అన్న" ఎన్టిఆర్ " బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన అల్లుడిగా చంద్రబాబు నాయుడి పాత్రను గురించి అందరికీ తెలిసిందే. అలాంటి కీలకమైన పాత్ర కోసం ఎన్టిఆర్ అల్లుడు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను రానా దగ్గుబాటి విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాత్ర కోసం రానా స్లిమ్ గా తయారయ్యారు. రేపు వినాయక చవితి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి రానా ఫస్టులుక్ ను అధికారికంగా రిలీజ్ చేశారు.

cbnb 12092018 2

రానాని చూస్తుంటే క్లీన్ షేవ్ చేసుకొని - మీసాలు పెంచి బాబును మక్కికి మక్కి దించేసారానే చెప్పాలి. నారా బాబు గా మారిన రానా బాబు అనే ప్రసంసలు అందుకుంటున్నారు.ఈ షూటింగ్ కోసం చంద్రబాబు మేనరిజం.. మాట్లాడే తీరు ఇవన్నీ కాపీ కొట్టేందుకు పాత వీడియోలు కూడా చూస్తున్నాడని అన్నారు. మొత్తానికి రానా మరోసారిఈ పాత్ర సెన్సేషన్ చేస్తారేమో . రీసెంట్ గా రానా నాన్నగారు సురేష్ బాబు మాట్లాడుతూ "పూర్తిగా చంద్రబాబుగా మారిన రానాను" చూసి షాక్ అయ్యాడని చెప్పారు.ఈ ఫోటో చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

తెలుగు సినిమా చరిత్ర లో మరో సంచలనం.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ అని ప్రకటించాడో లేదో, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు వర్మ

ఆ పాట ఇదే:

2016 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని దక్కించుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయస్థాయిలో మార్మోగిందని సంతోషం వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి.

శంకరాభరణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసంగమం, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం వంటి మనసుకు హత్తుకునే అపురూప, చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు ఎన్నో తెలుగువారికి అందించారు అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజుల్లోనే ఒక తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత కె. విశ్వనాథ్‌దే అని అన్నారు.

1957లో సినిమారంగంలో ప్రవేశించి నేటికి కూడా వెండితెరతో అనుబంధాన్ని కొనసాగిస్తూ కె. విశ్వనాథ్ భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు అన్నారు. సినీ ప్రపంచంలో అడుగుపెట్టే భావితరాలకు కె. విశ్వనాథ్ స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలుస్తారు అని ముఖ్యమంత్రి అన్నారు.

బాలకృష్ణ హీరోగా, దివంగత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌పై కన్ఫర్మేషన్‌ వచ్చేసింది. ఈ మూవీని రాం గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నాడు. ఇలా ప్రకటించాడో లేదో... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు.

‘ఎన్టీఆర్ శత్రువులెవరో, మిత్రులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుక అసలు కాంట్రవర్సీ ఏంటో చెబుతా’ అంటూ వర్మ ఓ పాటను విడుదల చేశారు.... ఈ పాట సాగుతుంది. "ఇదే తెలుగు కీర్తి, ఇదే తెలుగు ఖ్యాతి, పొంగించారు మీరే ఈ తెలుగోడి ఛాతీ... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... అన్యాయాన్ని తుంచి, అధర్మాన్ని వంచి, పాలించారు మీరే సదా ప్రేమ పంచి... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీరే జీవితం, మీరే శాశ్వతం, ఇక ఏనాటికైనా మీదే సంతకం... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీదే రాజసం, మీదే సాహసం, తెలుగోడికిచ్చారు పొంగే పౌరుషం. జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్..." అంటూ సాగే పాట ఇప్పుడు శరవేగంగా పాప్యులర్ అయిపోతోంది. పాటలోని లిరిక్స్ క్యాచీగా ఉండటం విశేషం.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, త్వరలోనే మిగిలిన వివరాలను తెలపనుంది చిత్ర యూనిట్‌.

కోట్లాది అభిమానుల ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘అజహర్‌’, ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ల తర్వాత భారత క్రికెటర్‌ జీవితం ఆధారంగా రూపొందించిన మూడో చిత్రమిది.

అయితే టీజర్‌లో, 1.12 సెకండ్స్ దగ్గర, 2014లో, సచిన్ PVP మాల్ ఓపెనింగ్ కి, విజయవాడ వచ్చినప్పుడు, బందర్ రోడ్డు పై అభిమానుల కోలాహలం, వారికి సచిన్ అభివాదం చెయ్యటం, ఈ ట్రైలర్ లో చూపించారు.

ఈ వీడియోలో 1.12 సెకండ్స్ దగ్గర, మీరు చూడండి

More Articles ...

Page 1 of 2

Advertisements

Latest Articles

Most Read