చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో, ‘హీరో’ మోటార్స్‌ తన ప్లాంట్ పెడుతున్న సంగతి తెలిసిందే... అయితే, చాలా కారణాల వలన, ప్లాంట్ భూమి పూజు కూడా ఇప్పటివరకు చేసుకోలేదు... దీంతో ఈ ప్లాంట్ మన దగ్గర మొదలవుతుందా లేదా అన్న అనుమనాలు వచ్చాయి... ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించటంతో, ‘హీరో మోటార్‌ కార్ప్‌’ రంగలోకి దిగింది... పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి, శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్‌ ఎప్పటికప్పుడు హీరో ప్రతినిధులతో చర్చిస్తూనే ఉన్నారు. శుక్రవారం మరో దఫా సంప్రదింపులు జరిపిన మంత్రి... మున్ముందు మంచి రోజులు లేనందున తక్షణమే భూమిపూజ చేయాలని సూచించారు. ఈ సూచన మేరకు హీరో సంస్థ శనివారం భూమి పూజ చేసింది....

hero 2612017 2

సత్యవేడు మండలం శ్రీసిటీకి సమీపంలోని మాదన్నపాలెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్‌ తదితర కార్యక్రమాలు ముగించుకున్న ఆ సంస్థ జులైలో ఈ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేసుకున్నా, వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు కుదరలేదు. ఇప్పటికే రాష్ట్రంలో కియా లాంటి భారీ ఆటోమొబైల్‌ పరిశ్రమ అడుగు పెట్టడం, ఇప్పుడు హీరో సంస్థ కూడా శంకుస్థాపనకు చేసుకోవటంతో రాష్ట్ర ఆటోమొబైల్‌ రంగానికి ఇదో మంచి పరిణామంగా పరిశ్రమలశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

hero 2612017 3

హీరో మోటార్స్‌ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2018 చివర నాటికి సంవత్సరానికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం గల ప్లాంటును నిర్మిస్తారు. 2020నాటికి రెండో ప్లాంటును నిర్మిస్తారు. రెండు దశల్లో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడి పెడతారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారవుతాయి. 2025కల్లా ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అభివృద్ధి చేస్తారు. విడిభాగాల తయారీ యూనిట్‌ రూ.1600 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ఆ సంస్థకు ఎనిమిదోది కానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read