రాష్ట్రంలో బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోంది. బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా, ఉన్నత స్థాయికి ఎదిగేలా పధకాలు ప్రవేశపెట్టారు. అంతే కాదు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో, మంత్రివర్గంలో అత్యధికంగా 8 మంది బీసీలకు చోటు కల్పించారు చంద్రబాబు.

తమ పార్టీకి వెన్నుముక బీసీలు మాత్రమే అని చెప్పే చంద్రబాబు, అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని బడుగులు సైతం ఇతర సామాజికవర్గాలకు తీసిపోని విధంగా భవిష్యత్ ను నిర్మించుకునేందుకు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీఇంబర్స్మెంట్ పథకాలతో పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం బీసీ సామాజికవర్గాల నుంచి విదేశీ విద్య చదువుకునేందుకు కావాల్సి నిధులను సైతం అందిస్తోంది. బీసీ సంక్షేమం కోసం చంద్రబాబు అందిస్తున్న పథకాల వివరాలు ఇవి...

బీసీ సబ్ ప్లాన్:
దేశ చరిత్రలో తొలిసారిగా బిసిల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఇందుకు రూ. 10,000 కోట్లు కేటయించింది. గత ఏడాది కంటే ఇది 13.22% ఎక్కువ.

బీసీ ఫెడరేషన్ లోన్స్:
కుల వృత్తులవారికి, చేతివృత్తులవారికి బి.సి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఐదుగురు సభ్యులున్న బృందానికి రూ.10 లక్షల వంతున యూనిట్ స్థాపనకు ఇవ్వనున్నారు.

చంద్రన్న పెళ్లి కానుక:
బీసీల కోసం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించిన చంద్రబాబు, దీని ద్వారా బీసీ జంటలకు రూ.30 వేలు పెళ్లి ఖర్చుకు ఇవ్వాలని నిర్ణయించారు.

ఆదరణ పధకం:
బిసిల్లో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ కులవృత్తిని ప్రోత్సహించేందుకు ‘ఆదరణ’ పధకం. కులవృత్తుల చేతివృత్తి పనివారి ఆదాయాన్ని పెంచేలా పని ముట్లను కొనుగోలు చేసుకొనుటకు ఆదరణ పధకం క్రింద ఆర్థిక సహాయం.

బీసీ విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంట్:
10 లక్షల మంది బీసీ, ఈబీసీ విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌లు చెల్లించారు. 2017-18లో 8,80,000 మంది బిసి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటిదాకా (28.8.17 వరకు) 6,77,976 మంది విద్యార్ధులు నమోదు చేయించుకున్నారు.
బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ రూ.274.50 కోట్లు కేటాయించగా, రూ.137.25 కోట్లను రెండు విడతలుగా విడుదల చేశారు. మొత్తం 4,84,714 మంది బిసి విద్యార్ధులు లబ్ది పొందారు.
పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద 3,77,510 మంది విద్యార్ధులు లబ్ది పొందారు. ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ ‌మెంట్ కింద రూ.1042 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, రూ.521 కోట్లు విడుదల చేశారు.

ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం:
2016-17 బిసి ఉప ప్రణాళికలో 500 మంది బీసీ విద్యార్ధులకు ‘ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం’ అమలు. ఇందుకోసం రూ.69.11 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం క్రింద బీసీ విద్యార్ధులు విదేశీ విద్య అభ్యసించేందుకు ప్రతి విద్యార్థికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేస్తుంది ప్రభుత్వం

స్కిల్‌ డవలప్‌ మెంట్‌ :
విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం పై శిక్షణ ఉండాలని స్కిల్‌ డవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.

బీసీ భవన్‌:
ప్రతీ జిల్లాలో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో బీసీ భవన్‌ ఏర్పాటు

బీసీ గురుకుల పాఠశాలలు:
వెనుకబడిన గురుకుల పాఠశాలల్లో 16,000 మంది బిసి విద్యార్ధులకు విద్య

బీసీ సంక్షేమ పథకాలు:
బీసీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్.
బీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్
ఈబీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం
బీసీ వెల్ఫేర్ హాస్టళ్ళు
బిసి స్టడీ సర్కిళ్లు, బాలబాలికల హాస్టళ్ళు.
బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు
బీసీ గురుకుల పాఠశాలలు
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విద్యానిధి
హాస్టళ్లు, స్కూలు భవనాల నిర్మాణం
వెనుకబడిన తరగతులకు సామాజిక భవనాల నిర్మాణం
ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణాలు
బీసీ అభ్యుదయ యోజన
బిసి ఫెడరేషన్స్
దోభీ ఘాట్ల నిర్మాణం

Advertisements

Advertisements

Latest Articles

Most Read