పట్టిసీమ... ఇప్పుడు కృష్ణా డెల్టా రైతులకి, ఈ పదం ఒక ఎమోషన్... కొంత మందికి ఈ పదం వింటే "మోషన్స్", ఇంత మంచి టాపిక్ లో, వీళ్ళు ఇప్పుడు అప్రస్తుతం... వీళ్ళు ఎప్పటికీ మారారు... ఇగ్నోర్ చేద్దాం...

విషయంలోకి వస్తే, కొన్నేళ్ల తర్వాత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి వాతావరణం సానుకూలంగా కనిపిస్తుంది. సకాలంలో వర్షాలు కురవటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లలో 500 గ్రామాలకు మంచినీటి అవసరాలు నిమిత్తం, ప్రకాశం బ్యారేజీలో నిలువ నీటిని కాలువలకు వదలాల్సి రావటంతో ఏడాది పొడవునా 12 అడుగుల స్థాయిలో ఉండాల్సిన నీటిమట్టం ప్రస్తుతం 9 అడుగులకు చేరింది.

మరోవైపు పులిచింతల నుంచి దిగువకు చుక్క నీరు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో కొద్దిపాటి వర్షాన్ని నమ్మకుని వరి సాగుకు వెళ్లాలా వద్దా అన్న మీమాంసలో డెల్లా రైతాంగం ఉండగా, వారి ఆశలు చిగురించేలా గోదావరి జలాలు పట్టిసీమ కాలువ ద్వారా కృష్ణా జిల్లాలో ప్రవేశించాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈనెల 12వ తేదీన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద 9 మోటార్లను ఆన్ చేసి ఐదువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఆ నీరు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.
దీంతో 12 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన కృష్ణా డెల్లాకు చెందిన రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ నీరు మాకు బంగారంతో సమానం అంటూ, రైతన్నలు ఉత్సాహంతో ఉన్నారు.

పట్టిసీమ ద్వారా 2015లో ఎనిమిది టిఎంసిలు, 2016లో 60 టిఎంసిల నీరిచ్చి కృష్ణా డెల్లాలోని పంటలను ప్రభుత్వం కాపాడింది. ఈ సంవత్సరం, 100 టిఎంసిల నీరిచ్చేదుకు లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా డెల్టానే కాదు, శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు రావాల్సిన నీటిని, రాయలసీమకు మళ్ళించి, హంద్రీ నీవా ద్వారా, రాయలసీమను రత్నాలు సీమగా మారుస్తున్నారు.

3 సంవత్సరాల నుంచి పట్టిసీమ ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా, కొంత మంది, ఇప్పటికీ పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారు అంటే, ఇక వాళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read