పేరుకు యువనాయకులం అని చెప్పుకుంటూ యువత ఆలోచనల్లో అవినీతి బీజాలను నాటుతూ, కుల, మత విద్వేషాల చిచ్చుకు వారిని సమిధలుగా వాడుకుంటున్న వారికంటే చంద్రబాబు ఎంతో నవయువకుడని, యువతకు అసలైన స్ఫూర్తిదాయక నాయకుడని నిన్న చిత్తూరు జిల్లాలోని పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల జూబిలేషన్‌ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రసంగం చెబుతోంది. విద్యార్థుల్లో కొత్త శక్తి నింపిన ఆ ప్రసంగంలోని కొంత భాగం...

"సాధారణంగా ఆలోచిస్తే ఉద్యోగం వస్తుంది, వినూత్నంగా ఆలోచిస్తే పరిశ్రమ స్థాపించే శక్తి వస్తుంది. మూస విధానాలను దాటి విద్యార్థులు కొత్తగా ఆలోచించాలి. అద్భుతాలు సృష్టించేందుకు పుష్కలంగా వనరులున్నాయి. ప్రపంచంలోని వివిధ సంస్థలకు భవిష్యత్తులో సీఈవోలు, సీనియర్‌ అధికారులను అందించే కేంద్రంగా రాష్ట్రం ముందుంటుంది. ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్థల్లో తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో నాయకులను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. ఇందుకు పాఠ్యపుస్తకాల సిలబస్‌లో మార్పులు చేయాల్సి ఉంది. ఐటీ తెలుగువాళ్ల జన్యువులోనే ఉంది. దేశ యువతకు అచంచలమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వాటిని సమర్థంగా వినియోగించేలా చిత్తూరు జిల్లాలోనే నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కృషి చేస్తున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకు వస్తాను. విద్యార్థులు విద్యుత్తు, వ్యవసాయంపై పరిశోధనలు చేయాలి. సరికొత్త సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఐవోటీ నాలుగో విప్లవంగా మారింది. విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు....

నేను మహా అయితే 20..30 ఏళ్లు బతుకుతాను. నా కుటుంబానికి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పనిలేదు. నా కష్టం.. ఆలోచన అంతా మీ గురించే. రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి. అదే నా తపన. మీకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ఎంతో శ్రమిస్తున్నా. నాకు అండగా ఉంటానని మాట ఇవ్వండి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌ చేస్తా. ప్రపంచంలోనే ద బెస్ట్‌ స్టేట్‌గా నిలుపుతా" అని సీఎం తెలిపారు.

సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాల్లో తాను ఎక్కువ గడపనని, కానీ ఇక్కడ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను చైతన్యపరచడం కోసం ఎక్కువ సేపు గడుపుతున్నానని సీఎం పేర్కొన్నారు. ‘ఇక్కడ 4500 మంది ఉన్నారు. నా ప్రసంగంతో 450 మంది చైతన్యమై వినూత్నంగా ఆలోచించి పారిశ్రామికవేత్తలుగా మారినా చాలు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఇంత సేపు గడిపా’ అని సీఎం ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read