity Management, HyderabadShankar IAS Academy, ChennaiUniversal Coaching Center, Bangalore ముఖ్యమైన తేదీలు:ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 25, 2017దరఖాస్తుకు చివరి తేది: జూన్ 14, 2017హాల్ టికెట్ డౌన్‌లోడ్: జూన్ 15-19 వరకుపరీక్ష తేది: జూన్ 20, 2017 పూర్తి వివరాలకు..http://www.kapucorp.ap.gov.in/documents/Detailed%20Notification.docx Add new comment

ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో, మొదటి అడుగు పడింది, జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ తో.. తరువాత కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్ ఇలా దిగ్గజ కంపెనీలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి, ముందుకు వచ్చాయి... జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో 107 ఎకరాల విస్తీర్ణంలో రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఇసుజు మోటార్స్ ప్లాంట్ 2016లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రొడక్షన్ ప్రారంభించిన కంపనీ, ఏడు సీట్లతో కూడిన ఎస్‌యువి ఎంయు-ఎక్స్‌ అనే మోడల్ చారు ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసి, మే 2017లో దేశీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభించనుంది. అత్యంత ఆధునిక పరిజ్ఞానం, రోబోటిక్‌ సహాయంతో ఈ పరిశ్రమలో వాహనాలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీసిటీ ప్లాంట్‌ సామర్థ్యం ఏటా 50 వేల యూనిట్లుండగా దీన్ని 1.2 లక్షల యూనిట్లకు పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; భారత నుంచి 15-20 దేశాలకు ఇసుజు వాహనాలను ఎగుమతి చేయాలని ఇసుజు మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ నుంచి ఇప్పటికే నేపాల్‌కు ఎగుమతులను ఇసుజు ఇండియా ప్రారంభించింది. ఈ వీడియో చూడండి, శ్రీసిటీలోని 107 ఎకరాల ఇసుజు ప్లాంట్, కార్లు ఎలా తయారు చేస్తుందో... ఇది మేడ్ ఇన్ ఆంధ్రా కార్... ఆ సౌండ్ ఇంటుంటే, వచ్చే ఫీలింగే వేరు కదా... Add new comment

ఉచిత వైద్య సహాయమును రూ. 2 లక్షల నుండి రూ. 2.5 లక్షలకు పెంపు వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు రూ. 6 లక్షల వరకు చికిత్స మూత్రపిండ మార్పిడి చికిత్స ఆపరేషన్ కు రూ. 3.5 లక్షలు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్సకు వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత వైద్యం రాష్ట్రంలోని 421 ఆసుపత్రుల్లో చికిత్స 944 చికిత్సలతోపాటు అదనంగా వంద చికిత్సలు మొత్తము 1044 చికిత్సలకు ఉచితంగా వైద్య చికిత్స ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ‘అందరికీ ఆరోగ్యం’ పేరుతో రూపొందించిన ఈ పథకానికి పేద ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కాయకష్టం చేసుకుంటే కానీ పూటగడవని నిరుపేదలకు ఈ పథకం వరంలా మారింది. అనుకోకుండా జబ్బుల బారిన పడి.. వైద్య పరీక్షలకు, ఆపరేషన్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేని పేదలంతా ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్నే ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న జబ్బుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యం అందుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక.. 2014 జూన్ 2 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రారంభించారు. రాష్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కోటీ 30 లక్షలకు పైగా కుటుంబాలను ఈ పథకంలో చేర్చారు. 29 విభాగాలకు చెందిన 1044 వ్యాధులకు సంబంధించి రెండున్నర లక్షల రూపాయల విలువైన వైద్య పరీక్షలు, ఆపరేషన్లను ఈ పథకంలో నిర్వహిస్తారు. ఈ పథకం కింద కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ వైద్యం చేయించుకునే అవకాశం ఉండటం పేద ప్రజలకు సౌకర్యంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ హాస్పిటళ్లనే కాకుండా.. 