అమరావతిని భ్రమరావతి అంటారు... పట్టిసీమని వట్టిసీమ అంటారు... కట్ చేస్తే, ఏ అమరావతిని అయితే భ్రమరావతి అని హేళన చేశారో... ఈ రోజు అదే అమరావతి, తల ఎత్తి చూసే అంతగా ఎదుగుతుంది... అదే అమరావతి నడిబొడ్డులో నవ్యాంధ్ర నూతన శాసనసభలో రొజూ కూర్చుంటున్నారు..... ఏ పట్టిసీమని, వట్టిసీమ అని, కృష్ణా నీళ్ళని రాయలసీమకి రాకుండా అడ్డంగా పడుకోవాలని చూసారో, అదే పట్టిసీమ నీళ్లతో రొజూ గొంతు తడుపుకుంటున్నారు. సచివాలయం భూమిలోకి క్రుంగింది అని, సచివాలయం, అసెంబ్లీ కడుతున్న ప్రాంతంలో భూకంపాలు వాస్తాయని, ఇలా అనేక ఏడుపులు మధ్య, అమరావతి ని భ్రమరావతి అన్నవారి, భ్రమలు పటాపంచలు చేస్తూ అమరావతి ఠీవి గా నిలబడింది...

అసలు మన తల్లిని, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన రాజధాన్ని, మనమే కించపరుస్తూ, వెక్కిరిస్తూ, ఎగతాళి చేస్తూ ఉంటే ఇక పక్క రాష్ట్రాల వారు ఎందుకు గౌరవిస్తారు? చంద్రబాబు మీద రాజకీయంగా కోపం ఉండచ్చు. ఆయన అంటే కొద్ది మందికి ఇష్టము లేకపోవచ్చు. ఆయన పాలనలో కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు. తప్పేమీ లేదు. విమర్శించండి. మీ హక్కు అది. కానీ ఈ అమరావతిని 'భ్రమరావతి' గా మార్చడమేమిటి? అసలు ఎందుకు భ్రమ అవుతుంది చెప్పండి. మన రాజధాన్ని మనమే అలా తిట్టుకొంటే ఎలా?

అసలు భ్రమ ఎవరికీ ఎందుకు ఉండాలి? ఆ రాజధాని కోసం 33000 ఎకరాలు భూములిచ్చిన రైతుల సంగతేమిటి? రాజధానిలో కడుతున్న భవనాల సంగతేమిటి? వాటి కోసం రాత్రి పగలు ఎర్రటి ఎండలో చమటలు కారుస్తూ కష్టపడుతున్న కూలీలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు , ఇతర వర్గాల సంగతేమిటి? ఆ రాజధానిలో ఉండి ఉద్యోగం చెయ్యాలని వస్తున్న వేలాది ఉద్యోగుల సంగతేమిటి? ఆ మంచి రాజధాని వస్తే వాణిజ్యపరంగా భాసిల్లితే, దాని వలన వచ్చే ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం ఆశగా చూస్తున్న చదువుకొన్న, చదువుకొంటున్న యువత పరిస్థితి ఏమిటి ? నేను, నా రాష్ట్రం, నా రాజధాని, అని పాషన్ తో పూర్తిగా సెటిల్ అయిన హైదరాబాదు నుంచి, ఏ వ్యాపారమో కూడా తెలియకుండా, తరలివద్దాము అని సత్వర ప్రణాళికలు వేస్తూ, ఇప్పటి దాకా హైదరాబాదులో వున్నవారి సంగతేమిటి? మా అందరికీ కనిపించని భ్రమ మీకెలా అగుపించింది?

భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా ఉండే నగరం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో రాజధాని పై ఈ రకమైన 'భ్రమ' అంటూ చేసే వ్యంగ వ్యాఖ్యానాలు వాల్ల ఉపయోగం ఉందా? ఈ సునకానందం ఎందుకు?

పోనీ ఈ విమర్శించే వారు రాజధాని కోసం చేసిన సాయమేమిటి? గ్రామాల్లో ఊరి బయట లుంగీలు కట్టుకొని గోడ మీద కూర్చొని వచ్చే పోయ్యే వారి మీద మాటల్లాంటి రాళ్ళు వేసే వారికి మీకూ, తేడా ఏమన్నా ఉందా? మీలో ఎవరన్నా ఇప్పటి నుంచి ఒక స్థలం కోసం వెదకడం మొదలుపెట్టి, రిజిస్ట్రేషన్ చేసి, ప్లాన్ గీసి, డిజైన్ రెడీ చేసి, అన్ని అప్రూవల్స్ తెచ్చుకుని, రెండేళ్ల లోగా ఒక ఇల్లు కట్టటం పూర్తి చేసి చూపించండి ? ఏ రాష్ట్ర రాజధాని కైనా వెళ్తే అంత అద్భతం గా వుంది అని పొగడ్తల వర్షం కురిపిస్తాం. మనదో ,మన పక్కదో ఇంకా ప్రణాళిక ,పునాది స్థాయిలో వున్నదానికీ వ్యంగ్యాలు ఎందుకు? ఒక ప్రపంచ స్థాయి రాజధాని కట్టుకుంటుంటే, ప్లన్స్ చూడద్దా ? డిజైన్స్ వద్దా ? భవిష్యత్తు తరాలు కోసం అమరావతిని తాయారు చెయ్యవద్దా ? మన అమరావతి ప్రపంచంలోనే ఒక గొప్ప సిటీ అవ్వద్దా ?

