ఇది చదివితే చంద్రబాబు గారిని రెండు సార్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రం ఏమి కోల్పోయిందో బుర్ర ఉన్న ప్రతోడికి అర్థం అవుతుంది. వోక్స్-వాగన్ వచ్చేస్తుంది అని హడావిడి చేసి చివరికి సింపుల్ గా "సొమ్ములు పోయాయి ఏమి చేయలేము' అని చేతులు దులుపేసుకున్న రాజకీయ నాయకులని చూసాము... ఒక పరిశ్రమను రాష్ట్రానికి తేవటానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు పడే తపన ఎన్నో సార్లు ఈ తరం వారు చదువుకున్నారు... ఇప్పుడు ఒక ప్రత్యక్ష కేసు స్టడీ చూద్దాము .. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం "కియా మోటార్స్" అనంతపురంలో ప్లాంట్ పెడుతుంది అనగానే శబాష్ అనుకున్నాం... బాబుగారికి ఇవన్నీ కరతలామలకం అని జబ్బలు చరిచాము. కానీ ఒక అంతర్జాతీయ సంస్థను, తమిళనాడు, గుజరాత్ లాంటి పోటీదారులను ఎదురుకొని ఒక వెనుకబడిన ప్రాంతానికి తీసుకురావటం అంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో .... ఎంత హార్డవర్క్ జరిగిందో ఈ తమిళ సోదరుడు రాసిన పోస్ట్ ద్వారా తెలుసుకుందాము...

నోట్: ఈ పోస్ట్ ద్వారా "కన్నన్ రామస్వామి" అనే తమిళ సోదరుడు "కియా మోటార్స్" ఎలా ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిందో క్లియర్ గా వివరించారు. కన్నన్ రామస్వామి మాటల్లో ..... "నేను ఈ పోస్టును నా గుండెల్లో అంతులేని బాధతో, పరిస్థితి ఇలాగే కొనసాగితే తమిళనాడు భవిష్యత్తు ఏమౌతుంది అనే టెన్షన్ తో రాస్తున్నాను. దక్షిణ కొరియా దేశానికి చెందిన ఆటోమొబైల్ సంస్థ "కియా మోటార్స్" (ఇది దక్షిణ కొరియా మూలస్తంభాల్లాలో ఒకటిగా చెప్పబడే హ్యుందాయ్ కంపెనీ'కి సబ్సిడరీ) భారతదేశములో తన బ్రాండ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్.యు.వి.లు)/ సెడాన్లు తయారు చెయ్యటానికి ప్లాంట్ నెలకొల్పదల్చుకున్నది.

cbn kia 02052017 1

ఆ కంపెనీ'కి సంబంధించి స్థానిక సలహాదారులుగా మేము విశ్లేషణాత్మకంగా, లోతుగా సర్వే చేసి మొదటి ఛాయస్ గా తమిళనాడు రాష్ట్రాన్ని, రెండో ఛాయస్ గా గుజరాత్ రాష్ట్రాన్ని, మూడో ఛాయస్ గా శ్రీ సిటీ (ఆంధ్ర ప్రదేశ్) ను ప్రతిపాదించాము. మా సలహా మేరకు కియా మోటార్స్ ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించటం, తమిళనాడు పరిశ్రమల శాఖ మరియు సిప్కాట్ () కావాల్సిన మేరకు భూమిని ఒరగడం కాంప్లెక్స్ () వద్ద కేటాయించుటకు ఒప్పందం జరిగింది. కియా మోటార్స్ భూమితో పాటు, టాక్స్ హాలిడే, పవర్ సబ్సిడీ, మౌలిక సదుపాయాలు (రోడ్లు, నీరు, డ్రైనేజీ, సింగల్ విండో క్లీరెన్సులు). వీటికి తమిళనాడు ప్రభుత్వం ఓకే చెప్పింది. వీటితో పాటు దాదాపు డబ్భై అన్సెల్లరీ యూనిట్లను దక్షిణ కొరియా నుండి తమిళనాడుకు తరలించుటకు కూడా ఏర్పాట్లు జరిగాయి. కియా ప్లాంట్ సిద్ధమయ్యేనాటికి ఈ అన్సెల్లరీ యూనిట్లు వాటి వాటి విభాగాల్లో రెడీగా ఉండాలి అని.

cbn kia 02052017 1

అయితే సినిమా ఇక్కడే అడ్డం తిరిగింది... తమిళనాడు పొలిటిషన్స్ కియా మోటార్స్ కు కేటాయించదల్చిన భూమి గవర్నమెంట్ విలువ కంటే యాభై శతం () ఎక్కువ రేట్ లంచం గా అడిగారు. దీనితో కియా మోటార్స్ యాజమాన్యం ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లిపోవటానికి నిర్ణయించుకుంది. అయితే మేము చెప్పినట్టు "శ్రీ సిటీ" కి కాదు. వెనుకబడిన ప్రాంతం అయినా అనంతపురం జిల్లాకి (ఈ జిల్లాలో నీటివనరులు కూడా చాలా పరిమితం). అయితే కియా మోటార్స్ అనంతపురం ను ఎన్నుకోటం వెనుక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది. అనంతపురంలో కియా ప్లాంట్ పెట్టించటానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో రాయతీలు ఇచ్చారు. కియా మోటార్స్ ప్లాంట్ ను బెంగళూరు-ముంబై రహదారికి/ బెంగళూరు-హైదరాబాద్ రహదారికి అనుసంధానించటానికి 200 ఫీట్ హైవే రోడ్లు శ్రీ చంద్రబాబు గారు చేసిన వాగ్ధానాల్లో ఒకటి.

మా కన్సల్టింగ్ టీం దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడింది కియా మోటార్స్ తమిళనాడు లో ప్లాంట్ పెట్టేలా ఒప్పించటానికి. ఇప్పటికే తమిళనాడు లో ఉన్న హ్యుండై యాజమాన్యం కూడా మాతో పాటు ఎంతో కృషి చేసింది. మా ప్రయత్నానికి కావాల్సిన అన్ని వనరులను హ్యుందాయ్ టీం సమకూర్చింది. ఇప్పుడు కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లిపోవటంతో కియా ప్లాంట్ ద్వారా తమిళనాడు కు రావాల్సిన 1. 1 బిలియన్ డాలర్స్ పెట్టుబడులే కాకుండా... 70 అన్సెల్లరీ యూనిట్స్ ద్వారా రావాల్సిన పెట్టుబడులు, ఉద్యోగాలు అన్ని తమిళనాడు రాష్ట్రం నష్టపోయింది. ఇలాగే కొనసాగితే తమిళనాడు రాష్ట్రం చివరి రాంక్ కు చేరుకోటానికి ఎక్కువ కాలం పట్టదు. సిగ్గుతో తలవంచుకుంటున్నాను .... నేను వ్యక్తిగతంగా రాష్ట్రపతి పాలనను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలనా మాత్రమే తమిళనాడు రాష్ట్రాన్ని గాడిలోపెట్టగలదు అని నమ్ముతున్నాను..... కన్నన్ రామస్వామి"

Advertisements

Advertisements

Latest Articles

Most Read