ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నగర నిర్మాణంలో వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. 22 నాటికి ప్రధాన ఆకృతుల డిజైనుల ఖరారు చేసే పనిలో నిమగ్నమైనటు తెలిసింది. మరో పక్క ఇందులో భాగంగానే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొమ్మిది అంతర్గత నగరాలకు భూముల కేటాయింపు పూర్తయింది.

ఈ తొమ్మిది అంతర్గత నగరాల్ని అనుసంధానం చేస్తూ విశాలమైన 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల వెడల్పుతో 215 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు వేస్తారు. 25 మీటర్ల వెడల్పుతో మరికొన్నిరోడ్డులు వేస్తారు.

97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల అంతర్గత రింగ్ రోడ్డు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల ఔటర్ రింగ్ నిర్మిస్తారు. 134 కిలోమీటర్ల పొడవునా మెట్రో రైల్ మార్గం ఏర్పాటు చేస్తారు. కాలుష్య రహిత నగర నిర్మాణ నిమిత్తం జలకళతో పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళతో ప్రకృతి రమణీయంగా దీన్ని నిర్మిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన ఆధునిక వసతుల్లో నిర్మించే ప్రధాన నగరాలకు సంబంధించి నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థ ప్రధాన ఆకృతుల్నిరూపుదిద్దుతోంది. వీటిని ప్రభుత్వానికి ఈనెల 22న అందజేస్తుంది. అనంతరం వీటిపై పూర్తి స్థాయిలో చర్చించి మార్పులు, చేర్పులు చేసి వెనువెంటనే నిర్మాణాల్ని మొదలెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రైతులు నుంచి సమీకరించిన భూములు: 32.448 ఎకరాలు
మొత్తం అందుబాటులో ఉన్నభూములు:53,647 ఎకరాలు

పర్యాటక నగరం : 11,574 ఎకరాలు
విజ్ఞాన నగరం : 8,547 ఎకరాలు
ఎలక్ట్రానిక్స్ నగరం : 6,582 ఎకరాలు
ఆరోగ్య నగరం : 6,511 ఎకరాలు
ఆర్ధిక నగరం : 5,168 ఎకరాలు
మీడియా నగరం : 5,107 ఎకరాలు
క్రీడల నగరం : 4,150 ఎకరాలు
న్యాయ నగరం : 3,438 ఎకరాలు
పరిపాలనా నగరం : 2,702 ఎకరాలు

పర్యాటక నగరం:
ఇందులో స్టార్ హోటళ్ళు, పర్యాటక రంగ కార్యాలయాలు ఉంటాయి. 11,574 ఎకరాల్లో 8,778 ఎకరాల్ని వినోద అవసరాలు, ప్రజాపయోగ బహిరంగ ప్రదేశంగా నిర్ధారించారు. గృహావసరాలకు 1397 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 451 ఎకరాలు, పరిశ్రమలకు 100 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 156 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 692 ఎకరాలు కేటాయించారు.

విజ్ఞాన నగరం
విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఇందులో ఉంటాయి. గృహావసరాలకు 3,562ఎకరాలు, వినోద, ఇతర ప్రజాప్రయోజనాలకు 1340 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 1257 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 979 ఎకరాలు, పరిశ్రమలకు 87 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 1322 ఎకరాలు కేటాయించారు.

ఎలక్షానిక్స్ నగరం
ఇందులో ఎలక్షానిక్స్ ఉత్పాదక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు ఉంటాయి. మొత్తం 6582ఎకరాలకు గాను గృహావసరాలకు 1862 ఎకరాలు, పరిశ్రమలకు 1618 ఎకరాలు. వినోదం ఇతర ప్రయోజనాలకు 757 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 682 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 645 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 503 ఎకరాలు కేటాయించారు.

ఆరోగ్యనగరం
ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు, వైద్య విశ్వ విద్యాలయాలుంటాయి. మొత్తం 6511ఎ కరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 3,306 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 1072 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 1048 ఎకరాలు, వినోదం, ఇతర ప్రయోజనాలకు 580 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 504 ఎకరాలు కేటాయించారు.

ఆర్థిక నగరం
ఆర్థిక శాఖకు చెందిన కార్యాలయాలు ఉంటాయి. మొత్తం 5,168 ఎకరాల్లోనూ గృహావసరాలకు 1389 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక ప్రయోజనాలకు 1250 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 884 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 828 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 756 ఎకరాలు, పారిశ్రామిక రంగానికి 101 ఎకరాలు కేటాయించారు.

క్రీడల నగరం
ఇందులో క్రీడా మైదానాలు, పరిపాలనా కార్యాలయాలుంటాయి. మొత్తం 4150 ఎకరాలకు గాను గృహావసరాలకు 1819ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 693 ఎకరాలు, సామాజిక ప్రయోజనాలకు 555 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 513 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 436 ఎకరాలు, పారిశ్రామిక అవసరాలకు 134 ఎకరాలు కేటాయించారు.

న్యాయనగరం
హైకోర్టుతో పాటు ఇతర న్యాయస్థానాలు, పరిపాలనా కార్యాలయాలుంటాయి. మొత్తం 4438 ఎకరాల్లో గృహావసరాలకు 1276 ఎకరాలు, వినోదానికి 692 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 545 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 467 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 458 ఎకరాలు కేటాయించారు.

మీడియా నగరం
ఇందులో ఎలక్ట్రానిక్, ప్రింగ్, వెబ్ మీడియాలకు చెందిన కార్యాలయాలు, ఉద్యుగులకు గృహాలు ఉంటాయి. 5107 ఎకరాలకు గాను గృహావసరాలకు 1862 ఎకరాలు, సామాజిక అవసరాలకు, 1291 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 567 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 791 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 346 ఎకరాలు, పారిశ్రామిక అవసరాలకు 256 ఎకరాలు కేటాయించారు.

పరిపాలనానగరం :
ఇందులో శాసనసభ, మండలి, సచివాలయం, ఇతర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలుంటాయి. మొత్తం 2,702 ఎకరాల్లో గృహావసరాలకు 833 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 638 ఎకరాలు, సామాజిక అవసరాలకు 567 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 427 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 237 ఎకరాలు కేటాయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read