ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత రెండు నెలలుగా ఎలా ఆందోళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... ఇటు రాజకీయంగా, మోడీ చేస్తున్న అన్యాయం దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో, చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపు వచ్చింది.... అన్ని విపక్షాలను, ఈ విషయంలో చంద్రబాబు ఏకం చేసి, ఢిల్లీని ఇబ్బంది పెడుతున్నారు... అదే సందర్భంలో, బీజేపీ, ఇక్కడ కొంత మందిని అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ, కేసులు పెడతాం అంటూ భయపెడుతున్నా, చంద్రబాబు మాత్రం, ఈ కుట్రలని ఎదుర్కుని ఢిల్లీ పై యుద్ధం చేస్తున్నారు.. ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన సినీనటుడు, మాజీ కాంగ్రెస్ ఎంపీ, ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి మాత్రం, అసలు ఇక్కడ జరుగుతుంది ఏమి పట్టనట్టు, తన పని తాను చేసుకుపోతున్నారు.

అవిశ్వాసం పెట్టిన వేళ, నెల రోజులు రాజ్యసభకు సెలవలు కావలి అంటూ, చిరంజీవి రాజ్యసభ చైర్మన్ ను కోరారు. ఆ మరుసటి రోజే, సినిమా ఫంక్షన్ లో ప్రత్యేక్షం అయ్యారు... గత కొన్ని రోజులుగా, తన తమ్ముడి కోసం, ఆయనకు రాజకీయంగా లబ్ది చేకూరటం కోసం సినీ ఇండస్ట్రీని ఏకం చేసి, మీడియాను బ్యాన్ చేసే పనిలో ఉన్నారు... రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైములో, ఒక్క రోజు కూడా ప్రత్యెక హోదా కోసం, ఒక్కటంటే ఒక్క పని కూడా చెయ్యని చిరంజీవి, తన సొంత పనులు మాత్రం చేసుకుంటూ, తనని ఇంత వాడిని చేసిన రాష్ట్రం కష్టాల్లో ఉంటే మాత్రం, ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.. ఇప్పుడు అమెరికా పర్యటనకు బయలుదేరాడు.. ఈ శనివారంనాడు, ఏప్రిల్ 28 వ తేదీన డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను మాజీ కేంద్రమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవిగారు, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలుసుకుని, డల్లాస్ ప్రవాసాంధ్రులు ఒకింత ఆశ్చర్యపోయారు.. మరో పక్క, ఇదే వేదికలో, నిధుల సేకరణ కార్యక్రమం కూడా జరగనుంది.

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా, నిధుల కేటాయింపు, విభజన చట్టం హామీల అంశాల్లో కేంద్రప్రభుత్వం చేతిలో వంచనకు గురైనా, చిరంజీవిగారు మరియు ఇతర సినిమాతారలెవరూ ఆంధ్రుల నిరసనకు మద్దతు తెలిపుతూ కనీస సంఘీభావ ప్రకటన కూడా చేయలేదనే కోపంతో, డల్లాస్ ప్రవాసాంధ్రులు, ఈ కార్యక్రమంలో నిరసన తెలిపి, చిరంజీవికి తన కర్తవ్యం గుర్తు చెయ్యనున్నారు... ఒక ప్రవాసాంధ్రుడు మాట్లాడుతూ "వేలమైళ్ళ దూరంలో ఉండి కూడా మేము, జన్మభూమి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాము. మన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయంపట్ల బాధ పడుతున్నాము. ఇలాంటి సమయంలో టికెట్లకు భారీ ధరలు పెట్టి, తమకు బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి మా కష్టార్జితాన్ని కొల్లగొట్టడానికి చిరంజీవిగారు, ఇతర సినిమాతారలు ఈ ఉత్సవాలను జరపడం ఎంతవరకు సబబు ? ఇది ఖచ్చితంగా ప్రత్యేకహోదా కోసం తపన పడుతున్న రాష్ట్రప్రజలను, ప్రవాసాంధ్రుల ఆత్మగౌరవాన్ని అవహేళన చేయడమే కదా ?" అంటూ తమ ఆవేదన తెలిపారు.

చిరంజీవి, ఇతర సినిమా వాళ్ళు డల్లాస్ లో జరిపే మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను బహిష్కరిస్తున్నామని, ఇప్పటికే టికెట్లు కొన్నవాళ్ళు, అదే ప్రాంగణంలో, వేదిక వద్ద నల్లరిబ్బన్లు ధరించి, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి, మా బాధ చిరంజీవికి అర్ధం అయ్యే విధంగా నిరసనలు తెలుపుతామని ప్రవాసాంధ్రులు పిలుపు ఇచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. మన జన్మభూమిని అవమానించే విధంగా మన ఆంధ్రులే కృతఘ్నతతో వ్యవహరిస్తే ఊరుకోబోమని, మా నిరసన చూసైనా, చిరంజీవి గారు, ఇతర సినిమా తారలు మద్దతు పలుకుతారేమో చూస్తామని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read