pwd grounds 18012017

కృష్ణా పుష్కరాలకి బెజవాడ వాసులని అలరించిన శ్రీవారి నమూనా ఆలయం, మరలా సిద్ధం అవుతుంది. శ్రీలక్ష్మీ శ్రీనివాస సేవా సమితి నిర్వహణలో జనవరి 22 నుంచి 28వ తేదీ వరకు స్వరాజ్య మైదానంలో శ్రీలక్ష్మీ పౌండరీక యజ్ఞ సహిత శ్రీవారి నిత్యోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకలు తెలిపారు.

తిరుమలలో నిర్వహించే వాహన సేవల రీతిలో రోజూ వాహన సేవలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారి నమూనా ఆలయం నిర్మిస్తున్నామని, ఉత్సవమూర్తులకు శోడపోచారాలతో పూజాదికాలు జరుగుతాయని చెప్పారు. రోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విశిష్ట పూజలుంటాయని, సాయంత్రం 5 గంటలకు ధార్మిక కార్యక్రమాలుంటాయని వివరించారు. కార్యక్రమంలో శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి విద్వాశంకర భారతీ స్వామితో పాటు వివిధ పీఠాలకు చెందిన స్వామీజీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

దేవాలయ నిర్మాణానికి విస్తృత ఏర్పాట్ల
ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యోత్సం, పూజలు, వాహన సేవల కోసం విసృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీవారి దేవాలయ నమూనా, యాగశాల, జయవిజయుల విగ్రహాలు నిర్మిస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 5 నుంచి దర్శనానికి అనుమతిస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read