338 ప్రైవేటు హాస్పిటళ్లను ఈ పథకంలో చేర్చి.. పేదలకు వైద్యం అందేలా చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగ్గా వైద్యం చేయరన్న భయంతో ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి.. ఉన్నదంతా అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని బాధపడే పేదలు కూడా.. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వైపు చూస్తున్నారు. దీంతో క్రమేపీ ఈ పథకం కింద వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, నాణ్యమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయించారు. రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను కూడా ఆధునీకరించేలా చర్యలు తీసుకున్నారు. ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు, వైద్య సేవల విస్తృతి, మందుల కోసం నిధుల పెంపు, హాస్పిటళ్లలో పారిశుధ్యం మెరుగుకు చర్యలతో.. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ను తలదన్నేలా తయారయ్యాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ముఖ్యంగా నిరుపేదలకు ఈ పథకం సంజీవినీగా మారుతోంది. ఎలాంటి ఖర్చు లేకుండా... అన్ని విధాలుగా ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు కార్డులతో వైద్యం అందిస్తోంది. జూన్ 2, 2014 నుంచి ఈ పథకం కింద చికిత్స అందిస్తున్నారు. ఇంతకు మునుపు ఉన్న 944 చికిత్సలకు అదనముగా 100 చికిత్సలను చేర్చి, మొత్తము 1044 చికిత్సలకు అనుమతి పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచితముగా వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి ప్రభుత్వం వారు ఇంతకు మునుపు ఇస్తున్న ఉచిత వైద్య సహాయాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు చేయు కాక్లియార్ ఇంప్లాంటేషన్ కు రూ. 6 లక్షల వరకు మరియు మూత్ర పిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ. 3.5 లక్షల వరకు ఈ పథకం కింద లబ్దిపొందవచ్చు. గుండె , ఊపిరి తిత్తులు మరియు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్స కూడా ఈ పథకంలో చేర్చారు. దీని ద్వారా నిరుపేదలకు ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు అప్పులబారిన పడకుండా ప్రభుత్వం వారికి వైద్య సహకారాన్ని అందిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ఇప్పటివరకు అవుట్ పేషంట్ల సంఖ్య 13,06,773... అలాగే ఇప్పటివరకు ఇన్ పేషంట్ల సంఖ్య 14,28,813... ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ముందుగా అనుమతి తీసుకొని వైద్యం చేయించుకున్నవారు 8,64,517. వారి చికిత్స కోసం అయిన మొత్తం రూ. 2528.079 కోట్లు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 12,78,583. ఆపరేషన్ల కోసం ఖర్చయిన మొత్తం రూ. 3728.997 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపుల కోసం వచ్చిన క్లెయిమ్ లు 11,87,309 గా ఉన్నాయి. క్లెయిమ్ ల కోసం చెల్లించిన మొత్తం రూ. 3138.245 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి 133 వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులకే కేటాయించడమైనది. 133 వైద్య సేవలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన 911 (1044-133=911) వైద్య సేవల సంఖ్య 3,05,357 గా ఉంది, ఈ వైద్య సేవలకు వెచ్చించిన ఖర్చు రూ. 801.524 కోట్లకు చేరుకొంది. ఇక 133 వైద్య సేవలకు సంబంధించి ముందుగా అనుమతి తీసుకున్నవారి సంఖ్య 48,560గా ఉన్నాయి, ఈ సేవల కోసం వెచ్చించిన మొత్తం రూ. 137.306 కోట్ల మేర చెల్లించారు. 