vizag twin twoers 18012017

విశాఖను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆధ్వర్యంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులోకి వచ్చే విధంగా రెండు టవర్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్మాణ సంస్థను ఇప్పటికే గుర్తించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.టి టక్కర్ వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, ఐటీ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు టవర్లు ఏర్పాటు కోసం ఇప్పటికే ట్రేడ్ సెంటర్ సీఈవోతో చర్చలు జరిపామని, వీటి నిర్మాణానికి ఒక సంస్థను కూడా గుర్తించామన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే విశాఖనగరం ఐటీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనంలోనే ఒక 5 స్టార్ హోటల్ కూడా వస్తుందని చెప్పారు. ఐటీరంగంలో విశాఖలో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశాలున్నాయని, ప్రస్తుతం ఇక్కడ 18 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్టు పేర్కొ న్నారు.

విశాఖలో ఐటీ రంగం అభివృద్ధి సమస్యలపై గురువారం నాడు అమరావతిలో ఐటి కార్యదర్శి ఐటీ సంస్థ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read