'ఔనా... నిజమేనా!? పిడుగుపాటును ముందే కనిపెడుతున్నారా? ఇది ఎలా సాధ్యమవుతోంది?'... అనేక రాష్ట్రాలు ఆసక్తిగా సంధిస్తున్న ప్రశ్నలివి. ఏపీలో అందుబాటులోకి వచ్చిన ఈ పరిజ్ఞానంపై అనేక రాష్ట్రాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో పిడుగుపాటు విషయాన్ని ముందే చెప్పే విధానం పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పిడుగుపాటు అంశం పై ఏపీని సంప్రదిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఉపయోగిస్తున్న టెక్నాలజీ పై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. దాదాపు గంట ముందే పిడుగు ఎక్కడ పడుతుందో హెచ్చరించడం అనేది ఎంతో ఆశ్చర్యకరంగా ఉందని ఇతర రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తున్నట్లు అనేక చోట్ల పిడుగులు పడుతున్నాయి. ముందే ఆ ప్రాంతంలో పిడుగుపడుతుందని చెప్పడంతో అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో జరిగే ప్రాణ నష్టాన్ని నివారించేందుకు వీలుకలుగుతోంది. వేసవి కాలంలో ఆకస్మికంగా పడే వర్గాల సమయంలో ఉరుములు, మెరుపులు పడుతుంటాయి. ఇదే సందర్భంలో పిడుగులు పడి రైతులు, జీవాలు చనిపోయిన సందర్భాలు కోకొల్లలు.

దీంతో పిడుగుపడే సమాచారం ఏలా ఉపయోగిస్తున్నారన్న దాని పై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్టాలు రాష్ట విపత్తుల నిర్వహణశాఖను దీని పై సంప్రదించాయి. దీంతో ఆయా రాష్ట్రాలు అడుగుతున్న సమాచారం ఇచ్చేందు కు విపత్తుల నిర్వహణశాఖ సిద్ధమవుతుంది.

ప్రతీ రోజు ఏ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందో 40 నిముషాల ముందే ఆ శాఖ హెచ్చరిస్తోంది. కొద్ది రోజుల్లోనే ఆ శాఖ ఇస్తున్న ప్రకటనల పై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఇది సోషల్ మీడియా లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమాచారంతో ఆయారాష్ట్రాలు ఇక్కడ చేపడుతున్నఆవిష్కరణలపై ఆరా తీస్తున్నాయి. దీనికి ఎంత ఖర్చుఅవతుంది, ఏలా చేపడుతుంది అనే అంశాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ టెక్నాలజీ రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు విపత్తుల నిర్వహణ శాఖ ప్రయత్నిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read