satya nadella withcbn 17012017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ తీసుకు రావడంలో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను సత్య నాదేళ్లకు సీఎం చంద్రబాబు వివరించారు. సత్య నాదెళ్ల తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ జరిపిన సందర్భంగా ప్రస్తుతం 30 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీలను మార్చి నాటికి 70 శాతానికి తీసుకు రావాలని కృత నిశ్చయంతో ఉన్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇ- గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలలో కలిసి పని చేయాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ను సీఎం కోరారు.
హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఏపీ అంది పుచ్చుకోవాలని సత్యా నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఏపీ, ఇండియాల్లో సాంకేతిక ప్రగతికి ఈ తరహా హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీ దోహదం చేయగలదని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తాజాగా లింక్డిన్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిందని, ఈ అంశంలో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు సత్య నాదెళ్ల తెలిపారు. నిపుణులైన జన సమూహం, వృత్తి నైపుణ్యం తదితర వివరాలు డిజిటలైజ్ చేయాలన్నారు. ఏపీలో ఈ కసరత్తు జరగాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సూచించారు.

వచ్చే దావోస్ సదస్సు నాటికి అంటే యేడాది లోగా హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీలో ఆశించిన ప్రగతి సాధించాలని ఇరువురి ఏకాభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read