రాష్ట్రంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కేంద్ర బిందువుగా విశాఖ నగరం ఆవిర్భవంచబోతోంది. రుషికొండ ఐటి సెజ్‌లో ఫిన్‌టెక్ వ్యాలీ ఏర్పాటుతో విశాఖ ఐటి రంగం రూపురేఖలు మారనున్నాయి. విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టే విధంగా ఫిన్‌టెక్ వ్యాలీ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలకు కేంద్రంగా నిలిచిన పేటిఎం వంటి సంస్థలు ఇక్కడ తమ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసాయి. తద్వారా మరిన్ని సంస్థలు ఫిన్‌టెక్ వ్యాలీలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నాయి.

తాజాగా, ప్రముఖ ఆర్థిక సేల సంస్థలైన వీసా, థామ్సన్‌ రాయిటర్స్‌ తమ కార్యాలయూలను విశాఖ ఫిన్టెక్‌ టవర్స్‌లో ఏర్పాటు చేయునున్నాయి. ఇందుకు సంబంధి సంతకాలు బుధవారాం ముంబై లో, ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్నాయి. ముంబైలో జరుగుతున్న, "Future Decoded" అనే ఐటి సదస్సులో, ఇవాళ ముఖ్యమంత్రి పాల్గుని, ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా, అక్కడకు వచ్చే ప్రముఖ కంపెనీలతో పెట్టుబడలు కోసం చర్చలు జరుపుతారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు.

విశాఖ నగరాన్ని ఐటి హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు, ప్రత్యేక కార్యదర్శి జెఎ చౌదరి చెప్పారు. విశాఖతో పాటు అమరావతి, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాలను కలిపి ఐటి కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో మరిన్ని ఐటి కంపెనీలు ఏర్పాటు కానున్నాయన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read