ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి, నిన్న రాత్రి మృతి చెందారు. ఆయన వయసు కేవలం 34 ఏళ్ళు. అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోవటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కుంచనపల్లిలో ఉన్న అవంతి అపార్ట్‌మెంట్‌ లోని 101వ నంబరు ఫ్లాటులో, ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఫ్లాట్ కాపు రామచంద్రారెడ్డిదా ? లేక ఎవరిది అనేది తెలియదు కానీ, కాపు రామచంద్రా రెడ్డి అల్లుడు మాత్రం, తరుచూ ఈ ఫ్లాట్ కి వచ్చి, వెళ్తూ ఉంటారని తెలుస్తుంది. మూడు రోజుల క్రితం, ఈ ఫ్లాట్ కి వచ్చిన కాపు రామచంద్రారెడ్డి అల్లుడు, నిన్న చనిపోయి కనిపించాడు. అయితే ఆయన ఎలా మృతి చెందారు అనేది మాత్రం మిస్టరీగా మారింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ, సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం, అలా కనిపించటం లేదని, స్థానికులు చెప్తున్నారు.

దీంతో దీన్ని అందరూ ఆత్మహత్యగా కాకుండా, అనుమానాస్పద మృతిగానే భావిస్తున్నారు. ఇంట హైప్రొఫైల్ కేసులో కూడా, పోలీసులు ఇప్పటి వరకు స్పందించకపోవటం, మేడయా ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవటంతో, ఈ అనుమానాలు మరింత బల పడుతున్నాయి. స్థానికుల వివరాలు ప్రకారం, 101 ఫ్లాటు బాధ్యతలు నరేంద్రరెడ్డి అనే వ్యక్తి చూసే వారని, ఆయన నిన్న సాయంత్రం 5.30 గంటలకు ఫ్లాట్ కి వచ్చారని, తరువాత కొద్ది సేపటికి అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. అయితే మంజునాథరెడ్డి లోపల గొళ్లెం పెట్టుకుని ఉండటంతో, తాను కిటికీలో నుంచి గొళ్లెం తీసి లోపలకు వెళ్ళాలని, నరేంద్రరెడ్డి చెప్పినట్టు స్థానికులు చెప్తున్నారు. మంజునాథరెడ్డి పడిపోయాడు, అంబులెన్స్ ఎక్కించాలని మమ్మల్ని పిలవటంతో, మేము వెళ్లామని, అప్పటికే ఆయన మంచం పక్కనే కింద పడుకున్నట్టు కనిపించాడని, ఏమి జరిగిందో అర్ధం కావటం లేదని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మంజునాథరెడ్డి మృతదేహం ప్రస్తుతం మణిపాల్‌ ఆసుపత్రిలో ఉంది. మొత్తానికి ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఏమి చెప్తారో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read