cbn 17012017

గడ్డ కట్టే చలి, మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత... ఆయన సంకల్పం ముందు, ఇవన్నీ దిగదుడుపే...

ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చెయ్యాలి అంటే ఎన్నో ఇబ్బందులు పడాలి... ఎక్కే గడప, దిగే గడప... ఎవరు ముందుకు వస్తారో తెలీదు... అయనా సరే, ఒక ఆశతో ముందుకు వెళ్ళాలి... ఇవి మనం రోజు చూస్తూనే ఉంటాం... మన ఇంటికి ఎవరన్నా మార్కెటింగ్ వాళ్ళు వచ్చినప్పుడు జరిగే సీన్ లు ఇవన్నీ... ఇప్పుడు ఇదే తరహాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో, ఇదే మార్కెటింగ్ పని చేస్తున్నారు... ఎంతో ఆశతో, ఒక్క పెట్టుబడి అయనా రాకపోతుందా అంటూ ముందుకు సాగుతున్నారు... ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఈ రాష్ట్రానికి నెంబర్ 1 కూలీ అని... అలాగే కష్టపడుతున్నారు... హైదరాబాద్ లో పెట్టుబడుల కోసం, చేతిలో ఫైల్స్ పట్టుకుని, అమెరికా వీధుల్లో ఎలా తిరిగారో, ఇప్పుడు మళ్ళి అలాగే, జ్యురిచ్ వీధుల్లో తిరుగుతున్నారు..ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు... చిన్న కంపెనీ, పెద్ద కంపనీ అని తేడా లేదు... మన రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేసే పనిలో ఉన్నారు... వన్ టు వన్ మీటింగ్స్ పెట్టి, పెట్టుబడులు పెట్టమని అందరినీ అడుగుతున్నారు. ఇవన్నీ మన కోసమే, మన పిల్లల కోసమే, మన బంగారు భవిషత్తు కోసమే...

హైస్పీడు రైలు ఇంజిన్లు, బోగీల తయారీ రంగంలో 75 ఏళ్ల అపార అనుభవం ఉన్న ప్రసిద్ధ సంస్థ ‘స్టాడ్లర్‌ రైల్‌ మేనేజ్‌మెంట్‌ ఏజీ’ సంస్థ విశాఖలో తమ యూనిట్‌ను నెలకొల్పడానికి ఆసక్తి చూపింది... తమ స్టాడ్లర్‌ రైల్‌ ఫ్యాక్టరీని సందర్శించవలసిందిగా సంస్థ ప్రతినిధులు చంద్రబాబుని ఆహ్వానించారు. మిగిలిన సమావేశాలన్నీ ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బృందంతో కలసి స్టాడ్లర్‌ రైల్‌ ఫ్యాక్టరీని సందర్శించి హైస్పీడ్‌ రైల్‌ బోగీల తయారీని పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి రైల్ ఫ్యాక్టరీని మనం విశాఖలో చూడొచ్చు.

ఇవన్నీ మన రాష్ట్రంలో పెట్టుబడుల కోసం... క్రింద వీడియో చూడండి, ఆయన కష్టం ఏంటో మీకే అర్ధం అవుతుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read