cbn davos meetings 17012017

‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 47వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి మంగళవారం వివిధ సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులతో సమావేశం అయ్యారు.

పెట్టుబడుల సదస్సుకు సీఎంను రమ్మని పిలిచిన జెట్రో
ఏపీలో పెట్టుబడులు పెడుతున్న జపనీస్ కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోందని జెట్రో చైర్మన్ హిరోయుకి ఇషిగే ముఖ్యమంత్రితో చెప్పారు. ఏపీలో కార్యకలాపాల పురోగతిని వివరించిన జెట్రో చైర్మన్‌కు పేదరికాన్ని రూపుమాపడానికి సాంకేతికతను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నది ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రానికి వున్న సానుకూలతల దృష్ట్యా జపాన్ నుంచి మరింతగా పెట్టుబడుల సంఖ్య పెరగాల్సి వుందని ముఖ్యమంత్రి అన్నారు. జపాన్‌లో త్వరలో మరో పెట్టుబడుల అవగాహనా సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సెమినార్‌లో పాల్గొనాలని ముఖ్యమంత్రిని జెట్రో చైర్మన్ ఆహ్వానించారు.

షైర్ వస్తే ఫార్మా రంగానికి షైనింగ్
హిమోఫీలియా చికిత్స, పరిశోధనలో పేరున్న షైర్ ఇంటర్నేషనల్ ఫార్మా సంస్థ ఈ అంశంలో వెనకబడివున్న భారతదేశం వైపు దృష్టి పెట్టింది. హిమోఫీలియా పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యం పెంపు నిమిత్తం పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం కోసం చూస్తున్నట్టు షైర్ సంస్థ అధినేత కిమ్ స్ట్రాటన్ ముఖ్యమంత్రికి వెల్లడించారు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే తమ కార్యకలాపాలను ప్రారంభింస్తున్నామన్న కిమ్, ఢిల్లీలో ఉనికిని కలిగి వున్నామన్నారు. భారతదేశంలో షైర్ కార్యకలాపాల కోసం అమరావతిని హెడ్ క్వార్టర్‌గా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి కిమ్‌కు సూచించారు. పరిశోధన, అభివృద్ధి అంశాల్లో ప్రధానంగా దృష్టి పెట్టే షైర్ ఇంటర్నేషనల్ సంస్థ అడుగుపెడితే రాష్ట్ర ఫార్మా రంగానికి ప్రయోజనం కలుగుతుంది.

కాలుష్య నియంత్రణకు కొత్త స్నేహితుడు సూయేజ్
పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ, వాటర్ ట్రీట్మెంట్, వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఏపీ అవసరాలకు తగినట్టు పనిచేయాల్సిందిగా తనను కలిసిన సూయేజ్ ఎన్విరాన్మెంట్ సీఈవోను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీలో ఏఏ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల్లో ఉన్నాయో పరిశీలించేందుకు ఒక బృందాన్ని పంపించాలని సూచించారు. జోర్డాన్‌లో సాగునీటి అవసరాలకు వాడే నీటిలో 10 శాతం సూయేజ్ సంస్థ రూపొందించిన ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారానే తీరుతున్నాయి. సూయేజ్ సంస్థ భారత్‌లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

జూరిచ్ - ఏపీ సంబంధాలు బలోపేతం
జూరిచ్‌కు చెందిన బ్రూనో సాటర్‌ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఏపీ, జురిచ్ మధ్య సిస్టర్ స్టేట్ సంబంధాలు ఆశిస్తున్నామని బ్రూనో ఆకాంక్ష వ్యక్తం చేశారు. దావోస్‌లో ఏపీ భాగస్వామ్యాన్ని కొనియాడారు. సాంకేతిక అంశాల్లో జూరిచ్ ముందుందని, త్వరలో ఏపీకి ఒక బృందాన్ని పంపిస్తామన్నారు. స్విట్జర్లాండ్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సమస్యేలేవీ తమకు ఉత్పన్నం కాలేదని బ్రూనో తెలిపారు.

బర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఛాన్సలర్ నికోలస్ డక్స్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. మోరి గ్రామంలో బర్కెలీ యూనివర్సిటీకి చెందిన సోలమన్ డార్విన్ చేస్తున్న కృషిని గుర్తు చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఏపీలో 30 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీలను మార్చి నాటికి 70 శాతానికి తీసుకువెళ్లాలని కృత నిశ్చయంతో వున్నట్టు నికోలస్ డక్స్‌కు తెలిపారు.

బులెట్ రైళ్లు, స్పీడ్ రైళ్లలో అత్యాధునిక సాంకేతికత, ఇంధన వినియోగం, వ్యయం మొదలైన అంశాల్లో మేటి అయిన హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రపంచ దేశాల్లో విస్తరణకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ చైర్మన్ bibopతో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

20వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్ర్రపదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన వనరులు, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిషోర్ తదితరులు వున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read