బాబు అంటే భరోసా... బాబు అంటే నమ్మకం... బాబు అంటే బాధ్యత... ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్నదనే లక్ష్యంతో, బాలికా విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లాపరిషత, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మోడల్‌ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ‘బడికొస్తా’ పథకంతో సైకిళ్లు పంపిణీ చేస్తుంది.

ఈ పథకానికి రూ.75 కోట్ల వ్యయమవుతోందని 1,81,556 సైకిళ్లు అందజేయనున్నారు. డ్రాపవుట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.

నిజానికి, తొమ్మిదో తరగతిలోనే డ్రాపవుట్లు ఎక్కువ. కీలక అడుగు పడే సమయం ఇది. ఈ ఒక్క క్లాసు దాటేస్తే.. చదువులో ముందుకు వెళ్లిపోతారు. సరిగ్గా ఈ దశలోనే పిల్లల తల్లిదండ్రుల్లో ఊగిసలాట ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో ‘అడుగు ముందుకా- వెనక్కా’ అనేది తేలిపోయేది ఆ సమయంలోనే. ఈ విషయంలో ఆడపిల్లల పక్షా న నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ, మరోవైపు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్ర యాణం చేసేలా.. ఈ తరగతి బాలికల కోసం వినూత్న పథకం ప్రవేశపెట్టింది.

2017 ఆగష్టు నెల వరకు జిల్లాల వారిగా, సైకుళ్ళు తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళంలో 12,916 మందికి గాను, 7,228 మంది, విజయనగరంలో 9,874 మందికి గాను, 5,054, విశాఖలో 12,962 మందికి గాను, 12,159, తూర్పుగోదావరిలో 22,652 మందికి గాను, 21,300, పశ్చిమగోదావరిలో 16,841 మందికి గాను, 16,266, కృష్ణాలో 13,970 మందికి గాను, 13,569, గుంటూరులో 15,533 మందికి గాను, 15,507, ప్రకాశంలో 10,582 మందికి గాను, 6,100, నెల్లూరులో 9,674 మందికి గాను, 8,580, చిత్తూరులో 16,722 మందికి గాను, 16,722 (100 శాతం), కడపలో 9,257 మందికి గాను, 9,257(100 శాతం), కర్నూలులో 14,922 మందికి గాను, 14,111, అనంతపురంలో 15,581 మందికి గాను, 15,225 మంది బాలికులకు సైకుళ్ళ పంపిణీ జరిగింది.

సైకిళ్ళు అందుకున్న ఆ పిల్లల ఆనందం వారి మాటల్లోనే వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read