cbn digitilasaion 18012017

రానున్న రోజుల్లో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ‘ఫిన్ టెక్ వ్యాలీ’గా రూపొందుతుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళవారం ఆయన టైమ్ ఇండియా పురస్కారాల ప్రదానోత్సవంలో నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ ‌లో మాట్లాడారు. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అభిషేక్, మెకన్సీకి చెందిన కెవిన్, టాటా స్టీల్‌కు ప్రతినిధి టీవీ నరేంద్రన్‌లతో కలిసి ‘డిజిటైజేషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించారు. సిలికాన్ వ్యాలీ ఏర్పాటు వెనుక భారీ స్థాయి మానవ నైపుణ్యం దోహదపడిందని గుర్తు చేశారు. ఏపీలో ‘ఫిన్ టెక్ వాలీ’ ఏర్పాటుకు ఎవరి సహకారం ఉందన్న ప్రశ్నకు సీఎం చంద్రబాబు జవాబిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి, పాలనలో పారదర్శకత పెంపొందించడానికి సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. '' ఏపీ ఇప్పటికే నూరు శాతం ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోబోతోంది, యూపీఐ, బయోమెట్రిక్ వంటి విధానాలు ప్రవేశపెడుతున్నాం..ఇప్పటికే 30 శాతం డిజిటల్ ఎకానమీ తీసుకు వచ్చాం'' అని వివరించారు.

వచ్చే మార్చినాటికి 50% డిజిటల్ ఎకానమీ పూర్తిచేయటం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తామని వివరించారు. ఐటీలో మా వాళ్లకు పట్టు ఉంది. నైపుణ్యం మా బలం. మా వాళ్లు కొత్తదనానికి త్వరగా అలవాటు పడతారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఫిన్‌టెక్ వ్యాలీకి ఈ అంశాలే దోహదం చేస్తాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. మిగిలిన ఆర్ధిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత్ ఎకానమీ లో మహిళా భాగస్వామ్యం ఎందుకు చెప్పుకోతగ్గట్టు లేదన్న ప్రశ్నకు 'ఏపీలో మహిళలే బలమైన ఆర్ధిక చోదక శక్తి' అని ముఖ్యమంత్రి జవాబిచ్చారు. ఏపీలో డ్వాక్రా మహిళల స్థానం అద్వితీయమైనదని, వారి స్వావలంబనకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా చొరవ తీసుకుంటోందన్నారు.

విద్యలో అవకాశాలు కల్పిస్తున్నామని, గృహ నిర్మాణం, ఇతర సంక్షేమ ఫలాలు నేరుగా వారికే చేరవేస్తున్నామని వివరించారు. రెండు బిలియన్ డాలర్ల కార్పస్ ఫండ్ తో ఏపీలో మహిళా స్వయంశక్తి సంఘాలు బలమైన వ్యవస్థగా సాధికారత సాధించే ప్రయత్నంలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి ఎలా సిద్ధం చేస్తున్నారని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అందుకోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.

ఏపీకి పెట్టుబడులతో రండి : ఐషర్ కు సీఎం ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులతో రావాలని, తాము అన్నివిధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఐషర్ మోటార్స్ ’ కంపెనీ ప్రతినిధి సిద్దార్ధలాల్‌తో సమావేశం సందర్భంగా అన్నారు. ఈడీబీ సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యాపార విస్తరణ కోసం అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సిద్దార్ధలాల్ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read