133 వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 103 గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిరుపేదల తమ జీవన సౌధాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. లక్షల రూపాయలు వైద్యం కింద చెల్లించడం తమ వల్లే అయ్యేది కాదని... రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈ విధంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో తమ జీవితాలకు భరోసా వచ్చిందని వారు భావిస్తున్నారు. చికత్స తీసుకున్న ప్రతి పేషెంట్ వివరాలు, అయన ఖర్చు, సమయం, హాస్పిటల్ పేరు ఇలా అన్నీ కోర్ డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి... ప్రతి పైసాకి పూర్తి జవాబుదారీతనం ఉంటుంది.. http://www.core.ap.gov.in/CMDashBoard/UserInterface/HealthFamilyWelfare/NTRVaidhyasevaMainReport.aspx Add new comment

సమాజంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పధంలో నడిపిస్తూ, అందరికీ సరైన గౌరవం ఇస్తూ, అన్ని రకాల పధకాలతో, ఆర్ధికంగా, సామజీకంగా ఆడుకుంటున్న చంద్రబాబు, ముస్లిం సోదరులను కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు... చంద్రన్న రంజాన్ తోఫా:పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా చేసుకోవాలన్న ఆకాంక్షతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రన్న రంజాన్ తోఫాను 11.3 లక్షల కుటుంబాలకు అందించింది. చంద్రన్న రంజాన్ తోఫా కోసం ప్రభుత్వం రూ. 65.36 కోట్ల విడుదల చేసింది. క్కో కార్డుదారునికి ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యితో కూడిన గిఫ్ట్‌ ప్యాక్‌ను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇమామ్లకు, మౌజన్లకు పారితోషికం:రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి 2017-18 బడ్జెట్లో రూ. 840.25 కోట్ల కేటాయించింది. పేదరికంలో మగ్గుతున్న 5000 మసీదులలోని ఇమామ్లకు, మౌజన్లను పారితోషికం కింద గత ఏడాది రూ.24 కోట్ల కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్లో రూ.32 కోట్లు కేటాయించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దుల్షన్ పథకం:ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముస్లిం, మైనార్టీ కుటుంబాల యువతులకు దుల్షన్‌ పథకం ద్వారా రూ.50వేలు అమ్మాయి పేరిట బ్యాంకు ఖాతాలో వేస్తారు. దుల్షన్ పథకం కింద గత ఏడాది రూ.49.11 కోట్ల కేటాయిస్తే, 9,822 మంది లబ్దిపొందితే, ఈ ఏడాది రూ. 60 కోట్ల కేటాయింరు, దీంతో 12,000 మంది ముస్లిం వధువులు లబ్దిపొందుతారు. రోష్ని పథకం:మైనార్టీ వితంతువులు, భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు, అంగవైకల్య మహిళలకు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 75 శాతం సబ్సిడీతో రూ.25 వేలు ఆర్థిక సాయం ఆదరణ పథకం:చిరు వ్యాపారులకు యూనిట్‌కు రూ.25వేలు సబ్సిడీ, ఆదరణ పథకం ద్వారా రూ.10వేలు నుంచి రూ.25 వేలు వరకూ ఆర్థిక సాయం. నిరుద్యోగ యువతకు సబ్సిడి ద్వారా రుణ సాయం: మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్:అలాగే 2016-17లో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 203.45 కోట్ల, మెయింటెనెన్స్ ఫీజు కింద రూ. 44.69 కోట్ల ఇస్తే, 1,08,322 మంది విద్యార్థులు లబ్ది పొందారు. 2017-18లో ఫీజు రీయింబర్స్మెంట్ కు రూ. రూ.225.00 కోట్ల, మెయింటెన్స్ ఫీజు కింద రూ. 60 కోట్ల కేటాయించారు. దుకాన్‌-మకాన్‌ పథకం:మైనార్టీల సంక్షేమానికి రూ.379 కోట్లు కేటాయుంచిన ప్రభుత్వం, ‘దుకాన్‌-మకాన్‌’ పథకం కింద యూనిట్‌ విలువలో 50 శాతం గరిష్ఠంగా రూ.లక్ష దాకా సబ్సిడీ ఇస్తుంది. మసీదుల కోసం:2016-17లో 57 మసీదులకు 6.99 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. మైనారిటీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం:ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని 300 మంది ముస్లిం విద్యార్థులకు వర్తింపజేస్తే, మైనారిటీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవటానికి ఒక్కొక్క విద్యార్ధికి రూ. 