మన మొబైల్ ఫోన్ వెనుక, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్ అని చూస్తూ ఉంటాం... సెల్కాన్, మైక్రోమాక్స్ లాంటి కంపెనీలు మీద మేడ్ ఇన్ ఇండియా అని చూస్తూ ఉంటాం... కాని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థ, షియామీ, రెడ్‌మి 2 ప్రైమ్‌ మొబైల్స మీద మాక్ ఇన్ ఇండియా అని, అది కూడా మన చిత్తూరు జిల్లలో అని ఆ ఫోన్ మీద చూస్తే ఆ కిక్కే వేరు కాదూ...

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మొబైల్‌ ఫోన్లను చైనాకు చెందిన షియామీ కంపెనీ రాష్ట్రంలోని శ్రీ సిటీకి చెందిన ఫాక్స్‌ కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ భాగస్వామ్యంతో రెడ్‌మి 2 ఫోన్‌ను తయారీ చేస్తోంది. 'మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఇన్ ఎపి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తయారైన తొలి దేశీయ షియామీ మొబైల్ ఫోనును ఆగష్టు 10, 2015న మార్కెట్లోకి విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫాక్స్ కాన్ తయారీ విభాగం, ప్రస్తుతం నెలకు 10 లక్షల యూనిట్ లను తయారు చేస్తోంది. 25 అసెంబ్లింగ్ విభాగాలలో 6,000 మంది పనిచేస్తున్నారు.

చైనాకే చెందిన మరో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ జియోనీ కూడా ఏపీలో తయారీ యూనిట్ చేపట్టింది. తమ ‘ఎఫ్’ సిరీస్, ‘పి’ సిరీస్ ఫోన్‌ల తయారీని ఫాక్స్‌కాన్‌కు ఔట్‌సోర్స్ చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి, మన నవ్యాంధ్రలో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెడ్‌మి 2 లాంటి మొబైల్‌ ఫోన్స్, ఇక్కడ ఎలా తాయారు చేస్తున్నారో, అక్కడ ఉపాధి దొరకటంతో అక్కడి యువత ఎంత సంతోషంగా ఉన్నారో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read