పవర్ ఎక్స్చేంజ్ లో ఈరోజు నుంచి విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తామని, నిన్న సాయంత్రం కేంద్రం రాష్ట్రానికి సమాచారం పంపింది. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ విద్యుత్ డిమాండ్ పెరుగుతూ ఉండడంతో, దాదాపుగా 210 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉంది. అయితే సొంతంగా మాత్రం ఏపీజెన్కో కేవలం 180 నుంచి 190 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుత్ తయారు చేయగలుగుతుంది. దీంతో 20 నుంచి 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో నేషనల్ పవర్ ఎక్స్చేంజ్లో రోజుకు 12 కోట్ల రూపాయలు వెచ్చించి, 20 మిలియన్ యూనిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే డిస్కమ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 13 రాష్ట్రాలకు విద్యుత్ ఎక్స్చేంజి నుంచి కొనుగోలు నిలిపివేస్తామని గతంలోనే హెచ్చరించింది. వాయిదాల పద్ధతిలో ఈ మొత్తం చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించింది. వాయిదాల పద్ధతి పేమెంట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేరింది. అయితే రెండు రోజుల క్రితం 1600 కోట్ల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కేవలం బుక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే జరగాల్సి ఉందని అంటుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తామని చెప్పడంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రెండు రోజుల క్రితం 1600 కోట్లు చెల్లించామని కేంద్రానికి లేఖ రాశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఏమి చేస్తుందో వేచిచూడాల్సి ఉంది. అయితే ముందుగా చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం ఈ రోజు నుంచి విద్యుత్ కొనుగోలు నిలిచిపోనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈరోజు కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రతిపాదనలను అంగీకరించకపోతే రాష్ట్రంలో అంధకారం తప్పదు. కేంద్రం కనుక అంగీకరించకపోతే రాష్ట్రంలో 20 మిలియన్ యూనిట్ల వరకు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కింద రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read