cbn davos 18012017

దావోస్ సదస్సులో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచురీ' అనే అంశంపై ప్రసగించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నగరాలను మరింత నివాసయోగ్యంగా, పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలకోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న విధానాలపై తన ప్రణాళికను ఆయన ప్రతినిధుల ముందు ఉంచారు. పట్టణాల సుందరీకరణ నుంచి రాజధాని అమరావతి నిర్మాణానికి చేపట్టిన వినూత్న చర్యలను, విశిష్ట ప్రణాళికలను ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ప్రసంగం పాఠం ఈ క్రింది ముఖ్యాంశాలతో సాగింది.

టెక్నాలజీతో మెరుగైన జీవనం
‘సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించకుండా ప్రపంచంలో ఏ ఆధునిక నగరం కూడా తన పౌరులకు మెరుగైన జీవితాన్ని అందించజాలదు. టెక్నాలజీ సాయంతో దేశంలో ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను సమకూర్చటంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది’.
కొర్ డ్యాష్ బోర్డు: ఉత్తమ పాలనా సామర్ధ్య కోసం ఐఓటీ పరిజ్ఞానంతో కూడిన ‘కోర్ డ్యాష్ బోర్డు’ను అమలు చేస్తున్నాం. కీ పెర్ఫారమెన్స్ ఇండికేటర్స్‌తో నేను పరిపాలనలో ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాను. ‘కోర్’ ద్వారా నేను అనేక నగరాల్లో విద్యుద్దీపాల నిర్వహణ పరిస్థితిని సమన్వయం చేస్తాను. మరో విశేషమేమిటంటే ఈ తాజా సమాచారం మా పౌరులకు లభించేలా ఇంటర్‌నెట్ లో ఉంచాం.

ఏపీ ఫైబర్ నెట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్‌నెట్ పేరుతో ఇంటింటికీ 15ఎం.బి.పి.ఎస్ కనెక్టివిటీ అతిత్వరలో అందించనుంది. 13 మిలియన్ల ఇళ్లకు 250 చానెళ్లతో టీవీ, నెట్ ఫోన్, వైఫై సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నెలకి రూ.149 కే ఈ సదుపాయాన్ని కల్పించనున్నాం. వాణిజ్య అవసరాలకోసం 1-జి.బి.పి.ఎస్‌తో 100 ఎంబీపీఎస్ కనెక్టివిటీ ఇవ్వనున్నాం. ఫైబర్ నెట్ వల్ల మా ప్రభుత్వం ప్రతి పౌరుడితో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించే వీలు ఏర్పడుతుంది.
ఇ-ప్రగతి: పౌరుడికీ ప్రభుత్వానికీ అనుసంధానమైనది ఇ-ప్రగతి. ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలన్నింటినీ ఆన్‌లైన్ ద్వారానే అందిస్తాం. ఈ ఆన్‌లైన్ వేదికే ఇ-ప్రగతి.

ఇ-ప్రగతి ద్వారా 745 పౌరసేవలు ఒకే చోట లభిస్తున్నాయి. ఇలా 2015-16లో 1.01 బిలియన్ లావాదేవీలు జరిగాయి. భవన నిర్మాణ అనుమతుల నుంచి 100% పన్నుల చెల్లింపు దాకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నమోదవుతున్నాయి.
ఇ-పి.డి.ఎస్:

ఆధార్ అనుసంధానంతో దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను సంపూర్ణంగా నిర్వహించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. బయోమెట్రిక్ విధానం, ఆధార్ అనుసంధానం తో పీఓఎస్ పద్ధతి ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థను ఉత్తమంగా తీర్చిదిద్దాం. ప్రతినెలా చివరితేదీకల్లా మరుసటి నెల రేషన్ ప్రజాపంపిణీ వ్యవస్థ దుకాణాలకు చేరుతోంది. కేవలం పది రోజుల్లోనే రేషన్ పంపిణీ పూర్తవుతోంది. ఇందుకోసం గతంలో నెల రోజులు పట్టేది. ప్రజాపంపిణీ దుకాణాలలో ఏ సరకు ఎంత స్టాకు ఉందో రియల్ టైమ్ సమాచారం అందుతుంది. ఇ-పోస్ వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టి, 13 నెలల్లో 10 మిలియన్ డాలర్లను ఆదాచేశాం.

