కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ లెక్కల్లో విస్తుపోయే విషయాలు... అందుకేనా దేశం మొత్తం మన వైపు చూస్తుంది.. ?

సీఎంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్ల‌కి పైగానే అయ్యింది. దేశ‌మంతా ఏపీవైపు చూసేలా ప‌రిపాల‌న సాగిస్తున్నా..ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది అంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు దేశంలోనే ఏపీ పరిస్తితి చూసి విస్తుపోయే పరిస్థితి. ఆర్ధిక నేరాల దగ్గర నుంచి రాజద్రోహం కేసులు వరకు, ఏపిలో జరుగుతున్న తీరు కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ గ‌ణాంకాల‌తో వెల్ల‌డించింది. వైసీపీ ప్రభుత్వం సాధించిన ఈ ఘ‌న‌త‌ని త‌మ మీడియాలో క‌న‌ప‌డ‌కుండా ఎల్లో మీడియా జాగ్ర‌త్త‌లు తీసుకుందని మరి వైసీపీ ప్రచారం చేస్తుందేమో. ఏపీని ఆర్థిక నేరాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా జగన్ మోహన్ రెడ్డి నిలిపారు. తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన 2019లో 8,806 ఆర్థిక మోసాల‌కి సంబంధించిన కేసులు న‌మోదు కాగా, 2021లో 9273 ఆర్థిక నేరాల‌కి చేర్చ‌గ‌లిగారు. ప్ర‌కృతి వ‌న‌రుల విధ్వంసం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్య నిబంధ‌ల‌ను అతిక్ర‌మించిన కేసుల్లోనూ ఏపీని నెంబ‌ర్‌వ‌న్గా నిల‌ప‌డంలో వైసీపీ ప్రభుత్వం విజ‌యం సాధించింది. ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘ‌న‌లపై కేసులు 2019లో 188 న‌మోదుకాగా, 2021నాటికి ఈ కేసుల‌ని ``420``గా పెంచ‌గలిగారు. ఏజెన్సీ ప్రాంతంలో భ‌మిడిక‌లొద్ది, రుషికొండ‌, మ‌డ అడ‌వుల్ని సైతం ఎలా విధ్వంసం చేస్తున్నారో, మన కళ్ళ ముందు చూస్తున్నాం.

మ‌రో విష‌యంలోనైతే ఏపీ ద‌రిదాపుల్లో దేశంలోని ఏ రాష్ట్రమూ లేదు. 2021లో దేశ‌వ్యాప్తంగా 76 దేశ‌ద్రోహం కేసులు న‌మోదు చేస్తే..ఏపీలో 29 దేశ‌ద్రోహం కేసులు న‌మోదు చేయించిన త‌న‌తో పోటీకొచ్చేవారు ఎవ‌రైనా వున్నారా అంటూ స‌వాల్ విసురుతున్నారు జగన్. జ‌గ‌న్‌ పెట్టించిన ఈ దేశ‌ద్రోహం కేసుల‌న్నీ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైనే అన్న‌ది మ‌రో ముఖ్య‌మైన విష‌యం. ఇక మహిళల పై దాడులు, ఎస్సీ, ఎస్టీల పై దాడులు, రైతు ఆత్మహత్యలు, ఇలా అనేక విషయాల్లో మొదటి స్థానం రాకపోయినా, పోయిన ఏడాది కంటే, ఈ ఏడాది నేరాలు బాగా పెరిగాయి, రైతు ఆత్మహత్యలు పెరిగాయి.

2018తో పోల్చితే, 2021లో 53% నేరాలు పెరిగాయి. 2021లో అత్యాచారాలు 8.49% పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఎస్సీల పై జరిగిన నేరాల్లో 4% ఆంధ్రప్రదేశ్ నుంచే. ప్రతి లక్ష ఎస్టీ జనాభాకు 13.7 నేరాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏడాదిలో 956 మర్డర్లు జరిగాయి, అంటే రోజుకి రెండు నుంచి మూడు మర్ధర్లు జరుగుతున్నాయి. 2018తో పోల్చితే 43% ఆర్ధిక నేరాలు పెరిగాయి. పోలీసులే నేరాలకు పాల్పడుతున్న రాష్ట్రాల్లో 5వ స్థానంలో ఏపి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజద్రోహం కేసులు నమోదులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఎన్నికల సమయంలో కేసులు నమోదులో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఆహరం కల్తీలో, దేశంలోనే మొదటి స్థానంలో ఏపి ఉంది. నిరుద్యోగుల ఆత్మహత్యల్లో, 15% పెరుగుదల ఉంది. రోజుకి ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యల్లో, దేశంలో మూడో స్థానంలో ఏపీ ఉంది. రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కౌలురైతుల ఆత్మహత్యల్లో, ఏపి రెండో స్థానంలో ఉండగా, రైతు కూలీల ఆత్మహత్యల్లో, ఏపి టాప్ లో ఉంది.

జ‌గ‌న్‌ పాల‌న‌లో పెరిగిన నేరాలు-ఘోరాల‌కి సంబంధించిన గ‌ణాంకాల‌ని వెల్ల‌డించింది కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ప‌నిచేసే నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCBR). మరి, ఇవి కూడా గొప్పగా చెప్పుకుంటారో ? లేక ఎల్లో మీడియా కుట్ర అని కొట్టిపారేస్తారో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read