ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా పరిశిలించారు. ఎండ్ మండిపోతున్న లెక్కచేయకుండా పోలవరం సందర్సించడం ఆయన చిత్తశుద్ధిని తెలుపుతొంది. పోలవరం ప్రాజెక్ట్ గేట్స్ నిర్మాణ పనులు,స్పిల్వే పనులు పరిశీలించారు ముఖ్యమంత్రి. కొండ ప్రాంతం కావడంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద నెల రోజులుగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా పనుల్లో మాత్రం వేగం తగ్గడం లేదు. ముఖ్యంగా గేట్లు, డయాప్రమ్‌ వాల్‌ నిర్మాణంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ పనులు, స్పిల్‌వేలో కాంక్రీట్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు రాక్ ఫిల్ డాం, కాపర్ డయాఫ్రొం వాల్ నిర్మాణ పనులు పరిశీలించి, పలు సూచనలు అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.

ఇప్పటి వరక ఎంత పని జరిగింది అంటే...
పోలవరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టు తొలి దశను 2018కి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు.

ప్రాజెక్ట్ కు మొత్తం 48గేట్లు, ఇందులో 14 గేట్లను ప్రస్తుత సీజన్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం... ఇందులో 12ఇప్పటికే పూర్తయ్యాయి. లక్ష్యానికి మించి మరో నాలుగు గేట్లను ఈ సీజన్లోగానే పూర్తిచేయనున్నారు.

నిర్మాణంలో వినియోగించే అంతర్జాతీయ అధునాత పరికరాలు ఇప్పటికే ముంబయ్ పోర్టుకు చేరుకున్నాయి. మరికొన్ని సముద్రం పై రవాణాలో ఉన్నాయి. ఇవి కూడా ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్న అనంతరం పనుల్ని మరింత సమర్థవంతంగా ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేసే వీలుంటుంది.

గతంతో పోలిస్తే కాంక్రీట్ పనులు వేగం పుంజుకున్నాయి. లక్ష క్యూబిక్ మీటర్ల మొత్తం పనులకు గాను ఇంతవరకు 18,327 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి

419.667 మీటర్ల డయూఫ్రమ్ వాల్ పనులకు గాను 294 మీటర్ల పనులు పూర్తయ్యూయి. ప్రస్తుత సీజన్లో 40 మీటర్ల నిర్మాణం లక్ష్యం కాగా 46 మీటర్ల పనులు పూర్తిచేయగలిగారు

స్ప్రిల్ వేకు సంబంధించి ఫీడ్ ఛానల్లో 356మీటర్ల నుండి 900 మీటర్ల వరకు పనుల్ని జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేయనున్నారు.

పవర్ హౌస్ నిర్మాణానికి సంబంధించి 12లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జూన్ నెలాఖరుకు పూర్తవుతాయి.

మొత్తం ప్రాజెక్ట్కు సంబంధించి 10.55 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనికి గాను ఇంతవరకు 9.84కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం వరకు భూసేకరణ, నిర్వాసితుల, సహాయ, పనరావాసాలకే ఖర్చవుతున్నాయి.

గ్రావిటీ ద్వారా నీరందించే సమయానికి భూసేకరణ, పునరావాస కార్యక్రమాల నిమిత్తం 5వేల కోట్ల వ్యయమౌతుంది. నిర్మాణానికి సంబంధించి 4700 కోట్ల వ్యయం జరుగుతుంది.

గేట్ల వెల్డింగ్ పనుల్ని అధిక ఉష్ణోగ్రతల కారణంగా మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు నిలిపేస్తున్నారు. అలాగే పనుల్లో వేగం మందగించకుండా రాత్రిపూట కూడా పనులు నిర్వహిస్తున్నారు.

నిర్మాణంలో 1589 మంది సాంకేతిక నిపుణులు, 2232 మంది పనివారు పాలుపంచుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read