చిన్న తిరుపతి అనగానే తెలుగువాళ్లందరికీ పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలే గుర్తుకొస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు 41 కి.మి . దూరం లో శ్రీలక్ష్మీనివాసుడైన వేంకటేశ్వరుడు స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల . ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

ద్వారక మహర్షి తపస్సు ఫలితంగా ఆవిర్భవించిన విగ్రహమూ, తిరుమల నుంచి తెచ్చిన విగ్రహమూ ఉండడం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకాతిరుమలగా ప్రసిద్ధి చెందింది. స్థానికులు ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అనీ పిలుస్తారు. ఏ కారణం వల్లైనా తిరుపతి వెళ్లలేని స్థానిక భక్తులు అక్కడి స్వామివారికి మొక్కుకున్న మొక్కుబడులనూ కానుకల్నీ ఇక్కడి స్వామికి సమర్పించడం కూడా అనాదిగా వస్తోంది.

దక్షిణ ముఖంగా స్వామి వారు
దేవాలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తూర్పు ముఖంగా లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ స్వామి వారు దక్షిణ ముఖంగా ఉండడం ద్వారకా తిరుమల ఆలయానికున్న మరో ప్రత్యేకత.

సామాన్యంగా దేవాలయాల్లో నిత్యం అభిషేకం చేస్తారు. కానీ ద్వారకాతిరుమల క్షేత్రంలో మూల విరాట్టులకు ఎప్పుడూ అభిషేకం చేయరు. ‘స్వామివారి విగ్రహం కింద ద్వారక మహర్షి తపస్సు చేసిన పుట్ట ఇప్పటికీ ఉందట. అందుకే, అనుకోకుండా విగ్రహం దగ్గర నీటి చుక్క పడితే స్థానికంగా కొణుజులు అని పిలిచే తేనె రంగు చీమలు విపరీతంగా బయటకు వచ్చేస్తాయి. ఈ కారణంతోనే ఇక్కడి స్వామివారికి అభిషేకం నిషేధించారు.

ప్రస్తుతం ఉన్న ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలన్నీ నూజివీడు జమీందారు ధర్మాప్పారావు కట్టించారు. ఆయనే ఆలయ విమానం, గోపురాలు, ప్రాకారాలు, మండపాలు పునఃనిర్మాణం చేసినట్లుగా చెబుతారు.

ద్వారకా తిరుమల డ్రోన్ వ్యూ, ఈ క్రింది వీడియోలో చూడండి ఎంత బాగుందో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read