10 లక్షల సహాయం అందచేసారు. హజ్ హౌస్:కడప లో హజ్ హౌస్ నిర్మాణానికి 12 కోట్ల, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి రూ 11 కోట్ల కేటాయించారు. ఉర్దూ భాషాభివృద్ధికి:ఉర్దూ భాషాభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయింపు మక్కా యాత్రకు:ముస్లిం సోదరులకు పవిత్ర మక్కా యాత్రకు ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2,810మంది హజ్‌ యాత్రకు. ముస్లింలకు శాసనమండలి చైర్మన్‌ పదవి:శాసనమండలి ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూఖ్‌ మండలి చైర్మన్ గా:ముస్లిం సమాజ అభివృద్ధి ముస్లింల పట్ల విశ్వాసాన్ని చూపుతూ, ఎం ఎల్ సి గా ఫరూక్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మెన్ నోమాన్ గారికి పదవులు ఇచ్చి, మండలి చైర్మన్ పదవి కూడా ముస్లింలకు ఇచ్చి, ముస్లిం సోదరుల నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ మరోమారు చంద్రబాబు తాను ముస్లిం పక్షపాతిని అని నిరూపించుకున్నారు. ఇలా అన్ని రకాలుగా, రాష్ట్రంలోని ముస్లిం సోదరులను, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుని, అండగా ఉంటుంది... Add new comment

రాష్ట్రంలో బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోంది. బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా, ఉన్నత స్థాయికి ఎదిగేలా పధకాలు ప్రవేశపెట్టారు. అంతే కాదు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో, మంత్రివర్గంలో అత్యధికంగా 8 మంది బీసీలకు చోటు కల్పించారు చంద్రబాబు. తమ పార్టీకి వెన్నుముక బీసీలు మాత్రమే అని చెప్పే చంద్రబాబు, అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని బడుగులు సైతం ఇతర సామాజికవర్గాలకు తీసిపోని విధంగా భవిష్యత్ ను నిర్మించుకునేందుకు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీఇంబర్స్మెంట్ పథకాలతో పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం బీసీ సామాజికవర్గాల నుంచి విదేశీ విద్య చదువుకునేందుకు కావాల్సి నిధులను సైతం అందిస్తోంది. బీసీ సంక్షేమం కోసం చంద్రబాబు అందిస్తున్న పథకాల వివరాలు ఇవి... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; బీసీ సబ్ ప్లాన్:దేశ చరిత్రలో తొలిసారిగా బిసిల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఇందుకు రూ. 10,000 కోట్లు కేటయించింది. గత ఏడాది కంటే ఇది 13.22% ఎక్కువ. బీసీ ఫెడరేషన్ లోన్స్:కుల వృత్తులవారికి, చేతివృత్తులవారికి బి.సి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఐదుగురు సభ్యులున్న బృందానికి రూ.10 లక్షల వంతున యూనిట్ స్థాపనకు ఇవ్వనున్నారు. చంద్రన్న పెళ్లి కానుక:బీసీల కోసం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించిన చంద్రబాబు, దీని ద్వారా బీసీ జంటలకు రూ.30 వేలు పెళ్లి ఖర్చుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆదరణ పధకం:బిసిల్లో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ కులవృత్తిని ప్రోత్సహించేందుకు ‘ఆదరణ’ పధకం. కులవృత్తుల చేతివృత్తి పనివారి ఆదాయాన్ని పెంచేలా పని ముట్లను కొనుగోలు చేసుకొనుటకు ఆదరణ పధకం క్రింద ఆర్థిక సహాయం. బీసీ విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంట్:10 లక్షల మంది బీసీ, ఈబీసీ విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌లు చెల్లించారు. 2017-18లో 8,80,000 మంది బిసి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటిదాకా (28.8.17 వరకు) 6,77,976 మంది విద్యార్ధులు నమోదు చేయించుకున్నారు. బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ రూ.274.50 కోట్లు కేటాయించగా, రూ.137.25 కోట్లను రెండు విడతలుగా విడుదల చేశారు. మొత్తం 4,84,714 మంది బిసి విద్యార్ధులు లబ్ది పొందారు. పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద 3,77,510 మంది విద్యార్ధులు లబ్ది పొందారు. ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ ‌మెంట్ కింద రూ.1042 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, రూ.521 కోట్లు విడుదల చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం:2016-17 బిసి ఉప ప్రణాళికలో 500 మంది బీసీ విద్యార్ధులకు ‘ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం’ అమలు. ఇందుకోసం రూ.69.11 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం క్రింద బీసీ విద్యార్ధులు విదేశీ విద్య అభ్యసించేందుకు ప్రతి విద్యార్థికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేస్తుంది ప్రభుత్వం స్కిల్‌ డవలప్‌ మెంట్‌ :విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం పై శిక్షణ ఉండాలని స్కిల్‌ డవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. బీసీ భవన్‌:ప్రతీ జిల్లాలో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో బీసీ భవన్‌ ఏర్పాటు బీసీ గురుకుల పాఠశాలలు:వెనుకబడిన గురుకుల పాఠశాలల్లో 16,000 మంది బిసి విద్యార్ధులకు విద్య బీసీ సంక్షేమ పథకాలు:బీసీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్.బీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ఈబీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసంబీసీ వెల్ఫేర్ హాస్టళ్ళుబిసి స్టడీ సర్కిళ్లు, బాలబాలికల హాస్టళ్ళు.బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళుబీసీ గురుకుల పాఠశాలలుమహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విద్యానిధిహాస్టళ్లు, స్కూలు భవనాల నిర్మాణంవెనుకబడిన తరగతులకు సామాజిక భవనాల నిర్మాణంఏపీ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణాలుబీసీ అభ్యుదయ యోజనబిసి ఫెడరేషన్స్దోభీ ఘాట్ల నిర్మాణం Add new comment

రాష్ట్రంలో చాలా మంది శిశువులు బరువు తక్కువగా ఉండటం... వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారు. శిశు మరణాలను నివారించేందుకు, వారిని వ్యాధుల నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ’’ఎన్టీఆర్ బేబి కిట్స్‌’’ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రభుత్వం ఇచ్చేది రూ.772 విలువ చేసే వస్తువులు అయినా అంతకంటే ఎక్కువ విలువచేసే ఫలితాలు కనిపిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల శాతం మూడింతలయింది. ఇదంతా బేబి కిట్స్‌ వల్లనే కాకపోయినా... డెలవరీలు పెరగడానికి మాత్రం ఇదీ ఒక కారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. తల్లీబిడ్డలకు ఏకకాలంలో రక్షణ దొరుకుతుండటంతో.. బేబి కిట్స్‌ని అందించే ప్రభుత్వాస్పత్రులకు ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. పథకం అమల్లోకి వచ్చిన తరువాత డెలివరీల శాతం మూడింతలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి అంతగా సమకూరని శిశుదశని దాటేస్తే.. బిడ్డ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఈ కీలక దశలో బేబికిట్స్‌ని అందించడం మంచి ఫలితాలను ఇస్తున్నదని, చిన్నారుల మరణాల శాతం తగ్గడానికి దోహదపడిందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెలివరీల కోసం ప్రజలు చేసే ఖర్చు 50 శాతం నుంచి 17 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. మరో ఏడాదికి ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నూటికి 90శాతం మంది పేదలు చికిత్స చేయించుకొనే మిషనరీ ఆసుపత్రుల్లో సైతం బేబి కిట్స్‌ని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఏమేం ఉంటాయి.. