council new chairman ap 17012017

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా నెల్లూరు సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నిక కానున్నారా ? అవుననే అంటున్నాయి పరిణామాలు.. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న చక్రపాణి పదవీ కాలం మార్చ్ నాటికి పూర్తి అవ్వనుంది. కాంగ్రెస్ హయంలో ఉన్న చక్రపాణి, సీనియర్ నేత, అందిరినీ కలుపుకుపోయే స్వభావం ఉండటంతో, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కొనసాగించారు.

ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది, మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. సోమిరెడ్డికి మండలి చైర్మన్ ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. గాలి ముదుకృష్ణ నాయుడు కూడా రేస్ లో ఉన్నా, సామజిక సమీకరణాల దృష్టిలో ఉంచుకుని, సోమిరెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. సోమి రెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే గుంటూరు, ప్రకాశం, చితూరు జిల్లాల్లో రెడ్డి వర్గం తెదేపా వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

మరో వైపు, మండలిలో మొత్తం 7 స్థానాలు ఖాళీ కానున్నాయి. సాంకేతికంగా ఉన్న బాలాల ప్రకారం, ఒక స్థానంలో వైకాపా, మిగిలిన ఆరు సీట్లు తెదేపాకు దక్కనున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read