సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా, నెల రోజుల్లో రద్దు చేస్తా అని హామీ ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయినా, హామీ ఎందుకు నెరవేర్చలేదని నిలదీసింది ఉద్యోగులు. జగన్ తమని మోసం చేసారని, సీపీఎస్ రద్దు చేయాలి అంటూ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపు ఇచ్చారు. పిలుపు మాత్రమే ఇచ్చారు కానీ, ఎక్కడా పెద్దగా ఏర్పాట్లు, సన్నాహక సమావేశాలు చేయలేదు. అయినా ప్రభుత్వం వణికిపోయింది. తాము తప్పు చేసాం, మోసం చేసాం, ఉద్యోగులు తమని వదిలి పెట్టరు అనే భయమో లేక, ఆరు నెలల క్రితం , మెరుపు వేగంతో విజయవాడల జరిగిన ర్యాలీ గుర్తుకు వచ్చో కానీ, ప్రభుత్వం వణికిపోయింది. దాదపుగా 20 రోజులు ముందు నుంచే, ఉద్యోగులని వేటాడారు. విజయవాడ వెళ్ళారో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. లక్షల ఫైన్ వేస్తాం అని బెదిరించారు. నోటీసులు, బైండ్ ఓవర్ కేసులు, అరెస్ట్ లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా ఒక్కో టీచర్ కు, ఒక్కో పోలీస్ అన్నట్టు, గత 20 రోజులుగా వాతావరణం మార్చేసారు. చివరకు సీపీఎస్ చెక్ పోస్ట్ లు అంటూ, ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి, బస్సులు, కార్లు, లారీలు, ఇలా అన్నీ చెక్ చేసి, ఉద్యోగులు విజయవాడ వెళ్తున్నారా అని ఆరా తీసారు.

సహజంగా ఉద్యోగుల పై ప్రజల్లో, వ్యతిరేక భావం ఉండేది. కానీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు చూసి, సామాన్యులు కూడా తమ అభిప్రాయం మార్చుకుని, ఉద్యోగుల వైపే నిలిచారు. జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కాదా, హామీలు నెరవేర్చమంటే, ఈ నిర్భందాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి, ఉద్యోగులు జగన ఇల్లు ముట్టడించకముందే,పోలీసులు ఉద్యోగుల ఇల్లు ముట్టడించినంత పని చేసారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ చేసిన ఏర్పాట్లు చూసి, ఇదో వార్ జోన్ అనుకునేలా చేసారు. జగన్ ఇంటికి వెళ్ళే దార్లు అన్నీ, నాలుగు రోజుల ముందే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇనుప ముళ్ళ కంచెలు వేసేసారు. పోలీసులతో విజయవాడలో ఫ్లాగ్ మార్చ్ చేసారు. చివరకు ఈ నిర్బంధాలు చూసిన ఉద్యోగులు, తమ కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. ఈ చర్యతో, వైసీపీ ప్రభుత్వం, ఉద్యోగుల ఉద్యమం అంటే, ఎంతలా వణికిపోయిందో సామాన్య ప్రజలకు కూడా అర్ధమైంది. ఉద్యోగులు ఈ నిర్బంధాలు దాటుకుని, భవిష్యత్తులో, ఎలా ముందుకు వెళ్లి, తమ హక్కులు సాధించుకుంటారో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read