అంతర్జాతీయ హంగులతో విశాఖ విమానాశ్రయం ముస్తాబైంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానయానానికి అవకాశాలు ఉండడంతో ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్‌ ఇండియా సర్వీసులు నడిపేందుకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు, విదేశాలకు కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశ్యంతో విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. నూతన రాష్ట్రంగా అవతరించాక ప్రయాణికుల రాకపోకలు విశాఖ, గన్నవరంలో విపరీతంగా పెరిగాయి. విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సింగపూర్‌, రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ తదితర ప్రాంతాల నుంచి వివిధ పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు, వారి ప్రతినిధులు తరుచుగా విశాఖకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఫిన్‌టెక్‌ సీటిగా గుర్తింపు పొందిన విశాఖ ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులతో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూలై 8వ తేదీ నుంచి విశాఖకు విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అనుమతిచ్చింది. దీనిలో భాగంగా శ్రీలకంలోని కొలంబో నుంచి విశాఖకు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు నడపనుంది. జూలై 8 నుంచి ఏపీలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొలంబో నుంచి విశాఖకు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానం సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో సర్వీసులు నడపపనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read