రైతుకు వ్యవసాయం భారమై, ఖర్చులు ఎక్కువైపోయి, కూలీలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో, రైతుని ఆదుకునే మరో పధకానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంది.

సాగు ఖర్చు తగ్గించి, వ్యవసాయ యంత్ర పరికరాల ద్వారా రైతుని ఆదుకోనుంది. ఈ యంత్రాలు కొనాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే, ప్రభుత్వమే వాటిని కొని, రైతుకి యంత్రాలు అద్దెకు ఇచ్చే కార్యక్రమం, అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రైవేటు వ్యక్తుల కంటే, 50శాతం వరకూ తక్కువ అద్దె చెల్లించి దుక్కులు, వరినాట్లు, వరికోత, నూర్పుడి యంత్రాలు, తదితరాలతో పనులు చేయించుకోవచ్చు.

ఫోన్‌ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు యంత్రాలు వస్తాయి. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచే కొన్ని మండలాల్లో ఈ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో కేంద్రంలో రూ.కోటి వ్యయంతో కూడిన పరికరాలు సమకూరుస్తారు. ఇందులో 50శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది.

ఏ పనికి ఎంత వసూలు చేయాలనే విషయాన్ని జిల్లా కలెక్టర్‌, వ్యవసాయ సంయుక్త సంచాలకులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది. రోటోవేటర్‌కు(నేలను దున్నేందుకు) మార్కెట్‌ ధర ఎకరానికి రూ.1,400 ఉంటే ఇందులో రూ.800 నిర్ణయించారు. వరికోతకు రూ.1,900, వరినాట్లకు రూ.2,750 చొప్పున వసూలు చేసే విధంగా అధికారులు జాబితా తయారు చేశారు. ఇలా ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీ నిర్ణయించిన ధరలే అమలవుతాయి. తక్కువ ధరకు యంత్రాలను అందుబాటులో ఉంచడమే కాకుండా అక్కడ ఇప్పటిదాకా లభించని యంత్రాలను కూడా అందుబాటులో ఉంచేలా కేంద్రాలను ఏర్పాటు చెయ్యనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read