జాతీయ జెండా స్ఫూర్తితో దేశం అభివృద్ధి కోసం అందరూ సంఘటితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి పర్యటనలో భాగంగా, రేణిగుంట విమానాశ్రయంలో 15 లక్షలతో, 100 అడుగుల ఎత్తు, 20x30 అడుగులతో తయారు చేసిన భారీ జాతీయ పతాకాన్ని, రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జాతీయ జెండాను రూపొందించింది మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య అని గుర్తుచేశారు. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటుచేసిన ఎయిర్పోర్ట్ సిబ్బందిని అభి నందించారు. రేణిగుంటలో భారీ జాతీయ పతకాలు ఉండటంతో శ్రీవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు భారీ జాతీయ పతాకం చూడటంతో దేశభక్తి స్పూర్తి కలుగుతుందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read