అమరావతి మన ఆంధ్రా ప్రజలందరిది... చంద్రబాబు రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ అమరావతి ఎప్పటికీ ఉంటుంది. మన భవిష్యత్తు తరాల కోసం మనం మన అమరావతిని నిర్మించుకుంటున్నాం. అసలు అమరావతి అంటేనే నాశనం లేనిది అని అర్థం. ఈ భ్రమరావతి అనే బ్యాచ్ అంతా భ్రమల్లో మాత్రమే బ్రతికే బ్యాచ్. వాళ్ళకు ఎప్పుడూ నాశనమే కావాలి... విమర్శ, అందునా సద్విమర్శ చేసే మానిసిక పరిపక్వత లేక, కడుపులో ఒక ప్రాంతం మీద రగులుతున్న పైత్యాన్ని అలా దించుకుంటున్నారు. ఆ పైశాచిక ఆనందంలో కోట్ల మంది ఆకాంక్షలని, మనోభావాల్ని దెబ్బ తీస్తున్నాము అని మరిచిపోతున్నారు.

అప్ప‌ట్లో హైద‌రాబాద్‌లో హైటెక్ సిటీకి ద‌శ‌-దిశ చంద్ర‌బాబు చూపిస్తే ఎక‌సెక్కాలాడారు. ఇప్పుడు అదే హైటెక్ సిటీ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మందికి ఉపాధి చూపిస్తోంది. ఏటా 70వేల కోట్ల రూపాయ‌ల సంప‌ద‌ను సృష్టిస్తోంది. రేపు అమ‌రావ‌తి కూడా అంతే... ఈ రోజు అమ‌రావ‌తి పై ఎక‌సెక్కాలాడిన వాళ్ళ‌కు కాల‌మే స‌మాధానం చెపుతుంది.

చివరిగా ఒక్కమాట .... మీకు తెలీదు అనుకుంటా, "ఆవతి" అంటే నిలయం. అమరుడు కొలువైనందున అమరావతి అన్నారు. ఆ లెక్కన భ్రమరావతి (భ్రమర + ఆవతి) అంటే భ్రమరములకు (తుమ్మెదలకు) నిలయం అని అర్థం వస్తుంది.... భ్రమరమంటే తేనెటీగ... చక్కటి తేనెపట్టులాంటి అమరావతిలో మధురమయిన తేనెను నింపే భ్రమరాలు తిరిగే నందనవనం లాంటి ప్రాంతం అమరావతి.... మీరు వ్యంగ్యంగా చెప్పాలన్నా మంచి పేరే కుదిరింది...

ఇంత జరుగుతున్నా, గన్నవరం నూతన టెర్మినల్ లో దిగి, అద్భుతమైన అందమైన హైవే మీద వచ్చి, ఇంద్రభవనం లాంటి నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ లో కూర్చుని, రొజూ అమరావతిలో తిరుగుతున్నా, అమరావతి నీరు త్రాగుతున్నా, అమరావతి గాలి పీల్చుతున్నా, భ్రమరావతి అని భ్రమలో ఉన్నారు... భ్రమరావతి అని భాద్యత లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు... ఏడ్చేవాళ్లు కొంచెం ఈ క్రింది ఫోటోలు చూడండి, ఇంకా బాగా ఏడవచ్చు.... ఇవి కూడా మొదట్లో మీరు అంటున్నట్టు భ్రమలే, గ్రాఫిక్స్ మాత్రమే.... కాని రెండు సంవత్సర కాలంలో, ఆంధ్రోడి సత్తాకి, కార్యదక్షతకి, మేధస్సుకి, విజయచిహ్నంగా నిలిచినవి ఇవి...

ఇప్పటికైనా మారండి, లేదంటే అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతన్నలు, మీ కోసం ఇంకో ఆరడుగులు సిద్ధం చెయ్యగలరు...

Assembly Building in Velagapudi

amaravati 25032017 2

Gannavaram Airport New Terminal

amaravati 25032017 3

Gannavaram Airport Interior

amaravati 25032017 4

Gannavaram Airport Exterior

amaravati 25032017 5

Pattiseema

amaravati 25032017 6

Secretariat Complex in Velagapudi - 1

amaravati 25032017 7

Secretariat Complex in Velagapudi - 2

amaravati 25032017 8

Secretariat Complex in Velagapudi - 3

amaravati 25032017 9

Secretariat Complex in Velagapudi - 4

amaravati 25032017 10

Advertisements

Advertisements

Latest Articles

Most Read