సత్-ప్రవర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పిన మహి తోక్తులు సదా అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేశ, విదేశాల్లో ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం దివ్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభసమయం అని మహ్మదీయుల విశ్వాసమన్నారు. ఉపవాస దీక్షలు, దైవారాధన, దాన ధర్మాలు, చెడును త్యజించడం, విశ్వమానవాళికి సేవ ఖురాన్ బోధనల్లో ముఖ్యమైనవని చెప్పారు.

పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా చేసుకోవాలన్న ఆకాంక్షతో తమ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రన్న రంజాన్ తోఫాను 11.3 లక్షల కుటుంబాలకు అందించిందని తెలిపారు. చంద్రన్న రంజాన్ తోఫా కోసం ప్రభుత్వం రూ. 65.36 కోట్ల విడుదల చేసిందన్నారు.

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి 2017-18 బడ్జెట్లో రూ. 840.25 కోట్ల కేటాయించిందని చంద్రబాబు గుర్తు చేశారు. పేదరికంలో మగ్గుతున్న 5000 మసీదులలోని ఇమామ్లకు, మౌజన్లను పారితోషికం కింద గత ఏడాది రూ.24 కోట్ల కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్లో రూ.32 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

పేద ముస్లిం వధువుల కోసం దుల్షన్ పథకం కింద గత ఏడాది రూ.49.11 కోట్ల కేటాయిస్తే 9,822 మంది లబ్దిపొందారని, ఈ ఏడాది రూ. 60 కోట్ల కేటాయించామని, 12,000 మంది ముస్లిం వధువులు లబ్దిపొందుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

అలాగే 2016-17లో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 203.45 కోట్ల, మెయింటెనెన్స్ ఫీజు కింద రూ. 44.69 కోట్ల ఇచ్చామని 1,08,322 మంది విద్యార్థులు లబ్ది పొందారని తెలిపారు. 2017-18లో ఫీజు రీయింబర్స్మెంట్ కు రూ. రూ.225.00 కోట్ల, మెయింటెన్స్ ఫీజు కింద రూ. 60 కోట్ల కేటాయించినట్లు చంద్రబాబు వివరించారు. 2016-17లో 57 మసీదులకు 6.99 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని 300 మంది ముస్లిం విద్యార్థులకు వర్తింపజేసినట్లు, మైనారిటీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవటానికి ఒక్కొక్క విద్యార్ధికి రూ. 10 లక్షల సహాయం అందిసున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

కడప లో హజ్ హౌస్ నిర్మాణానికి 12 కోట్ల, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి రూ 11 కోట్ల కేటాయించామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read