ఆళ్ళ రామకృష్ణా రెడ్డి.. మంగళగిరి వైసిపి శాసన సభ్యుడు... ఈయనకు సొంత నియోజకవర్గానికి పని చెయ్యటం కంటే, అమరావతిని అడ్డుకోవటం, చంద్రబాబు మీద బురదజల్లే కార్యక్రమాలు అంటే మహా ఇంట్రెస్ట్... సదావర్తి భూముల విషయంలో విషయంలో అన్యాయం జరిగిపోయింది అని కోర్ట్ కి వెళ్లారు... .వేలకోట్లు అవినీతి జరిగిందని వారు గగ్గోలు పెడుతున్న కేసులో, రూ 5కోట్లు మాత్రమే ఎక్కువ ఇచ్చి భూములను సొంతం చేసుకోమని అక్టోబర్ 18న కోర్ట్ వారంటే ఇంతవరకు అడ్రస్ లేడు ఈయన... తాజగా కోర్ట్ మరో సారి, ఈ ప్రతిపాదనను ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ముందుంచి మరో సారి అడగింది.

విషయంలోకి వెళ్తే, తమిళనాడులో ఉన్న సదావర్తి సత్రం భూముల్లో రూ. వందల కోట్ల విలువ చేసే సదావర్తి సత్రం భూములను ఏపీ ప్రభుత్వం నామ మాత్రపు ధరకే కావాల్సిన వారికి కట్టబెట్టిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది..

83.11 ఎకరాలకు, రూ. 1080.43 కోట్లు విలువ ఉంటే, రూ. 22.44 కోట్లకు అస్మదీయులకు కట్టబెట్టేసింది అని, ఆళ్ళ ఆరోపిస్తున్నారు. దీనికి హై కోర్ట్, ఆళ్ళకి మంచి ఆఫర్ ఇచ్చింది. వెయ్యి కోట్లు అంటున్నారు కదా, ప్రభుత్వం అమ్మిన 22.44 కోట్లకు, మరో 5 కోట్లు ఎక్కువ కట్టి మీరు తీసుకుంటారా ? లేక మీరు ఎవరినైనా తీసుకువస్తారా అని కోర్ట్ ప్రతిపాదించింది. అదనంగా 5 కోట్లు చెల్లించడానికి సిద్ధపడితే...ఆ భూములు పిటిషనర్‌కే విక్రయించాలని ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది.

ఈ ప్రతిపాదనతో ఆళ్ళ షాక్ తిన్నారు... ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే, నా మెడకు చుట్టుకుంది అనుకుని, ప్రతిపాదనపై వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని ఆళ్ళ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోరడంతో విచారణను జులై 3కు వాయిదా వేసింది.

వేలంలో విజేతగా నిలిచినవారు.. తమను ప్రతివాదిగా చేర్చుకొని తమ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని ప్రధాన వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్‌ వేశారు. తాము రూ.22.44 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) రమేశ్‌ వాదనలు వినిపిస్తూ ఆ భూములు ఆక్రమణలో ఉన్నాయని, వాటిని యథాతథంగా వేలం వేశామని చెప్పారు. వాటిపై పలు కేసులు కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్నాయన్నారు.

ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..వేలంలో భూములకు పలికిన ధర కంటే అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే ఆ భూములు మీకే ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై స్పందించాలని గతేడాది పదోనెల 18వ తేదీనే ఉత్తర్వులు జారీచేశామని పిటిషనర్‌కు గుర్తుచేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read