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; బేబి కిట్స్‌లో బెడ్‌ కమ్‌ క్యారీ కిట్‌, టవల్‌, హ్యాండ్‌ వాష్‌, దోమ తెర వంటి నాలుగు వస్తువులుంటాయి. వీటిలో బెడ్‌ కమ్‌ క్యారీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉంచితే, తల్లి గర్భంలో శిశువుకు ఎలాంటి రక్షణ లభిస్తుందో, ఆ స్థాయి కవచంలా పనిచేస్తుంది. బయట వాతావరణం వల్ల శిశువులకు వచ్చే వ్యాధుల నుంచి కాపాడటంతోపాటు, ముద్దు చేయడానికి ముందుకొచ్చే వారి నోరు, చేతుల్లోని ఇన్ఫెక్షన్‌ నుంచి చిన్నారులను రక్షిస్తుంది. కాటన్‌తో తయారు చేయడం వల్ల చిన్నారుల శరీరానికి హాయిని అందిస్తుంది. చిన్నారులకు స్నానం అనంతరం వాడటానికి టవల్‌ని కిట్‌లో ఉంచారు. పాలిచ్చే సమయంలో తప్ప.. తల్లులు బిడ్డల దగ్గర సాధారణంగా ఉండరు. ఏదో పని చక్కబెడుతూనే ఉంటారు. అటువంటివారి కోసం హ్యాండ్‌ వాష్‌ని ఉంచారు. పాలిచ్చే ముందు హ్యాండ్‌ వాష్‌తో చేతులు శుభ్రం చేసుకొంటే, ఎలాంటి సమస్యలూ దరికి చేరవు.   గత ఏడాది సెప్టెంబరు నుంచి జూలై చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 2 లక్షల 25 వేల మంది డెలివరీ అయితే 2,05,200 మంది మహిళలకు బేబి కిట్లు అందించారు. ఈ పధకానికి బసవతారకం కిట్‌ అదనం. ఈ కిట్‌ విలువ రూ. 1000 పైన ఉంటుంది. ఇందులో బాలింతలకు అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌, తలకు చుట్టుకొనే స్కార్ఫ్‌, బిడ్డకు పాలిచ్చేందుకు అనుకూలంగా ఉండే రెండు యాప్రాన్లు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రె్‌సలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న వారికి రూ.1000 ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పధకం ఏంతో పారదర్శకంగా జరుగుతుంది... ఎవరికి కిట్ ఇచ్చారు, ఏ జిల్లలో, ఏ హాస్పిటల్ లో ఇచ్చారు, తల్లి, తండ్రి,బిడ్డ పేరుతో సహా, ఫోటో తీసి వెబ్సైటులో పెడతారు... ఏ రోజు , ఎవరు తీసుకున్నారు అనే వివరాలు అన్నీ తెలుస్తాయి... ఇక్కడ చూడవచ్చు http://hmfw.ap.gov.in/DH/NBK_DisWise_Reports.aspx Add new comment

బాబు అంటే భరోసా... బాబు అంటే నమ్మకం... బాబు అంటే బాధ్యత... ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్నదనే లక్ష్యంతో, బాలికా విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లాపరిషత, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మోడల్‌ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ‘బడికొస్తా’ పథకంతో సైకిళ్లు పంపిణీ చేస్తుంది. ఈ పథకానికి రూ.75 కోట్ల వ్యయమవుతోందని 1,81,556 సైకిళ్లు అందజేయనున్నారు. డ్రాపవుట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; నిజానికి, తొమ్మిదో తరగతిలోనే డ్రాపవుట్లు ఎక్కువ. కీలక అడుగు పడే సమయం ఇది. ఈ ఒక్క క్లాసు దాటేస్తే.. చదువులో ముందుకు వెళ్లిపోతారు. సరిగ్గా ఈ దశలోనే పిల్లల తల్లిదండ్రుల్లో ఊగిసలాట ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో ‘అడుగు ముందుకా- వెనక్కా’ అనేది తేలిపోయేది ఆ సమయంలోనే. ఈ విషయంలో ఆడపిల్లల పక్షా న నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ, మరోవైపు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్ర యాణం చేసేలా.. ఈ తరగతి బాలికల కోసం వినూత్న పథకం ప్రవేశపెట్టింది. 2017 ఆగష్టు నెల వరకు జిల్లాల వారిగా, సైకుళ్ళు తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళంలో 12,916 మందికి గాను, 7,228 మంది, విజయనగరంలో 9,874 మందికి గాను, 5,054, విశాఖలో 12,962 మందికి గాను, 12,159, తూర్పుగోదావరిలో 22,652 మందికి గాను, 21,300, పశ్చిమగోదావరిలో 16,841 మందికి గాను, 16,266, కృష్ణాలో 13,970 మందికి గాను, 13,569, గుంటూరులో 15,533 మందికి గాను, 15,507, ప్రకాశంలో 10,582 మందికి గాను, 6,100, నెల్లూరులో 9,674 మందికి గాను, 8,580, చిత్తూరులో 16,722 మందికి గాను, 16,722 (100 శాతం), కడపలో 9,257 మందికి గాను, 9,257(100 శాతం), కర్నూలులో 14,922 మందికి గాను, 14,111, అనంతపురంలో 15,581 మందికి గాను, 15,225 మంది బాలికులకు సైకుళ్ళ పంపిణీ జరిగింది. సైకిళ్ళు అందుకున్న ఆ పిల్లల ఆనందం వారి మాటల్లోనే వినండి... Add new comment

పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్ర లోని దాదాపు 12 లక్షల మందికి పైగా ఉన్న దివ్యాంగుల సర్వతొముఖాభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి పథకాలను అమలుచేస్తోంది. సమాజంలో వెనుకబాటుతనం అనుభవిస్తున్న దివ్యాంగులు ఇతరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. దీనిలో భాగంగా కాళ్లు పూర్తిగా లేని, నడుం కింది భాగం నుంచి పూర్తిగా పనిచేయని వారికి తోడ్పాటును అందించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా మూడు చక్రాల బైక్, బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను అందించే భృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు తమ కనీస అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉచిత వాహనాల పంపిణీ చేపట్టింది. దీనికోసం రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా దివ్యాంగుల కోసం అనే వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా అక్టోబరు 15వ తేదీ లోగా ఉచిత వాహనాలను పొందేందుకు అర్హులైన దివ్యాంగులు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా వాహనాల పంపిణీ పథకం అమలులో ఉన్నప్పటికీ కఠినమైన నిబంధనలతో పాటు కేవలం 50 శాతం సబ్సిడీ పై పీజీ విద్యార్హత కలిగిన వారికే వాహనాలను పంపిణీ చేయడం జరిగేది. ఈ విధంగా 2015-16 సంవత్సరంలో మోటరైజ్డ త్రీ వీల్స్ వెహికల్స్ 50 మందికి, 2016-17 సంవ త్సరంలో 47 మందికి అంద చెయ్యటం జరింగింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఎలా అప్లై చేసుకువాలి ? పదవ తరగతి పాసైతే చాలు.గతంలో పీజీ చదుకున్నదివ్యాంగులకే మూడు చక్రాల బైక్ ను అందిస్తున్న ప్రభుత్వం మరింత మందికి లబ్దిని చేకూర్చే దిశగా తాజాగా విద్యార్హత నిబంధనలను సడలించింది. దీనితో రూ.75 వేల విలువ గలిగిన మూడు చక్రాల బైక్, లక్షరూపాయల విలువ గలిగిన బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారు సవరించిన నిబంధనల ప్రకారం 10వ తరగతి పాసైతే చాలు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండి కాళ్లలో 80 శాతం అంగవైకల్యం ఉందనే వైద్య ధృవీకరణ పత్రంతో పాటు పదవ తరగతి మార్కుల జాబితా, అంతకు మించి విద్యార్హతలు ఉంటే వాటి వివరాలు, ఆధార్, రేషన్ కార్డులు, కుల ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాలు, డైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నవారు ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక వెబ్ సైట్ (http://www.apdascac.ap.gov.in/) ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు అర్హులు ? మూడు చక్రాల బైక్లను పొందాలనుకునే వారికి చేతులు ధృడంగా ఉండటంతో పాటు నడుము క్రింది భాగంలో 80 శాతం వైకల్యం ఉండాలి. కానీ వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారికి నడుము పై భాగంలో కూడా వైకల్యం ఉండాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తరువాత వచ్చిన ధరఖాస్తులను కులంకషంగా పరిశీలించి, అర్హులైన దివ్యాంగులను ఎంపికచేసి, వారిలో 2,450 మందికి మూడు చక్రాల బైక్లు, 175 మందికి వీల్ చైర్ వాహనాలను అందజేయనున్నారు. మొత్తం 2625 వాహనాల పంపిణీ కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.20.18 కోట్లు నిధులను కేటాయించింది... అలాగే అంధులకు కూడా ప్రత్యేక ల్యాప్‌ట్యా్‌పలు, కంప్యూటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. కీబోర్డుపై చేతితో టైప్‌ చేసే అక్షరాల శబ్దం వినిపించేలా వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వీటిని అందిస్తారు. అలాగే, మూగ, చెవిటివారికి సెల్‌ఫోన్లు ఇవ్వనున్నారు. వీడియో కాలింగ్‌ ద్వారా సంజ్ఞలతో మాట్లాడుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. సమాజంలో మేమేమి తాక్కువ కాదు అని వీరు అనుకోకుండా, వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ, చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశం... Add new comment