దేశంలోనే మొదటిసారిగా, "సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ " నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. విజయవాడ వేదికగా రెండు రోజులు కార్యక్రమం జరగింది. గూగుల్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియా, యూట్యూబ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నాయి. నిన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో, ఇవాళ సిద్ధర్దా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది... ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇండియా హెడ్ సత్య రాఘవన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరుపున మంత్రి అఖిల ప్రియ హాజరయ్యారు..

social media events 19112017 2

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే, హీరో రానా దగ్గుబాటి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తదితరులుకు అవార్డు లు లభించాయి...సోషల్ మీడియాలో వివిధ దశల్లో సమాజానికి ఉపయోగపడే పలు అంశాలపై స్పందించిన వారికి కూడా అవార్డులు దక్కాయి... అలాగే దాదాపు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం దాదాపు 30 అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది.. నిన్న జరిగిన చర్చల్లో, సోషల్ మీడియా పాత్ర, సామాజికంగా ప్రజలు సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం పై పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, విబ్రూ మీడియా సిఈవో అశోక్ విద్యాసాగర్, యూట్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్య ప్రతినిధి సత్య రాఘవన్, ఫేస్‌బుక్ మీడియా రీజనల్ పార్టనర్ ప్రతినిధి అంకూర్ మెహతా, ట్విటర్ ఆసియా ఫసిఫిక్ క్రీడా భాగస్వామి ప్రతినిధి అనీష్ మధాని వారి అభిప్రాయాలు చెప్పారు..

social media events 19112017 3

ఈ అవార్డులు వెనుక ప్రధాన ఉద్దేశం, అమరావతికి మరింత ప్రచారం కల్పించటం, ఆంధ్రప్రదేశ్ లో టూరిజంను ప్రోత్సహించడం - స్టార్ల సందడితో సినీ పరిశ్రమ చూపును నవ్యాంధ్రప్రదేశ్ వైపు పడేలా చేయడం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి ఎందరో టాలీవుడ్ - కోలివుడ్ - బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానుండటంతో, నేషనల్ మీడియా ఫోకస్ కూడా అమరావతి మీద ఉంటుంది అని, తద్వారా అమరావతికి మరింత బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని, మన అమరావతి గురించి అందరూ మాట్లాడుకుంటారని ప్రభుత్వం ఉద్దేశం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read