సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి వైనాట్ 175 స్లోగన్ అందుకున్న నుంచీ వైసీపీ తిరోగ‌మ‌నం మ‌రింత స్పీడు అందుకుంది. కుప్పం కొడ‌తామంటూ వైసీపీ ప్ర‌గ‌ల్భాలుగా మిగిలిపోయేలా ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. స‌మ‌యం-సంద‌ర్భం చిక్క‌డంతో నీ పులివెందుల నిల‌బెట్టుకో ద‌మ్ముంటే అంటూ టిడిపి అధినేత ప్ర‌తీ స‌మావేశంలోనూ స‌వాల్ విసురుతున్నారు. చాలెంజ్ చేస్తున్న‌ట్టే..కార్యాచ‌ర‌ణ కూడా మొద‌లు పెట్టేశారు. పులివెందుల నుంచి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ ర‌విని గెలిపించుకున్న టిడిపి, తాజాగా ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి కూడా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని నిల‌బెట్టి తిరుగులేని విజ‌యం సాధించగ‌లిగారు. అనంత‌రం క‌డ‌ప జిల్లాలో యువ‌నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి క‌నివినీ ఎరుగ‌ని జ‌న ప్ర‌భంజ‌నం పోటెత్తింది. ప‌రిస్థితుల‌న్నీ అనుకూలిస్తున్న త‌రుణంలో వైసీపీ కుప్పం వైపు రావ‌డం కాదు..టిడిపియే పులివెందుల కుంభ‌స్థ‌లాన్ని కొట్టాల‌ని చూస్తోంది. ఇదే స‌మ‌యంలో  కుప్పంలో తిరుగులేని మెజారిటీ సాధించి తెలుగుదేశం కుటుంబం కుప్పం అని నిరూపించాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేశారు. ఇక తానే నేరుగా క్షేత్ర‌స్థాయిలోకి దిగారు చంద్ర‌బాబు.  కుప్పంలో "లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం" పేరిట క్యాంపెయిన్‍కు శ్రీకారం చుట్టారు. కుప్పం టిడిపికి మ‌రింత బ‌లం చేకూర్చేందుకు త‌ట‌స్తులు, ఇత‌ర పార్టీల నేత‌ల‌ని కూడా చేర్చుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు టిడిపిలో చేరారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపికి ఉన్న యంత్రాంగానికి అద‌నంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ ని దింపారు. నిమ్మ‌ల రామానాయుడు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల ప‌ర్య‌వేక్ష‌ణ బృందంలో ఉన్నారు. మొత్తానికి చంద్ర‌బాబు కుప్పంలో తాను ల‌క్ష ఓట్ల మెజారిటీ సాధించ‌డంతోపాటు పులివెందుల వైసీపీ కంచుకోట‌కి బీట‌లు పెట్టాల‌నే భారీ వ్యూహాన్ని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అమ‌లు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

Advertisements