ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. బ్రిటీష్ ప్రభుత్వ ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం నిర్వహించే ప్రదర్శనలో అమరావతి విశిష్టత, సంస్కృతి , సాంప్రదాయాలు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుల గురించి వివరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు 3 రోజులపాటు లండన్ లో జరిగే సదన్సులో ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటర్ టెక్నాలజీ పై ప్రదర్శన ఉంటుందని, దీనికి హాజరు కావాలంటూ బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేకంగా పంపిన ఆహ్వానంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణతో కూడిన అత్యున్నత బృందం, ఈ ప్రదర్శనలో పాల్గొని రాజధాని నగరం, అమరావతి నిర్మాణం, భవిప్యత్ ప్రణాళిక, పెట్టుబడులు, అంతర్గాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన, ప్రజా సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల గురించి వివరిస్తారు. ఈ బృందంలో సిఆర్డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, తదితర అధికారులు ఉంటారు.

రాజధాని నగరం అమరావతి నిర్మాణ సంకల్పం, భూసమీకరణ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాల కల్పన, అంతర్గాతీయ స్థాయి విద్య, వైజ్ఞానిక, వైద్య సంస్థలు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం వంటి అంశాలను గురించి మంత్రి నారాయణ ఈ వేదిక ద్వారా ప్రపంచానికి వివరించనున్నారు. ఈ సందర్భంగా సిఆర్డిఎ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేసినట్లు ఇంధన, మౌలిక సదుపా యాలు, పెట్టుబడులు, సీఆర్డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్ జెన్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సిఎంఓ ముఖ్య కార్యదర్ళి జి.సాయి ప్రసాద్, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సిఆర్డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్ జెన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదిక ద్వారా నగర నిర్మాణం కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి తీసుకోకుండా 33,000 ఎకరాలను భూసమీకరణ విధానంలో ఇవ్వడం ద్వారా రైతులు చేసిన త్యాగాన్ని విశ్వానికి వివరించాలని మంత్రి నారాయణ బృందానికి చంద్రబాబు సూచించారు. అమరావతి నగర నిర్మాణంలో స్వల్ప, దీర్ఘకాల ప్రణాళికను ఎలా రూపొందించామో వివరించాలని సూచించారు. వచ్చే దశాబ్ద కాలంలో 3 నుంచి 5.5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో స్పష్టం చేయాలన్నారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సద న్సులోనే అమరావతి నిర్మాణం గురించి ప్రపంచానికి అవగతమయ్యిందని సీఎం చంద్రబాబు చెప్పారు.

అమరావతి నగరాన్ని అత్యున్నత ప్రణాళికతో పరిపాలన, క్రీడా, మీడియా, జస్టిస్, విజ్ఞాన, ఎలక్రానిక్, ఆర్ధిక, పర్యాటక నగరాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రపంచానికి చెప్పాలని సిఎం చంద్రబాబు వివరించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఇప్పటికే జపాన్, సింగపూర్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాలను ఆహ్వానించిన విషయాన్ని వివరించాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read