తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా, మీడియా పై ట్వీట్లు చేస్తూ, కొన్ని మీడియా చానల్స్ ని బ్యాన్ చెయ్యాలని చెప్పిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో, కొన్ని మీడియా చానల్స్ పై మరీ పర్సనల్ గా వెళ్ళిపోయాడు పవన్... శ్రీ రెడ్డి, పవన్ తల్లిని తిడుతూ చెప్పిన వీడియో, ఏ మీడియా ఛానల్ కూడా డైరెక్ట్ గా వెయ్యలేదు... ఆ పదాన్ని బీప్ చేసి వేసాయి... కాని పవన్ మాత్రం, ఒక ఛానల్ వీడియో పోస్ట్ చేసి, ఆ పదం బీప్ లేకుండా ఉన్న వీడియో ఒక పోస్ట్ చేసారు... అయితే, ఈ విషయం పై ఆ ఛానల్ వెరిఫై చేసుకోగా, వారి వీడియోస్ లో, ఆ పదం బీప్ చేసిన తరువాతే ప్రసారం చేసినట్టు తేలింది... దీంతో పవన్, ఆ వీడియోని ట్యాంపరింగ్ / ఆడియో మార్ఫింగ్ చేసి తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది...

pawan kalyan 26042018 2

మూడు రోజుల క్రితమే ఈ విషయం పై, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... ఇదే విషయం పై, జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ఏకం అయ్యాయి... కుట్రతోనే, పవన్ ఇలా చేస్తున్నారని నిర్ధారణకు వచ్చాయి... జర్నలిస్ట్ సంఘాలు అందరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు... కేసు నమోదు చెయ్యాలని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు... ఈ విషయం పై పోలీసులు ప్రాధమిక విచారణ చేసారు... ప్రాధమిక విచారణలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ వచ్చారు... దీంతో, పవన్‌పై ఐపీసీ 469, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు...

pawan kalyan 26042018 3

ఇప్పుడు పోలీసులు మరింత లోతుగా విచారణ చెయ్యనున్నారు... ఈ విచారణలో పవన్, ఇలా ఎందుకు చేసారు, దీని వెనుక కుట్ర ఎమన్నా ఉందా ? పవన్ ఒక్కడే ఈ కుట్రలో ఉన్నాడా ? అనేది పోలీసుల విచారణలో తెలుస్తుంది... అయితే, ఈ సెక్షన్ల్ కింద పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ అయితే మాత్రం, గరిష్టంగా ఏడేళ్లు, కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్షతో పాటు జరిమానా దీనికి అదనం... మరి పోలీసులు ఈ విచారణ ఎటు వైపు తీసుకువెళ్తారు ? లేక పవన్, మీడియా కంప్రోమైజ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది... మరో పక్క ఈ కేసు తెలంగాణాలో రిజిస్టర్ అయ్యింది కాబట్టి సరిపోయింది కాని, ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయ్యి ఉంటే, ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఎంత గోల చేసే వాడో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read