ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారికి శుభవార్త... రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1.2 లక్షల ఇళ్లను నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు నిన్న మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో పాటు (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)), రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీ ఇచ్చి, మొత్తంగా రూ.3లక్షల రాయితీ ఇస్తారు. మిగిలిన ఖర్చు మొత్తం, సులభ వాయిదాలలో, బ్యాంకు లోన్ సదుపాయం కల్పిస్తుంది ప్రభుత్వం. నెల నెల వాయిదా, 1700 దాక ఉంటుంది.

ఇందుకోసం, అర్హులైన వారు, రూ.వెయ్యి చెల్లించగానే గృహాన్ని మంజూరుచేస్తారు. మిగిలిన మొత్తాన్ని సులభ వాయిదాలపై తీర్చేలా బ్యాంకు రుణం ఇప్పిస్తారు. బ్యాంకులు రుణం సామాన్యులకు అంత తెలేగ్గా రాదు. ఈ బ్యాంకు రుణం ప్రభుత్వం ఇప్పిస్తుంది.

ఇందులో మూడు రకాల ఇల్లు ఉంటాయి. ఈ మూడు రకాల ఇళ్ళకు రూ.3లక్షల రాయితీ వస్తుంది.

  • మొదటిది 270 చ.అడుగుల్లో హాల్‌, పడకగది, వంట గది, మరుగుదొడ్డి. ఈ ఇంటికి రూ.వెయ్యి కడితే మంజూరు చేస్తాం. తరువాత వాయిదాలు కట్టాలి.
  • మరో రకం 365 చ.అడుగుల్లో హాల్‌, పడకగది, వంట గది, మరుగుదొడ్డి. ఈ ఇంటికి రూ.25వేలు, ఇదే ఇల్లు అన్ని హంగులతో కావాలనుకొంటే రూ.50వేలు కడితే మంజూరు చేస్తాం. ఈ 50 వేలు ఒకేసారి కట్టాల్సిన పని లేదు. ఇందుకు ఏడాది గడువుంటుంది. తరువాత వాయిదాలు కట్టాలి.
  • 420 చ.అడుగుల్లో రెండు పడకగదులు, హాల్‌, వంట గది, మరుగుదొడ్డి. ఈ ఇంటికి రూ.50వేలు, ఇదే ఇల్లు అన్ని హంగులతో కావాలనుకొంటే రూ.లక్ష కడితే మంజూరు చేస్తాం. ఈ లక్ష ఒకేసారి కట్టాల్సిన పని లేదు. ఇందుకు ఏడాది గడువుంటుంది. తరువాత వాయిదాలు కట్టాలి.

ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు లేని నాలుగు జిల్లాల్లో సంబంధిత టెండర్‌ ప్రకటనను నాలుగు రోజుల్లో ప్రభుత్వం జారీ చేయ్యనుంది. మిగిలిన జిల్లాల విషయమై ఎన్నికల సంఘం అనుమతి కోసం రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలుకాకుంటే ఏప్రిల్‌ నుంచి మిగిలిన జిల్లాలో ఆ ప్రక్రియ మొదలవుతుంది.

ప్రభుత్వం ఇల్లు కాబట్టి, ఎదో నాలుగు గోడలు కట్టి ఇవ్వరు. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో, బేసిక్ మరియు సోషల్ వసతలు ఉంటాయి. గేటెడ్‌ కమ్యూనిటీ తరహా అంటే, తాగునీరు, విద్యుత్‌, రోడ్లు వంటి మౌలిక వసతులతోపాటు ఆసుపత్రి, వాణిజ్య సముదాయం, కమ్యూనిటీ హాల్‌ తదితర సదుపాయాల్ని కల్పిస్తారు. నిర్వహణకు ప్రత్యేకంగా సొసైటీని ఏర్పాటు చేసి.. ఒక్కో ఇంటికీ రూ.30వేలు చొప్పున అందులో డిపాజిట్‌ చేస్తారు. ఈ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రతీవారం నేరుగా ముఖ్యమంత్రే సమీక్షించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో, ఏడాదిన్నర్ర కాలంలోపే ఇవి పూర్తి చెయ్యాలి అని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read