andhra development 23102016

ఎక్కడ నుంచి వస్తార్రా ఒక్కఒక్కడు.... మన రాష్ట్రం బాగుపడుతుంది అంటే ఏడుపు... అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే ఏడుపు.... పలానా జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే సన్నాయినొక్కులు... పలానా ప్రాజెక్ట్ వస్తుంది అంటే నిట్టూర్పులు... పలానా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది అంటే ఎగతాళి... ఇవన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అంటే అర్ధం ఉంది... కాని ఒక వర్గం ప్రజలు అలా ఆలోచిస్తున్నారు అంటే ? మీకు రాష్ట్రం ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి... వెనకటకి ఎవడో, చెరువు మీద అలిగి, ఎదో చెయ్యలేదు అంట... ప్రభుత్వం సక్రమంగా చేసే ప్రతి పనిని ఎగతాళి చేస్తే, నీ రాష్ట్రాన్ని, నీ ప్రాంతాన్ని, నీ జిల్లాని, నీ ఊరిని, నువ్వే ఎగతాళి చేస్తున్నట్టు, అనే చిన్న లాజిక్ మర్చిపోతున్నాం....

ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సింది, ఆంధ్రవాడికి జరిగింది అన్యాయం కాదు, అవమానం... ఆ గాయాలు నుంచి, ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాం... ఉన్మాదుల లాగా, మానుతున్న గాయాన్ని, మళ్లీ పెద్దది చెయ్యకండి.... తగిలన చోట, మళ్ళి కొడితే, చిన్న దెబ్బ అయినా, తట్టుకోలేని నొప్పి ఉంటుంది... మీరు ఉండేది ఆంధ్రప్రదేశ్ లో, అది గుర్తుపెట్టుకోండి... మనకు కావాల్సింది కాన్ఫిడెన్సు... మనకు ఉండే అవకాశాలు, వచ్చే ప్రాజెక్ట్లు, చెయ్యబోయే అభివృద్ధి పెద్దదిగా చెప్పుకుని, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి... ఆంధ్రవాడిని చిన్న చూపు చుసిన ఈ దేశానికీ మన దమ్ము ఏంటో చూపించాలి... మీరు మా మీద విసిరిన రాళ్ళతో, అందమైన ఇల్లు కట్టుకున్నాం అని అన్యాయం చేసిన ఢిల్లీ పెద్దలకి చాటి చెప్పాలి.... మీరు సృష్టించిన సంక్షోబాన్ని, మేము అవకాశంగా తీసుకున్నాం చుడండిరా అని రొమ్ము ఇరగాదీసుకుని చెప్పాలి.... పార్టీలు, కులాలు, ప్రాంతాలు పక్కన పెట్టి, మన రాష్ట్ర బంగారు బాటకు తోడ్పడండి.... ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి, ప్రతిపక్షం పట్టించోకకపోతే మీరే పోరాడి సాదించుకోండి....

ఇక్కడ అమరావతి అభివృద్ధి గురించి, ఆంధ్ర రాష్ట్ర పురోగతి గురించి చెప్తాం... తప్పు అయితే, తప్పు అని చెప్పండి... సరిద్దిద్దుకుంటాం... అమరావతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని వెటకారం చేసినా, ఎగతాళి చేసినా అదే రకంగా మేము స్పందిస్తాం... మంచికి మంచి, పంచికి పంచ్...
ఆంధ్ర రాష్ట్రానికి, అమరావతికి మంచి చెయ్యాలి అనే వాళ్ళుకు అండగా ఉంటాం... ఆంధ్ర రాష్ట్రానికి, అమరావతికి అన్యాయం చెయ్యాలి అనుకునే వాళ్ళని ఎండగడతాం... ఇది అయితే పక్కా...

AmaravatiVoice - Voice of Sunrise State

Advertisements