చంద్రబాబు తన స్టైల్ మార్చేశారు. పంచ్‌కి పంచ్. యాక్షన్‌కి రియాక్షన్. కౌంటర్ వేస్తే ఎన్ కౌంటర్ ఇదే స్టైల్ ఫాలో అవుతూ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. టిడిపి సోషల్ మీడియా సైన్యంలో ఉత్సాహం నింపుతున్నారు. చంద్రబాబు ప్రెస్మీట్ మాట్లాడితే గణాంకాలు, తన హయాంలో సాధించిన నిధులు, తెచ్చిన ప్రాజెక్టులు, ఇప్పుడు వెళ్లిపోయిన ప్రాజెక్టులు ఇలా పద్ధతిగా చెప్పుకుంటూ పోతారు. ఇవి ప్రధాన మీడియాలో వార్తలుగా పనికొస్తాయి. సోషల్మీడియాలో ఉండాల్సిన విరుపు-మెరుపు బాబు స్పీచుల్లో దొరికేవి కావు. సంప్రదాయబద్ధమైన శైలి భాష, భావం వల్ల సోషల్ మీడియాలో సీబీఎన్ డైలాగ్స్ పెద్దగా వైరల్ కావు. ఇటీవల ట్రెండ్ మార్చిన బాబు సెటైర్లు, పంచ్ డైలాగులతో చెలరేగిపోతున్నారు. టిడిపి సోషల్ మీడియాకి మంచి కంటెంట్ అందిస్తున్నారు. సీబీఎన్ స్పీడు చూస్తే సోషల్మీడియాలో ట్రోలర్స్ కంటే దారుణంగా జగన్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్నారు. టిడిపి మేనిఫెస్టో గురించి జగన్ మాట్లాడిన దానిపై స్పందిస్తూ.. జగన్ ప్రపంచ మేధావి అనీ, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీలో చదివాడు, కానీ ఆ వర్సిటీ ఎక్కడో చెప్పలేడంటూ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. జగన్ గొప్ప సంఘ సంస్కర్త అనీ, జగన్ సంఘ సంస్కరణ ఏంటో తెలుసా బాబాయ్‌ని గొడ్డలితో లేపేయడం అని బాబు వేసిన చురకలు సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ష్ అయి తెగ తిరుగుతున్నాయి. 2 వేల నోటు రద్దు ఐడియా తనకు రానిది, చంద్రబాబుకి ఎలా వచ్చిందని జగన్ అంటున్నాడని..ఆయనకి 2 వేల రద్దు చేయాలనే ఐడియా రాదు కానీ, 2 వేల దొంగ నోట్లు ప్రింట్ చేయడం వచ్చని ఒక రేంజులో ఎద్దేవ చేశారు. టిడిపి మేనిఫెస్టోని జగన్ పులిహోర, బిస్బిల్లా బాత్ అంటూ వెటకారం చేశారని..పులిహోర రుచి, బిసిబిల్లా బాత్ పోషకాలుంటాయని..అంటే జగన్ టిడిపి మేనిఫెస్టో బాగుందని అంటున్నారని చెణుకులు విసిరారు చంద్రబాబు. ప్రసంగం మొత్తం జగన్ రెడ్డిపై వ్యంగ్యబాణాలు సంధించేందుకు చక్కగా వాడుకుని బాబు ట్రోలర్లు కంటే ఎక్కువగా జగన్ ని ర్యాగింగ్ చేశారు.
సోషల్ మీడియా ట్రోలర్స్ కంటే దారుణం సీబీఎన్ ర్యాగింగ్
Advertisements