ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు వరించింది. దిల్లీలో సీఎన్‌బీసీ-టీవీ18 ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియా బిజినెస్‌ లీడర్‌’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. కార్యక్రమానికి రాష్ట్రం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డిజిటల్ ఇండియా తప్పక వాస్తవ రూపం దాలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డిజిటల్‌ ఇండియా విజయవంతానికి మొబైల్‌ కరెన్సీని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా సీఎన్‌బీసీ టీవీ 18 నుంచి టీం ఆంధ్రప్రదేశ్‌ తరుపున స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అయ్యన్నపాత్రుడు అందుకున్నారు.

అంతకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ, రెండేళ్లలో రెండంకెల వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రెండేళ్లలోనే నవ్యాంధ్ర ఎన్నో రంగాల్లో దేశంలోనే మొదటిస్థానాన్ని ఆక్రమించిందన్నారు. కేంద్రం విభజన హామీలను మరింతగా అమలు చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

నవ్యాంధ్రలో అభివృద్ధి మూలంగా భవిషత్తులో దేశాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ప్రతికూల పరిస్థితులున్నా దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా సాధించామని సీఎం చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, హర్‌సిమ్రత్‌ బాదల్‌ కౌర్‌, రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌, మనోజ్‌ సిన్హాతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read