నగరానికి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా పేరొందిన బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ రహదారి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్, నేషనల్ హైవే ఆధారిటీ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖలకు చెందిన అదికారులు నూతనంగా ఆంక్షలను విధించారు.

దీంతో సర్కిల్ వద్ద కొత్త రూప సంతరించుకుంది. ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా తొలుత బెంజిసర్కిల్ నుంచి ఎస్వీఎస్ కళ్యాణ మండపం వరకు ఉన్న గ్రీనరీ ప్రాంతంలో పిల్లర్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు.

జాతీయ రహదారి - అవతలి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుంచి సితార టవర్స్ సమీపంలోని టీ క్యాంటీన్ మధ్యలో ఉన్న గ్రీనరీలో పనులు జరుగుతుండటంతో రెండు రహదారుల మధ్యలో దాదాపు 15 అడుగుల ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.

వేదిక కళ్యాణ మండపం ఎదురుగా జాతీయ రహదారి పక్కన గతంలో ఉన్న బస్ షెల్లర్ను కూల్చివేశారు. నిత్యం రాత్రి వేళలో ఏర్పాటు చేసే ఫుడ్ కోర్ట్ ను తొలగించారు. టీ కాంటీన్ ఎదురుగా సర్వీసు రోడ్డులో ఉండే డంపర్ బిన్లను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఆంజనేయ స్వామి గుడి సమీపంలో సితార టవర్స్ ఎదురుగా నూతనంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ మళ్లింపు
ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంజిసర్కిల్ వచ్చే క్రమంలో, వారది, బస్ స్టాండ్ కు వెళ్ళే వాహనాల కొరకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాన్ని ఆంజనేయస్వామి గుడి వెనుక నుంచి వేదిక కళ్యాణ మండపం మీదుగా సర్వీసు రోడు వైపు మళ్లించారు.

ఈ వాహనాలు సితార టవర్స్ సమీపంలో ఉన్న టీ క్యాంటిన్ ఎదురుగా ఉన్న గ్రీనరీ మధ్యలో నుంచి జాతీయ రహదారిలోకి వెళ్ళే విధంగా నూతనంగా మార్గాన్ని ఏర్పాటు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read