అంబ పలుకు..ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ పలుకు అంటున్నారు తెలుగు ప్రజలు. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారు న్యూస్ పేపర్ చదవగలిగే వారు రాధాకృష్ణ పలుకు తప్పనిసరిగా చదువుతారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారం వారం తన పత్రికలోనూ, చానల్లోనూ వినిపించే కొత్త పలుకు ఇప్పుడు అత్యంత విశ్వసనీయమైనది నిలిచింది. ఆంధ్రజ్యోతి అంటే అక్కసు వెళ్లగక్కేవారు సైతం ఆర్కే కొత్త పలుకుకి అభిమానులైపోతున్నారు. ఆయన చెప్పినది ఏ ఒక్కటీ తప్పుకాలేదు. రాసిన ప్రతీది అక్షరసత్యమైంది. మే 7వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో అరబిందో శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చేందుకు జగన్ రెడ్డి ఒప్పుకున్నారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. సరిగ్గా నెలరోజులు తిరగకముందే అక్షరం పొల్లు పోకుండా ఏబీఎన్ ఆర్కే చెప్పినట్టే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోయారు. బాబాయ్ హత్యకేసులో అడ్డంగా సీబీఐకి బుక్కయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు తానూ ఈ కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలో చెప్పాలంటూ జగన్ రెడ్డి కేంద్రంలో పెద్ద తలకాయ కాళ్లపై పడ్డారని, మీరేమి చెప్పినా చేస్తానని తన తలని ఆ పెద్దకి అప్పగించేశారని సమాచారం. తన విధేయత, ఇప్పటివరకూ చేసిన సాయం గుర్తుంచుకుని సీబీఐ కేసునించి తమ్ముడిని, తనని బయటపడేస్తే చాలు విశ్వాసిగా పడి ఉంటానని సరెండర్ అయిపోయాడు జగన్. ఇదే విషయాన్ని ఆర్కే తన కొత్త పలుకులో రాశారు. ఆయన రాసి నెలరోజులు కాలేదు. సీబీఐ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా వెసులుబాట్లు ఇస్తూ, ముందస్తు బెయిల్ వచ్చేందుకు కావాల్సిన సమయం ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. అటు అవినాష్ రెడ్డికి రిలీఫ్ లభించగానే ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారుతున్నట్టు ప్రకటించారు. అటు అవినాష్ రెడ్డిని బయటపడేసేందుకు విజయసాయిరెడ్డి అల్లుడి అన్నని లిక్కర్ స్కాములో బలిపశువుని చేయడానికి అందరినీ ఒప్పించుకున్నారని ప్రచారం సాగుతోంది. తాను సేఫ్ అనీ, సాయిరెడ్డి ఆయన కుటుంబం ఆ లిక్కర్ కేసునించి బయటపడే దారి వారికి వారే చూసుకుంటారనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారని సమాచారం.
ఏబీఎన్ ఆర్కే కొత్త పలుకు మరోసారి నిజమైంది
Advertisements