స్మార్ట్ సిటీలు:
భారత ప్రభుత్వ సహాయంతో విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్టు సిటీలుగా అభివృద్ధి చేస్తున్నాం. మరో 13 స్మార్టు సిటీల అభివృద్ధికి ప్రణాళికలున్నాయి. కాకినాడ, విశాఖ స్మార్టు సిటీల ప్రణాళిక అమలుకు 500 మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజుక్టులను సిద్ధం చేశాం.

పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంసహాయక సంఘాల సాధికారత ద్వారా సుస్థిర పేదరిక నిర్మూలన కార్యక్రమం చేపట్టింద. బ్యాంకులు, స్వయంసహాయక సంఘాలను అనుసంధానం చేశాం. వారి జీవితాలను వారే మెరుగుపర్చుకునే విధంగా స్వయంసహాయక సంఘాలకు బ్యాంకులు పెట్టుబడులు అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఇలా 10 లక్షల స్వయం సహాయక సంఘాలు లబ్ది పొందాయి.బ్యాంకులు 95% రికవరీ రేటును సాధించాయి.

సైబర్ సెక్యూరిటీ: దేశంలో ఐఓటీ విధానం ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ. సైబర్ సెక్యూరిటీ, జి.ఐ.ఎస్ విధానాలను త్వరలో అమలు చేయనున్నాం. పెన్షన్ల పంపిణీ, ప్రజాపంపిణీ వ్యవస్థ ఆన్ లైన్ విధానంలో అమలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియల్ టైమ్ సర్వర్ రక్షణకు అవసరమైన సైబర్ సెక్యూరిటీ కల్పించనున్నాం.

ఎల్.ఇ.డి లైటింగ్: వీధుల్లో ఎల్ .ఇ.డి బల్బులు అమర్చటం ద్వారా ఇంధన పొదుపుతో 40% విద్యుత్తును ఆదా చేశాం. ఇలా ఆదా అయిన డబ్బుతోనే ఈ ప్రాజెక్టు భాగస్వామి నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకుంటాడు.

అర్బన్ డిజైన్, ప్లానింగ్: నూతనంగా నిర్మించే నగరాల నమూనాల రూపకల్పన, ప్రణాళిక అంతా 2029-విజన్ కు అనుగుణంగా ఉంటుంది. భారత్ లో అనేక మెగాసిటీలలో లోపించింది ఇదే. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని దీనిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాం.

పెంమాండు: విధానాలు కేవలం కాగితాలకే పరిమితమైనవిగా కాకుండా ఫలితాలనివ్వాలి. ఈ దిశగా మేం మలేషియా తరహాలో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం.‘పెర్ఫారమెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్’(పెమాండు)ను అమలు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన, అమలు పెమాండు పద్ధతిలో నిర్వహిస్తున్నాం.

నగరాభివృద్ధి నాలుగు పెమాండు కార్యక్రమాల ద్వారా ఏడు విభాగాలలో సంస్కరణలు అమలు చేస్తున్నాం.. 1. నగరాభివృద్ధి 2. హౌసింగ్ 3. రోడ్లు 4 అర్బన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు , 5. నీరు,6. పారిశుధ్యం, 7.ఘన వ్యర్ధాల నిర్వహణ.

స్మార్ట్ వేస్ట్ మేనేజిమెంట్: నగరాలను మరింత నివాసయోగ్యంగా, సుస్థిరంగా తీర్చిదిద్దటానికి స్మార్టు వేస్ట్ మేనేజిమెంట్ విధానం. ఇందుకోసం అంతర్జాతీయంగా ఉన్న అత్యంత మెరుగైన పద్ధతులను ఇక్కడ అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో 10 ఘన వ్యర్ధ నిర్వహణ ప్లాంటులను 110 మిలియన్ డాలర్లతో నెలకొల్పనున్నాం. వీటి ద్వారా రోజూ 64 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసి రాష్ట్ర పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేస్తున్నాం

బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రం:
పౌరులు హూందాగా, ఆత్మగౌరవంతో, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించటానికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం. భారత ప్రభుత్వ సహకారంతో ఏపీ త్వరలో దేశంలో తొలి ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ స్టేట్ కాబోతోంది.

