విజయవాడ దుర్గ గుడిలో జరిగిన అక్రమాల్లో ఒక్కోటి బయటకు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా దుర్గగుడిలో ఏసీబీ అధికారులు మూడు రోజులు పాటు నిర్వహించిన తనిఖీల్లో, తమ పరిశీలనలోకి వచ్చిన విషయాలు అన్నిటినీ కూడా, ప్రాధమిక నివేదికను ఇప్పటికే దేవాదయ శాఖకు అందించారు. అయితే దీని పై ఇప్పటికే మొత్తం వివిధ స్థాయిల్లో ఉన్న పదమూడు మంది పై, సస్పెన్షన్ వేటు వేసారు. ఇటీవల కాలంలో దుర్గగుడిలో, వెండి రధానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయం అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే దుర్గ గుడికి సెక్యూరిటీగా ఉన్న ఏజెన్సీని మార్చాలని చెప్పి, బద్రతా వైఫల్యం వల్లే ఈ మూడు సింహాలు మాయం అయ్యాయని అప్పట్లో నివేదిక కూడా వచ్చింది. ఈ నివేదిక ప్రకారం అప్పట్లోనే, ఆ సెక్యూరిటీ ఏజెన్సీని మార్చాలని చెప్పి ఒత్తిడి వచ్చినా కూడా, ఈవో అవేమి పట్టించుకోకుండా, వారినే కొనసాగించటం పై దేవాదాయ శాఖ కమీషనర్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. పైగా, అసలు ఈ సంస్థకు టెండర్ కేటాయించటం పై కూడా, అక్రమాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో పటు ప్రస్తుతం జరుగుతున్న వైఫల్యాలకు సంబంధించి కూడా దేవాదాయ శాఖ కమీషనర్ మొత్తం 13 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాత, మరికొంత మంది పై చర్యలు తీసుకొనే అవకాసం ఉంది. అయితే అసలు దుర్గగుడిలో అక్రమాలకు మూల కారణం అయిన ఈవో సురేష్ బాబు, అతన్ని వెనకేసుకుని వస్తున్న మంత్రి వెల్లంపల్లి పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పై, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈవో సురేష్ బాబు స్వరూపానంద దగ్గరకు వెళ్లి, తనపై చర్యలు తీసుకోకుండా, పై నుంచి చక్రం తిప్పారని ఆరోపణలు వస్తున్నాయి. అసలు వాడిని వదిలేసి చిన్న చిన్న ఉద్యోగులు పై చర్యలు తీసుకుని ఏమి లాభం అని ఆరోపణలు వస్తున్నాయి. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే, మంత్రి వెల్లంపల్లి పై ఘాటుగా విమర్శలు చేసారు. అసలు దొంగ అయిన వెల్లంపల్లి పై చర్యలు తీసుకోకుండా, ఉద్యోగులు పై చర్యలు తీసుకుని ఏమి లాభం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read