dure tech in ap 17012017

సైబర్ సెక్యూరిటీ రంగంలో, టీబీ మహమ్మారిని రూపుమాపడానికి అనుభవం కలిగిన డ్యూర్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.

ఐటీ మేళవింపుతో ఆరోగ్య భద్రత కల్పించడంలోనూ పేరుగాంచిన డ్యూర్ టెక్నాలజీస్ టీబీ మహమ్మారిని రూపుమాపేందుకు భారతదేశంలో పనిచేయాలని భావిస్తోంది. ప్రపంచంలో ప్రతి 4 టీబీ కేసుల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతోందని పేర్కొన్న డ్యూర్ టెక్నాలజీస్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ను, అమరావతిని టీబీ రహితంగా మార్చడానికి సహకరిస్తామని ముఖ్యమంత్రికి మాటిచ్చారు. ఈ కార్యక్రమాన్ని మొదట ఏపీలో ప్రారంభిస్తే దేశం మొత్తం భాగస్వామి అవుతుందని డ్యూర్ టెక్నాలజీస్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

సైబర్ సెక్యూరిటీ రంగంలో కూడా విశేష అనుభవం కలిగిన డ్యూర్ టెక్నాలజీస్.
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల వైపు వేగంగా వెళుతున్న భారత్‌లో సైబర్ సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన డ్యూర్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ఆసక్తిని తెలియజేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read