పట్టణ ప్రాంత గృహ వసతి: రాష్ట్రంలో 2022 నాటికి అందరికీ అందుబాటు ధరల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తాం. పనిచేసే కార్యాలయాలు, స్థలాలకు దగ్గరలోనే గృహనిర్మాణం అనే థీమ్‌తో ఇళ్లు నిర్మిస్తున్నాం.

అందరికీ మంచినీరు: నగరాల్లో నివసిస్తున్న వారికి శుద్ధిచేసిన త్రాగునీరు అందించటం ధ్యేయం. నదులు, చెరువులు, జల వనరుల అనుసంధానం ద్వారా స్మార్టు వాటర్ గ్రిడ్ అమలు.

గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతి: నీరు, పచ్చదనం భావనలతో కూడిన రాజధాని అమరావతి నిర్మాణం. ఇరవై శాతం నగర ప్రాంతంలో పచ్చదనం చేకూర్చేందుకు నిర్ణయించాం. నగర పరిధిలో కేవలం కాలుష్యరహిత, గ్రీన్ అండ్ ఆరెంజ్ శ్రేణి పరిశ్రమలకే అనుమతినివ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

పట్టణ ప్రాంత హరిత, సుందరీకరణ సంస్థ: నగరాలన్నింటిలో పచ్చదనం నింపి సౌందర్యనందనాలుగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రాంత హరిత, సుందరీకరణ సంస్థ ఏర్పాటు చేశాం. 2020 నాటికి పట్టణ ప్రాంతాల్లో 20% పచ్చదనం తేవటం మా లక్ష్యం.

ఆర్ధిక నగరాలు: నగరాలు వెలుపల కూడా పట్టణీకరణలో భాగంగా ప్రైవేటు, పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్ధిక నగరాల ఏర్పాటుకు నిర్ణయించాం. నవనగరాలలో నిర్మాణాలకు 21 రోజుల్లో ఏకగవాక్ష విధానం ద్వారా అన్ని అనుమతులనిస్తాం.

నగరాలకు ఆర్ధిక వనరులు: పట్టణీకరణ లక్ష్యాలను సాధించటానికి తగిన, సరిపడిన, వినూత్నమైన ఆర్ధిక విధానాలు. ఏపీ ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ అన్ని సమస్యలను పరిష్కరించుకుందని సగర్వంగా చెబుతున్నాను.

రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ:
దేశ చరిత్రలో ఒక వినూత్న విధానంతో రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూ సమీకరణ చేశాం. దేశంలో ఇది ఓ విజయవంతమైన ప్రయోగం. రెండు జిల్లాలను కలుపుతూ రాజధాని ప్రాంతం ఏర్నాటు. తొంభై శాతం సీఆర్ డీఏ ప్రాంతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది.

ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు
రాజధాని అమరావతి చుట్టూ 186 కిమీ పొడవుతో 8 లేన్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం. 5.49 లక్షల హెక్టార్లను కలుపుతూ సర్వీసు రోడ్లు ఉంటాయి. ఇక గ్రీన్ ఫీల్డు అలైన్‌మెంట్‌తో 67.5. కిమీ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం. రింగు రోడ్ల చుట్టూ 98 కి.మీ పరిధిని కలుపుతూ శాటిలైట్ టౌన్స్ నిర్మాణం ప్రారంభిస్తాం.

ఆరు పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులు
ఆరు కొత్త పోర్టుల నిర్మాణం, ఆరు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం ప్రారంభించాం. నగరాల అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకోసం ప్రైవేటు కంపెనీ అయిన ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్ గ్రూప్‌తో కలసి సంయుక్తాం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజిమెంట్ లిమిటెడ్ (apuiaml) ను ఏర్పాటు చేశాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read