పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్ర లోని దాదాపు 12 లక్షల మందికి పైగా ఉన్న దివ్యాంగుల సర్వతొముఖాభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి పథకాలను అమలుచేస్తోంది. సమాజంలో వెనుకబాటుతనం అనుభవిస్తున్న దివ్యాంగులు ఇతరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోంది.

దీనిలో భాగంగా కాళ్లు పూర్తిగా లేని, నడుం కింది భాగం నుంచి పూర్తిగా పనిచేయని వారికి తోడ్పాటును అందించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా మూడు చక్రాల బైక్, బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను అందించే భృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు తమ కనీస అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉచిత వాహనాల పంపిణీ చేపట్టింది.

దీనికోసం రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా దివ్యాంగుల కోసం అనే వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా అక్టోబరు 15వ తేదీ లోగా ఉచిత వాహనాలను పొందేందుకు అర్హులైన దివ్యాంగులు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా వాహనాల పంపిణీ పథకం అమలులో ఉన్నప్పటికీ కఠినమైన నిబంధనలతో పాటు కేవలం 50 శాతం సబ్సిడీ పై పీజీ విద్యార్హత కలిగిన వారికే వాహనాలను పంపిణీ చేయడం జరిగేది. ఈ విధంగా 2015-16 సంవత్సరంలో మోటరైజ్డ త్రీ వీల్స్ వెహికల్స్ 50 మందికి, 2016-17 సంవ త్సరంలో 47 మందికి అంద చెయ్యటం జరింగింది.

ఎలా అప్లై చేసుకువాలి ?

పదవ తరగతి పాసైతే చాలు.
గతంలో పీజీ చదుకున్నదివ్యాంగులకే మూడు చక్రాల బైక్ ను అందిస్తున్న ప్రభుత్వం మరింత మందికి లబ్దిని చేకూర్చే దిశగా తాజాగా విద్యార్హత నిబంధనలను సడలించింది. దీనితో రూ.75 వేల విలువ గలిగిన మూడు చక్రాల బైక్, లక్షరూపాయల విలువ గలిగిన బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారు సవరించిన నిబంధనల ప్రకారం 10వ తరగతి పాసైతే చాలు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండి కాళ్లలో 80 శాతం అంగవైకల్యం ఉందనే వైద్య ధృవీకరణ పత్రంతో పాటు పదవ తరగతి మార్కుల జాబితా, అంతకు మించి విద్యార్హతలు ఉంటే వాటి వివరాలు, ఆధార్, రేషన్ కార్డులు, కుల ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాలు, డైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నవారు ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక వెబ్ సైట్ (http://www.apdascac.ap.gov.in/) ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు ?

మూడు చక్రాల బైక్లను పొందాలనుకునే వారికి చేతులు ధృడంగా ఉండటంతో పాటు నడుము క్రింది భాగంలో 80 శాతం వైకల్యం ఉండాలి. కానీ వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారికి నడుము పై భాగంలో కూడా వైకల్యం ఉండాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తరువాత వచ్చిన ధరఖాస్తులను కులంకషంగా పరిశీలించి, అర్హులైన దివ్యాంగులను ఎంపికచేసి, వారిలో 2,450 మందికి మూడు చక్రాల బైక్లు, 175 మందికి వీల్ చైర్ వాహనాలను అందజేయనున్నారు. మొత్తం 2625 వాహనాల పంపిణీ కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.20.18 కోట్లు నిధులను కేటాయించింది...

అలాగే అంధులకు కూడా ప్రత్యేక ల్యాప్‌ట్యా్‌పలు, కంప్యూటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. కీబోర్డుపై చేతితో టైప్‌ చేసే అక్షరాల శబ్దం వినిపించేలా వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వీటిని అందిస్తారు. అలాగే, మూగ, చెవిటివారికి సెల్‌ఫోన్లు ఇవ్వనున్నారు. వీడియో కాలింగ్‌ ద్వారా సంజ్ఞలతో మాట్లాడుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.

సమాజంలో మేమేమి తాక్కువ కాదు అని వీరు అనుకోకుండా, వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ, చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read