గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవటంతో, ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఇండిగో, ఎయిర్‌ ఏషియా సంస్థలు అంతర్జాతీయ విమానా సర్వీసులు నడపటానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారికంగా త్వరలోనే దీని పై ఒక ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఏటా లక్షల మంది దేశ, విదేశాలకు వెళ్తుంటారు. వీరంతా హైదరాబాద్‌, చెన్నై, ముంబయి వంటి నగరాలకు వెళ్లి అక్కడి విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. కేవలం హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్తున్న వాళ్లలో 25శాతం ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే. ఇక విదేశాలకు నేరుగా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. పర్యటకంగా కూడా ఎంతో మేలు జరగబోతోంది.

జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడంవల్ల పోటీ పెరిగి తక్కువ ధరకే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకం వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ ప్రయాణికులు, కార్గో ట్రాఫిక్‌ పెరగడం ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థికాభివృద్ధికి బాటలు పరుస్తుంది.

ఇప్పటికే, పాత టెర్మినల్‌ను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకు రావటానికి టెండర్లు పిలిచారు. కస్టమ్స్‌ , ఇమ్మిగ్రేషన్‌ శాఖల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క, రన్‌వే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read